ప్రత్తి

ప్రత్తిలో బూడిద తెగులు

Mycosphaerella areola

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న చిన్న లేత పచ్చరంగు నుండి పసుపురంగు మచ్చలు ముదురు ఆకులపై కనపడతాయి.
  • తెలుపురంగుతో కలసిన బూడిదరంగు పౌడర్ లాంటి పెరుగుదల ఈ మచ్చల క్రింది భాగంలో కనపడతాయి.
  • ఈ తెగులు అధికంగా సోకిన మెల్లగా ఎండిపోయి ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

పంట చివరి దశలో ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. చిన్న చిన్న లేత పచ్చరంగు నుండి పసుపురంగు మచ్చలు ముదురు ఆకులపై కనపడతాయి. తెలుపురంగుతో కలసిన బూడిదరంగు పౌడర్ లాంటి పెరుగుదల ఈ మచ్చల క్రింది భాగంలో కనపడతాయి. ఈ తెగులు అధికంగా సోకిన మెల్లగా ఎండిపోయి ముందుగానే రాలిపోతాయి. తేమ అధికంగా వున్న సమయంలో ఆకుల రెండువైపులా వెండి రంగు ఫంగల్ ఎదుగుదల కనిపిస్తుంది.ఈ తెగులు అధికంగా సోకిన ఆకులు ముడుతలు పడి ఆకులు నిర్జీవంగా ఎర్రటి గోధుమరంగు రంగులోకి మారి ముందుగానే రాలిపోతాయి. ఇలా ఆకులు రాలిపోవడం వలన మొక్కలు బలం కోల్పోయి దిగుబడి తగ్గిపోతుంది. లేత ఆకులు ఈ తెగులు లక్షణాలను ప్రదర్శిస్తాయి. పంటను కోస్తునప్పుడు మరియు పంట నూర్పిడి చేస్తున్నప్పుడు ఈ తెగులు సోకిన దూది పింజలు బలం కోల్పోయి ముందుగానే తెరుచుకుంటాయి లేదా మిగిలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సుడోమొనాస్ ఫ్లోరెసేన్స్ కలిగిన ఉత్పత్తులతో (10 గ్రా/కిలో విత్తనాలు) తో విత్తనశుద్ధి చేయాలి. బాసిల్లస్ సర్కులన్స్ మరియు సేర్రటియ మర్సేసేన్స్ అనే బాక్టిరియాను ఉపయోగించి మైకోస్పెరేల్లా జాతి శిలీంద్రం యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు. ఒక హెక్టారుకు ఒక లీటర్ నీటికి 3 గ్రాముల వెట్టబుల్ సల్ఫర్ వుపయోగించి లేదా 8 నుండి 10 కిలోల సల్ఫర్ పౌడరును పొలంలో చల్లడం ద్వారా కూడా ఈ తెగులును నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు ప్రారంభ దశలో లేదా తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు జీవ నియంత్రణ పద్దతులను ఉపయోగించవచ్చు. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ప్రొపికోనజోల్ లేదా హెక్సకోనజోల్ వంటి కొత్త శిలింద్ర నాశినులు సిఫార్స్ చేయబడతాయి. ఒక వారం పదిరోజుల వ్యవధిలో ఈ మందులను మళ్ళీ పొలంలో ఉపయోగించాలి.

దీనికి కారణమేమిటి?

మైకోస్పెరేల్లా ఎరియోలా అనే శిలీంధ్రం వలన ఈ తెగులు వ్యాపిస్తుంది. ఇది పంట అవశేషాలపై లేదా ఇంతకు మునుపు వేసిన పంట పై జీవిస్తుంది. ఐనోకులం వలన కొత్త సీజన్లో ఈ తెగులు వస్తుంది. 20 నుండి 30°C ఉష్ణోగ్రత వద్ద, తేమ మరియు అద్రత అధికంగా వున్నపుడు(80% లేదా అంత కన్నా ఎక్కువ) మరియు అడపాదడపా పడే వర్షం వలన ఈ తెగులు బాగా విస్తరిస్తుంది. కొన్ని రోజులవరకు, చల్లని వాతావరణంలో రాత్రి అంతా పొగమంచు పడడం ఈ ఫంగస్ పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. ఆకుకు కలిగిన గాయాలనుండి బీజాంశాలు తయారవుతాయి. ఇవి గాలి ద్వారా ఆరోగ్యంగా వున్న మొక్కలపైకి చేరతాయి. దాని వలన ఈ తెగులు రెండవ సారి వ్యాపిస్తుంది. దూది పింజలు ఏర్పడే ముందు మొక్కలు ఈ తెగులును గురయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగుళ్ళు తట్టుకునే మొక్కల రకాలను ఎన్నుకోవాలి (అనేక రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి).
  • నీటి పారుదల వ్యవస్థ బాగుండడానికి ఎత్తుగా వేసిన గట్లపై మొక్కలను నాటండి.
  • సీజన్ కు బాగా ముందుగా కానీ ఆలస్యంగా కానీ పంటను వేయవద్దు.
  • వర్షం పడిన తర్వాత సులువుగా ఆరడానికి వీలుగా మొక్కల మధ్యన సరైన దూరం పాటించండి.
  • తెగులు లక్షణాలు గుర్తించడానికి పొలాన్ని తరచు గమనిస్తూ వుండండి.
  • తెగులు లక్షణాలు కనిపించే ఆకులను తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో మరియు చుట్టుపక్కల అనుమానాస్పదంగా వున్న కలుపుమొక్కలు తొలగించండి.ఆకులు తడవకుండా ఉండడానికి పంటకు పైనుండి నీళ్లు పెట్టకుండా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఏర్పాటుచేసుకోండి.
  • మొక్కలు త్వరగా ఆరడానికి వీలుగా ఉదయం సమయంలో నీళ్లు పెట్టండి.
  • నేల పొడిగా ఉంచడానికి అధికంగా నీరు పెట్టవద్దు.పొలంలో అధిక మోతాదులో నత్రజని ఎరువులు మరియు పెంటను వేయవద్దు.
  • పంట అవశేషాలను తొలగించి ప్రత్తి పంటకు దూరంగా కాల్చివేయండి.
  • మొక్కలు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయవద్దు.2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి తృణధాన్యాల పంటతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి