నిమ్మజాతి

ఆల్టర్నరియా గోధుమ రంగు మచ్చ

Alternaria alternata

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులకు రెండు వైపులా గోధుమ రంగు నుండి నల్ల పొక్కులు వాటి చుట్టూ వలయాలతో వుంటాయి.
  • తరువాత క్రమ రహిత లేదా వృత్తాకార నిర్జీవ ప్రాంతాల్లో కొన్నిసార్లు పెళుసు కాగితం వలే మారుతుంది.
  • లేతపండ్లలో పసుపురంగు వలయాలు ముదురు మచ్చలు వుండి, తరువాత కార్క్ వంటి కణజాలంతో కప్పబడి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

మొట్టమొదట, అంచుల దగ్గర పసుపురంగు వలయాలుగా అభివృద్ధి అయ్యే గోధుమ రంగు నుండి నలుపు రంగు మచ్చలుగా లేత ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమరహిత లేదా వృత్తాకార నిర్జీవ ప్రాంతాలుగా ఆకులో పెద్ద ప్రాంతాలను కప్పివేసి విస్తరిస్తాయి. నెక్రోసిస్ మరియు క్లోరిసిస్ ఈనెల వెంబడి వ్యాప్తి చెందవచ్చు. ఈ మచ్చలు చదునుగా ఉండి ఆకుల రెండు వైపులా కనిపిస్తాయి. పాత మచ్చలు వాటి మధ్యలో ఒక పెళుసైన కాగితం వంటి ఆకృతిని కలిగి ఉంటాయి.అపరిపక్వ పండ్ల మీద పసుపు రంగు వలయాలు గల కొద్దిగా ముడుచుకుపోయిన ముదురు రంగు మచ్చలు కనబడతాయి. మరింత పరిపక్వతను వచ్చిన పండ్లలో చిన్న చిన్న మచ్చలు నుండి పెద్ద గుంటల ప్రమాణం వరకు ఏర్పడతాయి. పండు చర్మం ఉపరితలం నుండి పైకి వాచినట్టు కనపడే కార్క్ వంటి కణజాలం అవరోధాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్కి కణజాలం రాలిపడిపోతే క్రేటర్స్ లేదా గుంతలు కనిపిస్తాయి. సహజంగా ఎదగని పండ్లు రాలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కాపర్ ఆక్సిక్లోరైడ్ ఆధారిత సేంద్రీయ శిలీంధ్రాలు ఆల్టర్నేరియా గోధుమ రంగు మచ్చకు వ్యతిరేకంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి కాకుండా, ఈ తెగులుతో పోరాడటానికి సహాయపడే మరి ఏదైనా విధానం మీకు తెలిసి వుంటే దయచేసి మాకు తెలియచెయ్యండి. మీ నుండి వినడం కోసం మేము ఎదురుచూస్తున్నాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్రోడియోన్, క్లోరోతలోనిల్ మరియు అజాక్సిస్ట్రోబిన్ ఆధారిత ఫంగైసైడ్స్ ఆల్టర్నేరియా బ్రౌన్ స్పాట్ ను బాగా నియంత్రిస్తాయి. ప్రొపికోనజోల్ మరియు థియోఫనేట్ మిథైల్ ఆధారిత ఉత్పత్తులు కూడా అత్యంత సమర్థవంతమైనవిగా నిరూపించబడ్డాయి. సరైన మోతాదులను మరియు సాంద్రతలను అనుసరించడం వలన ఈ మందులకు తెగులు నిరోధకతను పెంచుకోకుండా చూడవచ్చు

దీనికి కారణమేమిటి?

లక్షణాలు ఆల్టర్నేరియా ఆల్ట్రనటా అనే ఫంగస్ వలన కలుగుతాయి. ఇది గాలి ద్వారా లేదా నీటి తుంపరలవలన వ్యాపిస్తుంది. కొమ్మలు, ఆకు లేదా పండ్ల మచ్చల మీద ఉన్న శిలీంద్రం వర్షం, లేదా సాపేక్ష ఆర్ద్రతలో ఆకస్మిక మార్పులు ఈ క్రిముల ఉత్పత్తికి మరియు విడుదలకు అనుకూలంగా వుంటాయి. ఆల్టర్నేరియా గోధుమ రంగు మచ్చలు తరచూ మనుషులు రవాణా చేసే నర్సరీ మొక్కల నుండి తరచుగా వ్యాపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన మొదటి 36 నుండి 48 గంటల తర్వాత లేత ఆకులపైన ఈ లక్షణాలు కనిపిస్తాయి. పూరెక్కలు రాలిన తర్వాత 4 నెలల వరకు కూడా పండ్లకు ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి ఆరోగ్యకరమైన మొక్కల పదార్థాన్ని ఉపయోగించండి.
  • మొక్కల సహజ నిరోధకతను పెంచడానికి సరైన రీతిలో మీ పంటకు ఎరువులు వేయండి, కాని అధిక నత్రజని వాడకాన్ని నివారించండి.
  • నీటి ఒత్తిడి వున్న, లేదా అధిక నీరు ఉన్న పంటలకు మంచి నీటి పారుదలను ఎర్పరుచుకోండి లేకపోతే పండ్లకు పగుళ్ళు ఏర్పడవచ్చు.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టవద్దు.
  • ఎదుగుతున్న మొక్కల మధ్య సరైన ఎడం ఏర్పాటుచేయడం ద్వారా ఇవి గాలిని బాగా పీల్చుకుంటాయి.
  • తెగులు లక్షణాలకు మీ మొక్కలను లేదా వ్యవసాయ క్షేత్రాలను తరుచుగా గమనిస్తూ వుండండి.
  • ఈ తెగులు వలన ప్రభావితమైన పుష్పాలను తొలగించడం వలన పండ్లకు ఈ తెగులు సంక్రమించకుండా ఆపుతుంది.
  • ముదురు పండ్లను మరియు చనిపోయిన కొమ్మలను పొలంలోనుండి తొలగించండి.
  • నిమ్మ జాతి పంటలో, పండ్ల నిలవ మరియు రవాణా సమయంలో తెగులును అరికట్టడానికి సరైన పద్దతిలో గ్రేడింగ్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి