వంకాయ

వంగ మొక్కల్లో సేర్కొస్పోర ఆకుమచ్చ

Cercospora melongenae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న చిన్న, గుండ్రటి పసుపు పచ్చ మరియు కొద్దిగా లోతుగా వున్న మచ్చలు ఆకు ఉపరితలంపై కనపడతాయి.
  • ఈ గుర్తులు పెద్దవిగా అయ్యి ఒకదానితో ఒకటి కలసిపోతాయి, గోధుమ రంగులోకి, ఒక పసుపు రంగు వృత్తం గల ఒక సరైన ఆకారం లేని మచ్చలుగా మారతాయి.
  • ఈ తెగులు అధికంగా సోకడం వలన ఆకులు చుట్టుకొని మరియు పరిపక్వము చెందని ఆకులు ఏర్పడి తరువాత రాలిపోవడము జరుగుతుంది.
  • అధికంగా తెగులు సోకితే పంట దిగుబడి తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వంకాయ

లక్షణాలు

ఈ తెగులు మొక్కల ఏ దశలోనైనా సంభవించవచ్చు మరియు ఇది ఆకులు, కాడలు మరియు కాండములపై కనిపించవచ్చు. చిన్నవిగా, గుండ్రముగా మరియు కొంచెం లోతుగా వున్న మచ్చలు ముదురు మరియు మొక్కల క్రింది భాగములో వున్నఆకులపై భాగములో కనబడతాయి. కాలం గడచిన కొలది ఈ ఆకుల గుర్తులు ఆకుల రెండు వైపులా కనపడతాయి. పాత మచ్చలు కలసిపోయి ఆకులపై వివిధ రూపాలను సంక్రమించుకొంటాయి. ఇవి గోధుమరంగు నుండి బూడిదరంగు ( పై భాగము మీద) మరియు లేత గోధుమ రంగు ( క్రింది వైపు) లో వుంటాయి. ఈ తెగులు అధికంగా సోకితే ఆకులు చుట్టుకొనిపోయి రాలి పోతాయి. ఈ ఫంగస్ పండ్లను నేరుగా నష్టపరచనప్పటికీ మొక్కల ఎదుగుదల తగ్గడం వలన పండ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

జీవ సంబంధ ఏజెంట్లు సంక్రమణమును నియంత్రించడంలో సహాయపడగలవు. సేర్కోస్పోర మేలోంగానేతో పోటీపడడానికి బాక్టీరియా బాసిల్లస్ సబ్టిలిస్ స్ట్రైన్ QST 713 ఆధారిత జీవ-జీవ శిలీంద్ర నాశినులను ఆకులపై స్ప్రే గా ఉపయోగించవచ్చు. ఈ తెగులును నియంత్రించడానికి మొక్కల నుండి తీసిన అజాడిరక్త ఇండికా (వేప నూనె) సారం బాగా పనిచేస్తుంది.

రసాయన నియంత్రణ

ఈ తెగులును నియంత్రించడానికి ఎల్లప్పుడూ సమగ్రమైన విధానాన్ని పరిశీలించాలి. శిలీంద్ర నాశినులు వాడవలసిన అవసరం ఉంటే క్లోరోతలోనిల్, మాంకోజెబ్ లేదా అక్టోనిక్ ఆసిడ్ కలిగిన ఉత్పత్తులను కాపర్ సాల్టుతో కలిపి ఆకులపై పిచికారీ మరియు మట్టిలో వేయడానికి ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

సేర్కొస్పోర మెలోన్జేనే అనేది ఒక మొక్క వ్యాధికారక ఫంగస్. ఈ ఫంగల్ బీజాంశాలు మొక్క యొక్క శిధిలాలు మరియు మట్టి పై కనీసము ఒక సంవత్సరము పాటు జీవించి వుంటాయి. అవి వివిధ మార్గాల ద్వారా క్రింది, పాత ఆకుల వరకు తీసుకొని వెళ్ళబడతాయి. సర్వసాధారణంగా ఇవి గాలి మరియు నీరు (వాన మరియు నీటి పారుదల) ద్వారా వ్యాపిస్తాయి కాని ఈ తెగులు పనిముట్లు మరియు వ్యక్తుల ద్వారా కూడా విస్తరిస్తుంది. తరువాత ఈ తెగులు కాండానికి విస్తరించి అక్కడ నుండి లేత ఆకులకు వ్యాపిస్తుంది. అధిక తేమ ఈ తెగులు సోకడానికి మరియు అభివృద్ధి చెండానికి అనుకూలముగా ఉంటుంది. కావున వర్షా కాలములో ఈ తెగులు మొక్కలకు సోకడం (తేమ వాతావరణం, నిరంతర మొక్కల తడి) సర్వ సాధారణము.


నివారణా చర్యలు

  • ఈ తెగులును తట్టుకోగల లేదా నిరోధకత వున్న విత్తన రకాలను వాడండి.
  • ఆరోగ్యకరమైన లేదా ప్రామాణికత కలిగిన వ్యాధి కారకములు కాని విత్తనములు వాడండి.
  • మొక్కల మధ్య అంతరం పెంచి వాటికి గాలి సూర్య కాంతి పూర్తిగా ప్రసరించేలా జరిగేలా చూడాలి మరియు ఈ తెగులు వ్యాపించకుండా నిరోధించాలి.
  • పొలంలో సరిపడినంతగా ఎరువులు వేయాలి.
  • తేమను తగ్గించడానికి ఎక్కువ నీటిపారుదల మరియు ఓవర్ హెడ్ స్ప్రింక్లర్లు వాడవద్దు.
  • ఉదయం సమయంలోనే పొలంలో నీరు పెట్టండి.
  • మొక్కలు తడిగా వున్నప్పుడు పొలంలో పని చేయవద్దు.
  • కలుపు మొక్కల పెరుగుదలను నివారించండి.
  • ఈ తెగులు సోకిన మొక్కలను మరియు మీ పంట వ్యర్థాలను పొలంలో లోతుగా దున్నడం లేదా తగల పెట్టడం ద్వారా నాశనము చేయండి.
  • పంట మార్పిడి పద్థతులు పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి