Alternaria macrospora
శీలీంధ్రం
ఒకటినుండి 10 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన చిన్న గుండ్రటి మధ్యలో గోధుమ రంగు చుట్టూ ఊదా రంగు కలిగిన మచ్చలు ఆకులపైన లేత దశలలో ఏర్పడతాయి. ఈ తెగులు సోకిన ఆకులపై కణజాల క్షయం జరిగి వలయాకారపు మచ్చులు ఏర్పడతాయి. మచ్చల భాగం గట్టిపడి ఆకులు ముడుచుకొని పోతాయి. తేమ కలిగిన వాతావరణంలో మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి కుళ్ళిపోయి పెద్ద మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువైనపుడు ఆకులు ముడుచుకుపోయి మొక్క నుండి రాలిపోతాయి. కాండంపై చిన్న నల్లటి మచ్చలు ఏర్పడి అభివృద్ధి చెంది క్రమేపి పెద్దవై ఉబ్బెత్తుగా తయారై కాండం చీలిపోయి విరిగిపోతుంది. తెగులు తీవ్రత అధికమైతే మొగ్గలు రాలిపోయి ప్రత్తి కాయ అభివృద్ధి ఆగిపోతుంది.
సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్‌తో (10 గ్రా / కేజీ విత్తనాలు) విత్తన చికిత్స పంటలకు కొంత రక్షణ కల్పిస్తుంది. ప్రతి 10 రోజులకు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 0.2% యొక్క ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన సంక్రమణను గణనీయంగా తగ్గిస్తుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాధారణంగా ఈ తెగుల వలన పురుగు మందులకు ఖర్చు పెట్టవలసినంతగా దిగుబడిలో మార్పు రాకపోవచ్చు. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనేబ్, మాంకోజేబ్ (2.5 గ్రా/లీ), హెక్సాకొనజోల్ (1 మి.ల్లీ/లీ), టేబుకొనేజోల్ మరియు డైఫేనకోనేజోల్ మొదలైన శిలీంద్ర నాశినులను వాడొచ్చు. ఈ తెగులుకు నిరోధకతను పెంచడానికి స్ట్రోబిలురిన్స్ (ఉదా. ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్ ) లేదా స్టెరాల్ బయో సింథసిస్ ఇన్హిబిటర్లైన (ట్రయాడిమేనోల్, ఇప్ కోనజోల్ లేదా ) తో విత్తన శుద్ధి చేయవచ్చు.
ఆల్టర్నేరియా మాక్రోస్పోరా అనే శిలీంద్రం వల్ల ఈ తెగులు కలుగుతుంది. ఈ తెగులు సాదారణంగా ఏ అతిధేయి మొక్కలు లేనపుడు ప్రత్తిపై నివసిస్తాయి. గాలి మరియు నీటి ద్వారా ఈ శిలీంద్రం వ్యాపిస్తుంది. 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు తేమ వాతావరణం శిలీంద్ర బీజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. మొలక దశలో మరియు ఆకు రాలు దశలలో తెగులు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. ఈ ఫంగస్ కు కావాల్సిన అనుకూల పరిస్ధితులు ఏర్పడినపుడు, ముఖ్యంగా ప్రత్తి కాయ కాడకు తెగులు సోకినప్పుడు, తెగులు తట్టుకోని రకాలలో ఆకులన్ని త్వరగా రాలిపోతాయి. శారీరక మరియు పోషక లోపాల వలన ఈ లక్షణాలు త్వరగా వృద్ధి చెందుతాయి, భౌతిక మరియు పోషక లోపాల వత్తిడి పెరిగినప్పుడు ఈ లక్షణాలు త్వరగా వృద్ధి చెందుతాయి. ఉదాహరణకు, పండ్లు ఎక్కువగా కాయడం మరియు ఆకులు ముందుగా రాలిపోవడం.