Colletotrichum truncatum
శీలీంధ్రం
ఎటువంటి లక్షణాలు బైటకు కనపడకుండానే పక్షి కన్ను తెగులు కాండాలను, కాయలను మరియు ఆకులను ఆశిస్తుంది. కేవలం పునరుత్పత్తి దశలోనే ఈ తెగులు లక్షణాలు కనిపించవచ్చు. వాతావరణం అనుకూలంగా వేడిగా మరియు తేమతో ఉన్నపుడు కాండాల పైన మరియు కాయల పైన చిన్న ముదురు మచ్చలు కనిపిస్తాయి. ఇవి చిన్న నల్లటి చుక్కలతో కలిసి ఉంటాయి. ఆకులు మడత పడవచ్చు. ఎక్కువగా ఈ తెగులు సోకినట్లైతే కాయలలో చిన్న పరిమాణంలో గింజలు ఏర్పడతాయి.
పక్షి కన్ను తెగులుకు జీవనియంత్రణ లేదు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒక వేళ 5% కంటే ఎక్కువ విత్తనాలకు ఈ తెగులు సోకినట్లైతే శీలింద్ర నాశినులను వాడడం సిఫార్స్ చేయబడినది.. క్లోరోతలోనిల్, మాంకోజెబ్. కాపర్ పిచికారీలు లేదా ప్రొపికోనజోల్ మరియు సింథటిక్ రసాయనం అయిన థియోఫానేట్-మిథైల్ ను వాడవచ్చు.
ఇది పంట అవశేషాల పై ఒక సంవత్సరం వరకు జీవించివుండగలదు. గాలివలన వర్షం వలన బీజాంశాలుఎగిరి పైఆకుల మీదకు చేరతాయి. అధికంగా ఆకుపైన తేమ వున్నా 12 గంటల పైన వర్షం పడినా ఈ తెగులు మొక్కకు సోకుతుంది. దిగుబడి మీద పెద్దగా ప్రభావం లేకపోయినా కాయలు మరియు విత్తనాల నాణ్యత తగ్గుతుంది. వాతావరణం అనుకూలించే ప్రాంతాల్లో (తడి నెలలు, వెచ్చటి మరియు తేమ వాతావరణంలో) దిగుబడి నష్టాలు అధికంగా ఉంటాయి