Parastagonospora nodorum
శీలీంధ్రం
నీటిలో నానినట్టువుండే మరియు చిన్న పాలిపోయిన (క్లోరిటిక్) మచ్చలు మొక్క క్రింది ఆకులపై కనిపిస్తాయి. ఈ తెగులు క్రింది ఆకుల నుండి ప్రారంభమై ఆకు పైభాగము వరకు విస్తరిస్తుంది. తరువాత ఈ గాయములు పసుపు అంచులు గల టాన్- గోధుమరంగు, గుడ్డు ఆకారపు లేక సక్రమంగా లేని ఆకారంతో ఆకులపై పొక్కులుగా మారుతాయి. ఈ తెగులు పెరిగే కొలది చిన్న గోధుమ శిలీంద్రాలు ఉత్పత్తి చేసే భాగాలను భూతద్దముతో లేక మైక్రో స్కోప్ లో గాని పెద్దగా చూడవచ్చు. ఈ తెగులు వలన ప్రభావితమైన ఆకులు, పైభాగం నుండి పొక్కులు విస్తరించిన కొద్దీ చనిపోతాయి. తేమ వాతావరణము వలన పుష్పీకరణ తరువాత పొట్టు పైన పుండ్లు వృద్ధి చెందడానికి దారితీయవచ్చు. లక్షణాలు చాలాసార్లు ఆకుల పైభాగాన మొదలై ఆకు మొత్తం భాగము బూడిద రంగు భాగాలు ( “ పొట్టు పొక్కు”) గల ముదురు గోధుమ నుండి ముదురు ఊదా రంగు మచ్చలతో నిండుతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే కంకులు ముడుతలు పడి బరువు తక్కువగా ఉంటాయి. ఈ తెగులు సోకిన విత్తనాల నుండి ఒక పద్దతిగా లేని మొలకలను ఉత్పత్తిచేస్తాయి మరియు మొలకలు గోధుమరంగు కొనలను కలిగి వుంటాయి.
క్షమించండి, మాకు ఫయోస్ఫెరియా నోడోరం కు వ్యతిరేకంగా ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స తెలియదు. ఈ తెగులుతో పోరాడటానికి సహాయం చేయగల ఏదైనా విషయం మీకు తెలిస్తే, దయచేసి మాకు తెలియ చేయగలరు. మీ నుండి సమాచారం కొరకు ఎదురు చూస్తున్నాము.
ఈ తెగులు విజృంభణ ప్రమాదాన్ని తగ్గించేందుకు రసాయన చికిత్స ప్రభావవంతమైనదే కానీ ఇది చిన్న పొలాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. శిలీంద్ర నాశినులు అవసరమైనట్లైతే డైఫెనోకొనాజోల్, ట్రైఆడిమెనోల్ లేదా ఫ్లూక్విన్కొనాజోల్ తో కూడిన ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. తెగులు సోకిన సమయం మరియు సాగు రకాన్ని పరిగణనలోకి తీసుకున్న దానిని బట్టి ఈ సీలింద్ర నాశినులను ఎలా వాడాలో నిర్ణయించుకోవాలి.
గోధుమ గడ్డి , సంక్రమణము చెందిన విత్తనములు లేక ప్రత్యామ్నాయ అతిధి పంటలపై బ్రతికే ఈ ఆకు తెగులు పారాస్టాగొణొస్పోరా నోడోరుమ్ అనే ఫంగస్ వలన కలుగుతుంది. ఈ తెగులు నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ఫంగస్, మొక్కలకు సోకడానికి కనీసము 12 నుండి 18 గంటల వరకు తడిగా ఉండాలి. మట్టికి దగ్గరగా ఉన్న ఎదిగిన ఆకులు మొదట ప్రభావితం అవుతాయి. ఆ తరువాత తెగులు గాలి మరియు వర్షము గాలి జల్లుల ద్వారా మొక్క యొక్క పై భాగములకు మరియు చుట్టుప్రక్కల పంటలకు విస్తరిస్తాయి. సీజన్లో ఆలస్యంగా సోకే తెగుళ్లు మొక్కలపైకి విస్తరిస్తునప్పుడు పొట్టు పైన పొక్కులు పుండ్లు ఏర్పడే అవకాశం వుంది. దీనివలన గింజలు ముడుతలు పడి మరియు దిగుబడి తగ్గిపోతుంది. శిలీంద్రాలు గాలిచే వ్యాపించబడి దూరంగా ప్రయాణించి ఇతర పొలాల్లో మొలకలపై చేరతాయి. దీని వలన పంటలు త్వరగా సంక్రమణము చెంది మరియు మోకలలు సరైన రీతిలో మొలకెత్తవు. ఉష్ణోగ్రత 7°C కంటే తక్కువకు పడిపోయినపుడు తెగులు యొక్క జీవిత చక్రము ఆగిపోతుంది మరియు 20°C మరియు 27°C మధ్య దీని పెరుగుదల అధికంగా ఉంటుంది.