నిమ్మజాతి

నిమ్మ జాతిలో ఆంత్రాక్నోస్

Colletotrichum gloeosporioides

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపైన కొంచెం రాగి రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చల మధ్య భాగం బూడిద రంగులోకి మారుతుంది.
  • చిన్న చిన్న ఎండిపోయిన గోధుమ రంగు నుండి నల్లని మచ్చలు పండ్లపైన ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఆకుల పైన ఊదా రంగు అంచు గల లేత ఆకుపచ్చ రంగు వృత్తాకార మచ్చలు కనబడతాయి. ఈ మచ్చల కేంద్రం క్రమంగా బూడిద రంగులోకి మారుతుంది మరియు తెగులు సోకిన తరువాత దశల్లో దీనిపై అక్కడక్కడ చిన్న చిన్న నల్లటి బొబ్బలు కనబడతాయి. పర్యావరణ కారకాల (కీటక నష్టం లేదా గాయపడిన గాయాలు వంటివి) వలన గాయపడిన కణజాలాలకు ఆంత్రాక్నోస్ ఫంగస్ ద్వారా నివాసం వుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఎండ వాత, కెమికల్ బర్న్, కీటక నష్టం, గాయాలు, లేదా అననుకూల నిల్వ పరిస్థితులు వంటి ఇతర ఏజెంట్ల ద్వారా గాయపడిన పండ్లలో ఆంత్రాక్నోస్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. గట్టిగా మరియు పొడిగా వుండడం ఈ పండు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. 1.5 మిల్లీమీటర్ల లేదా కొంచెం పెద్ద వ్యాసం కలిగి ఉండే గోధుమ రంగు నుండి నలుపు రంగులో ఉండే మచ్చలు ఉంటాయి. గాయాల మీద పెరుగుతున్న బీజాలు మామూలుగా గోధుమ రంగు నుండి నలుపు రంగులో ఉంటాయి, కానీ తేమతో కూడిన పరిస్థితులలో, అవి గులాబీ రంగు నుండి సాల్మన్ రంగులోకి మారవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో బేసిల్లస్ సబ్టిలిస్ లేదా బాసిల్లస్ మైలోలిక్ఫేసియెన్స్ ఆధారంగా బయో ఫంగైసైడ్స్ బాగా పనిచేస్తాయి. విత్తనాలు లేదా పండ్లు (20 నిమిషాలు 48°C) వద్ద వేడి నీటితో శుద్ది చేయండి. ఇలా చేయడం వలన ఏదైనా ఫంగల్ అవశేషాన్ని చంపి, పొలంలో లేదా రవాణా సమయంలో ఈ తెగులు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించగలదు. కాపర్ సల్ఫేట్ కలిగి ఉన్న శిలీంద్రాలతో కూడిన ఆకులపై పిచికారీలు లేదా విత్తన చికిత్సలు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించగలవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అజాక్సిస్ట్రోబిన్ లేదా క్లోరోతలోనిల్ కలిగి ఉన్న శిలీంధ్రాలు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి తరుచూ స్ప్రే చేయండి. ఈ సమ్మేళనాలతో విత్తన చికిత్సను కూడా ఊహించవచ్చు. అంతిమంగా, విదేశీ మార్కెట్లకు రవాణా చేయబడే పండ్ల మీద కోయడానికి ముందు పంటకోత శిలీంధ్రాలుతో పాటు ఫుడ్ గ్రేడ్ మైనాన్ని ఈ తెగులు సోకకుండా వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

చెట్టు పైన చనిపోయిన కలప మీద ఈ ఆంత్రాక్నోస్ పెరుగుతుంది, మరియు ఇది వర్షపు తుంపర్లు. భారీ మంచు, మరియు పైనుండి నీరు పెట్టడం వలన దగ్గర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. ఈ విధంగా ఇది లేత ఆకులు మరియు పండ్లు యొక్క ఆకర్షక కణజాలానికి చేరుతుంది. తరువాత ఈ తెగులు దీని లక్షణాలను ప్రేరేపిస్తూ పెరగడం మొదలు పెడుతుంది. ఆకులు మరియు పండ్ల మీది మచ్చలు మరియు గాయాల మీద పెరుగుతున్న లైంగిక నిర్మాణాలపై బీజాంశాల కొత్త బ్యాచ్ ఉత్పత్తి చేయబడతాయి. ఈ బీజాంశం గాలి కారకాలుగా మారి తరువాత దూర ప్రదేశాలకు వ్యాధిని వ్యాపింపచేయవచ్చు. ఒకసారి విత్తనాలు మొలకెత్తిన తర్వాత, అవి ఒక ఆకృతిని ఏర్పరుస్తాయి, గాయం సంభవించే వరకు లేదా పండు యొక్క పంట కోత తర్వాత చికిత్స వరకు (ఉదాహరణకు డీగ్రీనింగ్) ఇది నిద్రావస్థలో వుంటుంది. ఫంగస్ యొక్క పెరుగుదలకు సరైన పరిస్థితులు చాలా అధిక తేమ మరియు 25-28°C ఉష్ణోగ్రత, కానీ సాధారణంగా సంక్రమణ 20-30°C వద్ద వృద్ధి చెందుతుంది.


నివారణా చర్యలు

  • తక్కువ వర్షపాతం కలిగిన పొలాలను ఎంచుకోండి.
  • తెగులును తట్టుకునే రకాలను మరియు విత్తనాలను ఎంచుకోండి.
  • మొక్కల మధ్య తగినంత ఖాళీ ఉంచండి.
  • కాఫీ వంటి విజాతి మొక్కలను పొలం చుట్టూ పెంచండి.
  • చెట్లను సంవత్సరానికి ఒక సారి కత్తిరించడం వెలమ పొలంలో వెలుతురు బాగా ప్రసరిస్తుంది.
  • రాలిన పండ్లను, ఆకులను పొలంలో నుండి వెంటనే మంచి కలుపు నియంత్రణ చేసి పొలం పరిశుభ్రంగా వుండేటట్టు చూడండి.
  • పొలంలో మంచి మురుగు నీరు పద్దతిని ఏర్పాటుచేసుకోండి.
  • ఈ తెగులు లక్షణాలు ముదరకముందే పంట కోతలు పూర్తి చేయండి.
  • మంచి గాలి, వెలుతురు వుండే ప్రదేశంలో నిలువ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి