Rhizoctonia solani
శీలీంధ్రం
మొలకల కాండంపై లోతైన వివిధ ఆకృతులల్లో ఉండే మరియు గోధుమ నుండి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. పత్తి మొలకల మీది మచ్చల వలన ఒకొక్కసారి మొక్కలు చనిపోతాయి. మచ్చల పైభాగంలో శిలీంద్ర బీజాలు వృద్ధిచెందుతాయి. శిలీంద్ర బీజాలు ఒక్కొక్కసారి నేలలో కూడా అభివృద్ధి చెందుతూ మొక్కకు సోకడం వలన భూమి ఉపరితలంపై ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
రాబోయే 4-5 రోజులలో చలి లేదా వర్ష సూచన ఉన్నట్లయితే విత్తనాలను విత్తడం ఆలస్యం చేయాలి. 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో విత్తనాలు నాటరాదు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన ఒక సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎట్రిడాయజోల్, టోల్క్లోఫోస్ మిథైల్, థాయ్బెండాజోల్, లేదా కాప్టన్ ను పిచికారీ చేయడం వలన మొలక వచ్చే శాతం పెరిగి వ్యాధుల భారిన పడడం తగ్గుతుంది.
నేలలో పెరిగే రైజోక్టోనియా సోలని అనే శిలీంద్రం వలన ఈ తెగులు మొక్కలను ఆశిస్తుంది. నారు మొక్కలకు అయ్యే యాంత్రిక గాయాల ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఉదాహరణకు నాటు సమయంలో. గాలి వీచడం వలన నేలకు దగ్గరగా వుండే మొక్కల భాగాలు నేలకు రాసుకొని గాయాలు అవుతాయి. మొక్కలు పెరిగే కొద్ది బలపడి ఈ తెగులుకు నిరోధకతను సంతరించుకొంటాయి.