కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కంది పంటలో కాడ కుళ్ళు తెగులు

Phytophthora drechsleri f. sp. cajani

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల పై నీటితో తడిసినటువంటి మచ్చలు, ఆకు కాడలపై మరియు కాండం పైన గోధుమ నుండి నల్లరంగు నొక్కుకుపోయినట్టువున్న మచ్చలు కనిపిస్తాయి.
  • తెగులు సోకిన మొక్కలు ఆకస్మికంగా చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

లేత మొలకలకు ఈ తెగులు సోకితే అవి అకస్మాత్తుగా చనిపోతాయి. ఒకవేళ మొక్క చనిపోకపోతే కాండం మీద పెద్ద పెద్ద బుడిపెలు ఏర్పడతాయి. తెగులు సోకిన మొక్కల ఆకులపై నీటితో తడిసినట్టు వుండే మచ్చలు ఏర్పడతాయి. ఆకు కాడలపై మరియు కాండం పైన గోధుమ నుండి నల్ల రంగు నొక్కుకుపోయినట్టువున్న మచ్చలు కనిపిస్తాయి. కాండం గాయాల పైభాగం నుండి మొక్క వాలిపోయి, ఎండిపోయి చివరకు చనిపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మరియు బాసిల్లస్ సబ్టిలిస్, అలాగే ట్రైకోడెర్మా విరిడి మరియు హమాటం కాండం కుళ్ళు తెగులుకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఫైటోఫ్తోరా బ్లెయిట్ సోకకుండా ఉండడానికి కిలో విత్తనాలకు 4 గ్రాములు మెటలాక్సెల్ తో ( 4 గ్రా/కిలో విత్తనాలు) విత్తన శుద్ధి చేయాలి.

దీనికి కారణమేమిటి?

ఫైటోఫ్తోరా బ్లెయిట్ ఒక మట్టి ద్వారా సంక్రమించే ఫంగస్. ఇది చాలా కాలం పంట అవశేషాలలో జీవించి ఉంటుంది. వర్షపు తుంపర్లు లాంటి తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు మరియు 25° C ఉష్ణోగ్రతలు, ఈ తెగులు వ్యాపించడానికి అనుకూలమైన పరిస్థితులు. ఈ తెగులు సోకాలంటే ఆకులు 8 గంటల సమయం తేమతో ఉండాలి. కొంతకాలానికి కందులు ఈ తెగులుకు నిరోధకతను పెంచుకుంటాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఉపయోగించండి.
  • పేలవమైన డ్రైనేజ్ వ్యవస్థ లేదా మెత్తని చిత్తడి నేలల్లో నీరు నిలిచిపోవడాన్ని నివారించేందుకు ఎత్తులో అమర్చిన మడులను ఉపయోగించండి.
  • ఈ పొలంలో ఇంతకు ముందు వేసిన పంటకు ఈ తెగులు సోకినట్లైతే ఈ పొలాలలో కంది పంటను వేయవద్దు.
  • విత్తనాలు మరియు మొలకల మధ్య ఎక్కువ జాగా ఉంచండి.
  • పంట భ్రమణాన్ని పాటించండి.
  • మల్చింగ్ లేదా పెసలు, మినుములు వంటి అంతర పంటలను వేయడం ద్వారా ఈ తెగులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
  • పొటాషియం ఎరువులు వేయడం ద్వారా సంక్రమణ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి