సోయాబీన్

సోయాబీన్ తుప్పు తెగులు

Phakopsora pachyrhizi

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న బూడిద రంగు మచ్చలు ఆకుల కింది భాగాల్లో కనిపిస్తాయి.
  • బూడిద రంగు మచ్చలు ఎరుపు నుండి గోధుమ రంగులోకి మారుతాయి.
  • వీటి చుట్టూ పసుపు రంగు కలిగి ఉంటాయి.
  • ఈ లక్షణాలు అన్ని ఆకుల మీద చూడవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

ఈ తెగులు మొక్కల కింది భాగాల్లో మొదలై పైకి పాకుతుంది. పుష్పించే సమయంలో చిన్న చిన్న బూడిదరంగు మచ్చలు ఆకుల క్రిందిభాగంలో మొదటి లక్షణాలు బైటపడతాయి. పూత సమయంలో ఆకుల కింది భాగాల్లో ఈనెల వద్ద మచ్చల రూపంలో కనిపిస్తాయి. తరువాత ఈ మచ్చలు పరిమాణంలో సంఖ్యలో పెరిగి ఒక ప్రాంతానికి చేరి ఎర్రటి గోధుమరంగు నుండి నలుపు రంగులోకి మారుతాయి. వీటి చుట్టూ పసుపురంగు వలయాలు ఏర్పడతాయి. ఇవి ఆకుల రెండువైపులా ఒకోసారి కాండంపై కూడా కనిపిస్తాయి. ఈ తెగులు పెరిగే కొద్దీ పాలిపోయిన గోధుమ రంగు ఫంగస్ బొడిపెలు కళ్ళకు కనపడతాయి. ఆకులు ముందుగానే రాలిపోయే అవకాశం వుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కోరంబియా సిట్రోడోరియా ఎస్సెన్షియల్ నూనె పదార్థాలను వాడండి. సెంబొపొగన్ నార్దస్ ౦.5% మరియు థైమస్ వల్గరిస్ 0,3% వాడి వీటి తీవ్రతను తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సరైన సమయంలో సరైన శీలింద్ర నాశినులను చాలా ముఖ్యం. హెక్సాకొనజోల్ మరియు ప్రొపికొనజోల్ (2 మిల్లీలీటర్స్/ 1 లీటర్ నీళ్లలో) ఆధారిత శీలింద్ర నాశినులను వాడండి. మొక్కల ఎదుగుదల అన్ని దశలలోను జింక్ , ఇనుము-మానేబ్ కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ వాడుతూ ఉండాలి.

దీనికి కారణమేమిటి?

తుప్పు తెగులు చాల చురుకైన వ్యాధి. ఇది ఫాకోప్సోర పచైరిజి అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. సోయాబీన్ మొక్కలు చుట్టూ లేకపోతే శీతాకాలం మరియు ఇతర ఆతిధ్య మొక్కలు వీటి పెరుగుదలకు అవసరం. ఆకుపచ్చని జీవకణాలు అందుబాటులో లేకపోతే ఈ పురుగులు జీవించలేవు. తుప్పు బీజాంశాలు ఆకు జీవకణాలలో వున్న గాయాలు మరియు రంధ్రాల ద్వారా కాకుండా మొక్కల కణాలలోకి నేరుగా చొచ్చుకుపోతాయి. ఆకులు 6 నుండి 12 గంటల పాటూ తడిగా ఉండటం, ఒక మోస్తరు ఉష్ణోగ్రతలు (15 నుండి 25) మరియు అధిక తేమ (>75%), ఈ తెగులు వృద్ధిచెందడానికి తోడ్పడుతుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తనాలను ఎంచుకోండి.
  • వీలైతే ముందుగా పంటను వేయండి.
  • త్వరగా పంట చేతికి వచ్చే స్వల్పకాలిక రకాలను వాడండి.
  • ప్రత్యామ్నాయంగా ఆలస్యంగా నాటి పొడి సమయాలను ప్రయోజనకరంగా మార్చుకోండి.
  • మొక్కల పైభాగం త్వరగా ఆరడానికి వీలుగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంచండి.
  • కలుపు మొక్కలను తొలగించండి.
  • మట్టిలో పోటాషియం మరియు ఫాస్ఫరస్ స్ధాయిని పరిశీలించి దానికి తగిన మోతాదులు వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి