ప్రత్తి

ప్రత్తిలో పక్షి కన్ను తెగులు

Glomerella gossypii

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై నల్లని నిర్జీవమైన మచ్చలతో కూడిన ఎరుపు నుండి లేత గోదుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • కాండంపైన పుండ్లు వలన మొక్క చనిపోవచ్చు.
  • ప్రత్తి కాయల పైన నీట నానినట్టు వున్న మచ్చలు ఏర్పడి క్రమేపి పెద్దవై తేమ అధికంగా వున్న పరిస్ధితులలో పసుపు రంగు మచ్చలు ఏర్పడును.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

పక్షి కన్ను తెగులు మొక్క పెరిగే ఏ దశలోనైనా మరియు ఏ కణజాల్లానైనా ఆశించవచ్చు. శీలీంద్రం మొలక దశలో ఆశించినట్లయితే గుండ్రటి చిన్న ఎరుపు నుండి ముదురు గోధుమ రంగు మచ్చలు ఏకాదళ బీజాలపై( ఒకే ఆకు వచ్చిన మొలకలు) మరియు ఆకులపై ఏర్పడతాయి. ఈ తెగులు మొలక దశలో కాలర్ ప్రాంతంలో సోకితే లేత మొక్కలు వడలిపోయి చనిపోతాయి. అభివృద్ధి చెందిన మొక్కలలో తెగులు సోకిన కాండం చీలి పోయి ముక్కలవుతుంది. తేమ వాతావరణంలో తెగులు ఆశించిన ప్రతి కాయలపై చిన్నటి గుండ్రని నీటితో తడిసిన మచ్చలు ఏర్పడి వేగంగా పెద్దవై పసుపు నుండి గోదుమ రంగు మచ్చలుగా ఏర్పడతాయి. ప్రత్తి కాయలలో ప్రత్తి ఎండిపోయి పసుపు రంగులోకి మారుతుంది. సాధారణంగా తెగులు ఆశించిన కాయల అభివృద్ధి ఆగిపోయి, ఎండిపోయి పక్వానికి రాక ముందే పగిలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ తెగులుకు జీవనియంత్రం పద్ధతులు లేవు. మీకు తెగులు లేక తెగులు లక్షణాలను నియంత్రించే జీవ నియంత్రం పద్ధతులు తెలిసి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాప్టాన్, కార్బండిజం, కార్బోక్సిన్ లేదా థిరం ( 2 గ్రా/కిలో విత్తనాలు) తో విత్తనశుద్ధి చేయాలి. పింజ అభివృద్ధి దశలో మాంకోజేబ్, కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా కార్బండిజంతో ( ఒక లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు) ఆకులపై పిచికారీ చేసిన ఎడల తెగులు ఉధృతిని నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు కోలేక్టోట్రైకం గాసిపియం (గ్లోమేరేల్లా గాసిపి) అనే శీలీంద్రం వల్ల సోకుతుంది. ఈ శీలీంద్రం నేలలోని విత్తనాలపై లేదా విత్తనాల లోపల నిద్రావస్థలో ఉండి అనుకూల పరిస్ధితులు ఏర్పడినప్పుడు తెగులును కలుగజేస్తాయి. ఇది తెగులు ఆశించిన మొక్క భాగాల ద్వారా, కుళ్ళిపోయిన ప్రత్తి కాయలు మరియు తెగులు సోకిన విత్తనాల ద్వారా ఎక్కువ దూరం వ్యాప్తి చెందును. పొలంలో మరొక రకంగా ఒక మొక్క నుండి మరొక మొక్కకు గాలి, వర్షపు నీటి తుంపర్లు మరియు కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. అరిస్టోలాచియా బ్రాక్టియాటా మరియు హైబిస్కాస్ డైవర్సిఫోలియాస్ అనే కలుపు మొక్కలపై కూడా ఈ శిలింధ్రం నివాసం ఉంటుందని తెలుస్తుంది. వెచ్చని మరియు తేమతో కూడిన గాలి వాతావరణ పరిస్థితులు (29 నుండి 33°C) ఈ శిలింధ్రం యొక్క పెరుగుదలకు బాగా అనుకూలం.


నివారణా చర్యలు

  • మీ దేశంలో అమలులో ఉన్నటువంటి క్వారంటైన్ నియమాలను తెలుసుకోండి.
  • ఆరోగ్యకరమైన మరియు తెగులు రహిత విత్తనాలను ఉపయోగించండి.
  • నీటినిల్వ పరిస్థితులను మరియు అధిక నీటి పారుదలను తగ్గించండి.
  • తుంపర సేద్యము ఉపయోగించవద్దు.
  • తెగులు సోకిన మొక్కలను పీకి, కాల్చివేయండి.
  • పంట మార్పిడి పద్ధతులు పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి