శనగలు & సెనగ పప్పు

శనగలో తుప్పుతెగులు

Uromyces ciceris-arietini

శీలీంధ్రం

క్లుప్తంగా

  • గోధుమరంగు, గుండ్రని మరియు పొడిగా ఉండే స్ఫోటములు.
  • ఆకుల రెండు వైపులా స్ఫోటములు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


శనగలు & సెనగ పప్పు

లక్షణాలు

ప్రారంభంలో, గోధుమ, గుండ్రని మరియు పొడి స్ఫోటములను ఆకుల రెండు వైపులా చూడవచ్చు. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు, ఈ మచ్చలు కాండం పైనున్నటువంటి కాయల మీద కూడా కనిపిస్తాయి. ప్రభావిత మొక్కలు ఇటుక-ఎరుపు రంగులో కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, యురోమైసెస్ సిసిరిస్-అరియెటినికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడే పరిష్కారం ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ ఎంచుకోండి. శిలీంద్ర సంహారిణులతో నియంత్రణ విజయావకాశాలు తక్కువనే చెప్పవచ్చు. శనగ లో తుప్పు ఒక చిన్న వ్యాధి మరియు చాలా సందర్భాలలో తీవ్రమైన నియంత్రణ చర్యల అవసరం ఉండదు.

దీనికి కారణమేమిటి?

ఉరోమైసెస్ సిసిరి-అరియెటిని అనే ఫంగస్ వల్ల లక్షణాలు వస్తాయి. శనగ మీద తుప్పు అనే వ్యాధికి చల్లని మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తుప్పు అభివృద్ధికి వర్షం అవసరం లేదు. ప్రధానంగా ఈ వ్యాధి మొక్కలు ఎదిగే సీజన్లో, పుష్పించే దశ తరువాత సంభవిస్తుంది.


నివారణా చర్యలు

  • సహజ క్షేత్ర పరిస్థితులలో వ్యాధికి నిరోధకతను చూపించిన ఎం ఆర్ సి 34, ఎన్ ఈ సి249, జెఎం583, జెఎం2649, హెచ్ పి సి63, హెచ్ పి సి136, మరియు హెచ్ పి సి147 వంటి వ్యాధి నిరోధక మొక్కల రకాలను నాటండి.
  • వ్యాధి వ్యాప్తి యొక్క గరిష్ట స్థాయిని నివారించడానికి ముందుగానే విత్తండి.
  • మీ పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • ప్రభావిత మొక్కల భాగాలు మరియు పంట అవశేషాలను తొలగించండి.
  • ఆలస్యంగా నీరు పెట్టకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి