బార్లీ

నెట్ బ్లోచ్

Pyrenophora teres

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఒక వల లాంటి చీడ నమూనా ఆకులపైన బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి.
  • 3 నుండి 6 మిల్లీమీటర్ల గోధుమ రంగు కోలాకారంలో వుండే మచ్చలు ఈ తెగులు లక్షణాలుగా గుర్తించవచ్చు.
  • చిన్న గోధుమ రంగు చారలు గింజల చుట్టూ వున్న పొట్టు పైన ఏర్పడి గింజలు ముడతలు పడేటట్టు చేస్తాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
బార్లీ
గోధుమ

బార్లీ

లక్షణాలు

నెట్ బ్లాట్చ్ రెండు రకాల రూపాలు కలిగివుంటుంది. మచ్చల రూపం మరియు వల (నెట్) రూపం. చాలావరకూ ఈ లక్షణాలు ఆకులపైన కనపడతాయి కానీ ఆకు కాడలపైన మరియు గింజలపైన వుండే పొట్టు పైన అప్పుడప్పుడూ ఏర్పడతాయి. నెట్ రూపంలో ఏర్పడే మచ్చలు పిన్ పాయింట్ గోధుమ రంగు మచ్చలవలే మొదలవుతాయి. ఇవి ఒక ప్రత్యేకమైన వల లాంటి నమూనాలో పొడవుగా ఉండి సన్నని ముదురు గోధుమ రంగు చారలు ఆకుల ఈనెల వెంబడి ఏర్పడతాయి. పాత మచ్చలు ఆకు ఈనెల వెంబడి పొడవుగా పెరుగుతూ తరచుగా చుట్టూ పసుపురంగు వలయాలతో ఉంటాయి. మొదట్లో ఈ మచ్చలు చిన్నగా గోధుమ రంగులో కోలగా ఉండి చుట్టూ పసుపు రంగు అంచులతో ఉంటాయి. తరువాత ఈ మచ్చలు 3 నుండి 6 మిల్లీమీటర్ల పొడవైన లేత రంగు నుండి ముదురు గోధుమ రంగు పొక్కులుగా మారవచ్చు. కంకులకు కూడా ఈ తెగులు సంక్రమించవచ్చు. నెట్ లాగ కనపడని గోధుమ రంగు చారలు గింజలపైన వుండే పొట్టు పైన వృద్ధి చెందుతాయి. దీనివలన దిగుబడి తగ్గడం మరియు గింజలు ముడుతలు జరుగుతుంది. ఈ తెగులు సోకిన గింజల మొదలు వద్ద ఒక ప్రత్యేకమైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, ఈ పైరినోఫోరా టెరెస్ ను నియంత్రించడానికి మాకు ఎటువంటి ప్రత్యామ్న్యాయ జీవన నియంత్రణ పద్దతి తెలియదు. ఈ తెగులును నియంత్రించే పద్దతి ఏమైనా మీకు తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

ట్రియాజోల్ మరియు స్ట్రోబిలూరిన్ కలిగిన శీలింద్ర నాశినులను ఆకులపైన పిచికారీ చేయడం ద్వారా రెండు రకాల నెట్ బ్లాట్చ్ తెగుళ్లను నియంత్రించవచ్చు. టెబుకోనజోల్ వాడకాన్ని నియంత్రించండి. అధిక వర్షపాత పరిస్థితుల్లో రెండు సార్లు పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. అవసరమైతే ఈ శీలింద్ర నాశినులను ఒకదాని తర్వాత ఇంకొకటి వాడడం వలన ఈ మందులకు ఫంగస్ నిరోధకతను పెంచుకోకుండా చూడవచ్చు. విత్తనాల డ్రెస్సింగ్ నెట్ బ్లోచ్ రకం తెగులు పైన మాత్రమే ప్రభావం చూపిస్తుంది.

దీనికి కారణమేమిటి?

ఈ నెట్ బ్లాట్చ్ పైరెనోఫోరా టెరెస్ ఫంగస్ వలన కలుగుతుంది. ఇది పంట అవశేషాలపైన మరియు స్వచ్చందంగా వచ్చే మొక్కలపైన చలికాలంలో జీవించి ఉంటుంది. తెగులు సోకిన విత్తనాల ద్వారా కూడా ఈ తెగులు సంక్రమిస్తుంది కానీ ఇలా చాలా తక్కువగా జరుగుతుంది. ఈ తెగులు గాలి ద్వారా విస్తరించే బీజాంశాల ద్వారా మరియు వర్షపు తుంపర్ల ద్వారా విస్తరిస్తుంది. 10ºC మరియు 25ºC ఉష్ణోగ్రతల వద్ద 6 గంటల పైన తేమ వున్నప్పుడు ఈ తెగులు ప్రాధమికంగా సంక్రమిస్తుంది. ప్రాధమికంగా ఈ తెగులు సంక్రమించిన 14 నుండి 20 రోజుల తర్వాత పరిస్థితులు అనుకూలంగా వున్న సమయంలో గాలి ద్వారా బీజాంశాల వ్యాప్తి జరుగుతుంది. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకుల పచ్చదన ప్రాంతాన్ని మరియు మొక్కల ఉత్పాదకతను తగ్గించి ఆకులను ముందుగానే చనిపోయేటట్టు చేస్తుంది. ఈ ఫంగస్ కాండం లోపల కూడా పెరుగుతుంది. పంట కోతల తర్వాత ఇది వదిలేసిన దుబ్బులపైన జీవించి ఉండి తరువాత సీజన్లో కొత్త సంక్రమణకు దారితీస్తుంది. నెట్ బ్లాట్చ్ విత్తనాల బరువును మరియు గింజల నాణ్యతను తగ్గిస్తుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కలనుండి సేకరించిన విత్తనాలను వాడండి లేదా ధ్రువీకరించబడిన తెగుళ్లు లేని మూలాలనుండి సేకరించిన విత్తనాలను వాడండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధకత కలిగిన రకాలను వాడండి.
  • సీజన్లో కొంచెం ఆలస్యంగా పంటను వేయండి.
  • నాటేటప్పుడు నారుమడి వెచ్చగా, తేమగా మరియు నీరు నిలువ ఉండకుండా వుండేటట్టు చూడండి.
  • విత్తనాలకు సరిపడా తేమ అందించేందుకు అవసరమైనదానికన్నా లోతుగా నాటకండి.
  • సరిపడా పోషకాలను అందించండి.
  • మట్టిలో సరైన మోతాదులో పొటాషియం వుండేటట్టు జాగ్రత్తలు తీసుకోండి.
  • మొక్కలపై భాగంలో వున్న ఆకులను గమనిస్తూ వుండండి.
  • వేరే పంటతో పంట మార్పిడి చేయండి.
  • ఒక రెండు సంవత్సరాల విరామం అవసరం ఉంటుంది.
  • గాడి మొక్కలను మరియు కలుపు మొక్కలను నియంత్రించండి.
  • పంట కోతల తర్వాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాలను పూడ్చి పెట్టండి.
  • పంట అవశేషాల దుబ్బును ఎంత తక్కువ వీలైతే అంతా తక్కువ తరువాత పంటల వరకూ వుండేటట్టు చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి