నిమ్మజాతి

నిమ్మ జాతి మొక్కలలో నల్ల మచ్చ తెగులు

Phyllosticta citricarpa

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పండ్ల పైన వివిధ రకాల మచ్చలు వుంటాయి.
  • అవి ఇన్ఫెక్టన్ యొక్క తీవ్రతను బట్టి పండ్లు మరియు ఆకులపై వివిధ రకాలుగా లక్షణాలు ఉంటాయి.
  • హార్డ్ స్పాట్ గాయాలు, ఫాల్స్ మెలనోజ్, ఫ్రేకల్ స్పాట్స్ మరియు తెగులుకు సంబంధించిన మచ్చలు వుంటాయి.
  • ఇవి ఉన్నప్పుడు, ఆకు మచ్చలు చిన్నగా వుంటాయి.
  • కొంచెం లోతుగా నిర్జీవ మచ్చలు ఒక కాంతి లాంటి కేంద్రంతో ఉండి, నల్లటి అంచు మరియు క్లోరోటిక్ వలయంతో కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

పండ్ల మీద ఫంగస్ కలిగించే వివిధ రకాల లక్షణాలను మనం గమనించవచ్చు. కటినమైన గాయాల మచ్చలు అనేక మిల్లీమీటర్ల వ్యాసంలో ఉంటాయి. ఈ మచ్చలు ఒక తేలికపాటి కేంద్రం, నల్ల అంచుకు ముదురు గోధుమ రంగు, మరియు పక్వమైన నారింజ పండు మీద ఆకుపచ్చ వృత్తాన్ని కలిగి ఉంటాయి. ఫాల్స్ మెలనోజ్ ఆకుపచ్చ పండ్ల పైన దగ్గర దగ్గరగా నల్లని గోధుమ రంగుతో ముదురు గోధుమ రంగులో వుంటాయి. మచ్చలు నారింజ రంగు నుండి ఎరుపు రంగులో, చదునుగా, 1-3 మిల్లీమీటర్ల వ్యాసంలో సీజన్ చివర్లో ఏర్పడతాయి. మచ్చలు ముదిరే కొద్ది గోధుమ రంగులోకి మారుతాయి. ఇంకా తీవ్రమైన మచ్చలు పెద్దవిగా వుండి, గుంతలతో ముదిరిన పండ్ల మీద చిందర వందరగా పెద్ద మొత్తంలో వుంటాయి. సాధారణంగా ఈ మచ్చలు ఆకులపై ఏర్పడవు కానీ కొన్నిసార్లు నిమ్మ చెట్ల మీద చిన్నగా లోతుగా వున్న నిర్జీవ కణజాలపు మచ్చలు ఒక పాలిపోయిన వలయంతో కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఉచ్చులను వాడడం ద్వారా స్పోర్స్ ను గమనించడం మరియు వర్షపాతం మరియు బిందువుల మొత్తాన్ని గమనించడం ద్వారా సెలిన్ద్ర నాశినులు వాడకం సమయాన్ని నిర్ణయించవచ్చు. ఈ ఫంగస్ కు వ్యతిరేకంగా అనేక రకాల రాగి ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. పండ్లు కత్తిరించిన తర్వాత వేడి నీటితో శుభ్రం చేయడం లేదా పండ్లకు వాక్స్ పట్టించడం ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందకుండా మరియు ప్రభావ లక్షణాలను తగ్గించడానికి కుదురుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పంట కోతకు ముందు ముందు జాగ్రత్తగా బెంజిమిడజోల్ శీలింద్ర నాశినులను పిచికారీ చేయడం వలన రవాణాలో మరియు నిల్వ సమయంలో ఈ తెగులు లక్షణాలను నెమ్మదింప చేయవచ్చు. గ్వాజాటైన్ లేదా ఇమాజాలిల్ తో చికిత్స చేయడం వలన ఈ నల్ల మచ్చలలో ఇతర సూక్ష్మ క్రిములు వృద్ధి చెందకుండా నియంత్రించవచ్చు. స్ట్రోబ్రిల్యురిన్స్, డైథియోకార్బమేట్స్ మరియు బెంజిమిడాజల్ వంటి శిలీంద్ర నాశినులను కూడా ఈ ఫంగస్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. అయితే అనేక ప్రాంతాల్లో ఈ పురుగుల మందులకు వైరస్ని నిరోధకతను పెంచుకుంది.

దీనికి కారణమేమిటి?

పంట లేని సమయంలో ఈ ఫంగస్ ఆకుల వ్యర్ధాలలో నివసిస్తుంది మరియు వసంతకాలంలో బీజాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇది వరుసగా తడపడం మరియు ఆకు వ్యర్థాలను ఎండబెట్టడం ద్వారా వేగవంతం చేయబడే ఒక ప్రక్రియ. స్పోర్స్ వర్షపాతం లేదా పొలంలో నీరు పెట్టినప్పుడు బయటికి నెట్టివేయబడతాయి. తరువాత గాలి మరియు నీటి ద్వారా చెల్లాచెదురై కణజాలం మీద పడిన తర్వాత మొలకెత్తుతాయి. ఆకులు 10 నెలల వరకు, పండు ఏర్పడిన తర్వాత 4-5 నెలల్లో పండ్లు నష్టానికి గురయ్యే అవకాశం వుంది. ఈ తెగులు సోకిన తర్వాత ఫంగస్ పైపొరల మధ్యన నివాసం ఉంటుంది. పండు పరిపక్వం చెందే వరకు ఈ వైరస్సం నిద్రావస్తలో మరియు అదృశ్యంగా ఉంటుంది. ఆకులలో ఈ తెగులు సాధారణంగా దాక్కుని ఉంటుంది, కాని ఆకు మచ్చలు ముదురు ఆకుల పైన కనపడవచ్చు. ఆకులపై మచ్చలు సాధారణంగా తేమ పరిస్థితుల్లో కరిగిపోయే ఒక జిగురు వంటి పదార్ధంతో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ తెగులు తరచుగా పడే వర్షాలు లేక నీటి తుంపరల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధకత కలిగిన రకాలు మరియు అందుబాటులో ఉంటే ధృవీకరించబడిన మొక్కల రకాలను ఉపయోగించండి.
  • ఆకులు పొడిగా ఉండడానికి తోటలో గాలి ప్రసరణ సరిగా జరిగేటట్టు మొక్కలను నాటండి.
  • ఈ తెగులు లక్షణాలను గుర్తించడానికి పొలాన్ని తరుచుగా గమనిస్తూ వుండండి.
  • మొక్కల సహజ నిరోధకత పెంచడానికి సరైన రీతిలో మీ మొక్కలకు ఎరువు వేయండి.
  • సీజన్ మరియు ఆఫ్ సీజన్లో ఈ తెగులు సోకిన మొక్కల పదార్థాన్ని తొలగించి వెంటనే నాశనం చేయాలి (కాల్చడం, పూడ్చడం లేదా పశువులకు వేయడం).
  • నిల్వ సమయంలో మచ్చలు అధికంగా వృద్ధి చెందకుండా ఉండడానికి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మరియు పొడి వాతావరణంలో నిల్వ ఉంచాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి