మొక్కజొన్న

ఉష్ణమండల ఎండు తెగులు

Physopella zeae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • గుండ్రని తెలుపురంగు బొడిపెలు గుంపులుగా ఆకు ఈనెల దగ్గర ఆకుల రెండు పక్కలలో కనిపిస్తాయి.
  • ఇవి పెరిగినకొద్దీ బొడిపెలు నల్లగా మారుతాయి.తెగులు అధికంగా ఉన్నపుడు ఇవి అన్ని ఒక దగ్గరికి చేరి ఆకులు రాలి పోయినట్టు అయ్యి దిగుబడిలో నష్టం కలిగిస్తాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

గుండ్రని తెలుపురంగు బొడిపెలు గుంపులుగా ఆకు ఈనెల దగ్గర ఆకుల రెండు పక్కలలో కనిపిస్తాయి. ఇవి పెరిగినకొద్దీ బొడిపెలు నల్లగా మారుతాయి.తెగులు అధికంగా ఉన్నపుడు ఇవి అన్ని ఒక దగ్గరికి చేరి ఆకులు రాలి పోయినట్టు అయ్యి దిగుబడిలో నష్టం కలిగిస్తాయి. ఇవి పెరిగే కొద్దీ ఊదా నుండి నలుపు రంగు లోకి మారి చివరికి పగిలి మధ్యలో ప్రకాశవంతమైన మచ్చలు కలిగి ఉంటాయి. తెగులు అధికంగా ఉన్నపుడు ఇవి అన్ని ఒక దగ్గరకు చేరి ఆకులు రాలి పోయే లాగ చేసి దిగుబడిలో నష్టాలు కలిగిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఫైసోపేళ్ల జీయ ను నివారించడానికి కానీ నియంత్రించడానికి కానీ ఎటువంటి ప్రత్యామ్న్యాయ నివారణోపాయం లేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలపండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. దీని లక్షణాలు మొదట్లో కనిపించినప్పుడే శీలింద్ర నాశినులు వాడటం మంచిది. అజోక్సీస్ట్రోబిన్, టేబుకోనజోల్, ప్రొపికోనజోల్ వంటి శీలింద్ర నాశినులు వాడి ఈ తెగులు విస్తరించకుండా నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ ఫంగస్ చెదురుమొదురుగా ఉండి తేమ అధికంగా ఉండే అమెరికా ఖండం లోనే కనిపిస్తుంది. సరైన ఆతిధ్య మొక్కలు లేకపోతే ఇది తన జీవిత చక్రాన్ని పూర్తి చేయలేదు. ఇది భూమిలో లేదా పంట అవశేషాల్లో జీవించలేదు అందుకే సంక్రమణను సులువుగా నిరోధించవచ్చు. ఇది మొక్క నుండి మొక్కకు గాలి వలన సోకుతుంది. దీనికి పెరిగిన ఉష్ణోగ్రతలు, అధిక తేమ వంటివి ఉపయోగపడుతాయి. తుప్పు తెగులు అధికంగా మొక్కజొన్న పంటను తక్కువ ఎత్తు వాతావరణంలో నాటడం వల్ల కలుగుతుంది.


నివారణా చర్యలు

  • నిరోధక మరియు సహనాత్మక మొక్కల రకాలు వాడాలి.
  • ఈ తెగులుకు అనుకూలం కానీ సమయాల్లో మొక్కజొన్నను నాటాలి.
  • ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట వేయడానికి ప్రయత్నించండి.
  • కలుపు లేకుండా చూడాలి మరియు పంట మార్పిడి పద్ధతులు వాడాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి