సోయాబీన్

సోయాబీన్ టార్గెట్ స్పాట్ తెగులు

Corynespora cassiicola

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల పై సక్రమంగా లేని ఎరుపు-గోధుమ మచ్చలు.
  • మచ్చలు లేత ఆకుపచ్చ నుండి పసుపు అంచులు కలిగి ఉంటాయి.
  • పెద్ద మచ్చలు లేత లేదా ముదురు రింగులు కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

ఆకు మచ్చ తెగులు అనేది ఒక ఫోలియార్ వ్యాధి. ఆకుల పై సక్రమంగా లేని ఎరుపు-గోధుమ మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు లేత ఆకుపచ్చ నుండి పసుపు అంచులు కలిగి ఉంటాయి. పెద్ద మచ్చలు లేత లేదా ముదురు రింగులు కలిగి ఉంటాయి. ఈ తెగులు కాండాలకు కూడా సోకుతుంది. వాటిమీద ముదురు గోధుమ రంగు పొడవాటి మచ్చలు కనిపిస్తాయి. కాయల పైన చిన్న గుండ్రపు నల్లటి చుక్కలు కనిపిస్తాయి. ఈ తెగులు అధికంగా సోకితే ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సోయాబీన్ టార్గెట్ స్పాట్ తెగులుకు ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స లేదు

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడటం అంత లాభదాయకం కాదు. పైరోక్సిస్ట్రోబిన్, ఎపోక్సీకోనజోల్, ఫ్లూక్సఫీరాక్సడ్ లేదా బిక్సఫెన్, ప్రాతికానజోల్ మరియు ట్రైఫలాక్సీస్ట్రోబిన్ వంటి కీటక నాశినులు ఈ ఫంగస్ ను నియంత్రించడంలో తోడ్పడుతాయి.

దీనికి కారణమేమిటి?

కోరినేస్పోర కాస్సికోల ఫంగస్ మట్టిలో పంట అవశేషాలపై ఉంటుంది. అధిక తేమ (>80%) మరియు ఆకులపై నీరు వీటికి అనుకూలమైన పరిసరాలు. పొడి వాతావరణం వీటిని నియంత్రిస్తుంది. ఈ తెగులు ఆలస్యంగా ఎదిగే రకాల పై అధిక ప్రభావం చూపుతుంది.


నివారణా చర్యలు

  • ఆర్ధిక నష్టం కలగకుండా ఉండడానికి అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకాలను వాడండి.
  • త్వరగా పెరిగే మొక్కలను సీజన్ కు ముందుగానే వేయండి.
  • కోత అనంతరం పొలంలో పంట అవశేషాలు పొలాన్ని శుభ్రం చేయండి.
  • ఒకే రకం పంటను ప్రతిసారి వేయకుండా ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి పద్ధతులు పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి