ఇతరములు

జొనేట్ ఆకు మచ్చ తెలుగు

Microdochium sorghi

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ముందుగా ఎర్రని గోధుమ రంగు మరియు నీటిలో నానినట్టు వుండే మచ్చలు ఆకులపైన ఏర్పడతాయి.
  • తరువాత ఈ మచ్చలు ముదురు ఎర్రని మచ్చలుగా మారి కేంద్రీకృతంగా విస్తరిస్తాయి.
  • ఈ మచ్చలు ఆకు ప్రధాన ఈనె వద్ద లేదా ఆకుల అంచులవద్ద గుండ్రని లేదా అర్ధ చంద్రాకారంలో ఒకదానితో ఇంకొకటి కలసిపోతాయి.
  • ఈ మచ్చలు ఆకు కాడలపైన కూడా ఏర్పడవచ్చు మరియు పుష్ప గుచ్చాలు ఎండిపోయిన లక్షణాలు కనపరుస్తాయి.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు ఆకులపైన, ఆకు కాడలపైన మరియు పుష్పగుచ్చాలపైన కనపడతాయి. ఆకులపైన ఎర్రని గోధుమ రంగు మరియు నీటిలో నానినట్టువున్న మచ్చలు ఏర్పడతాయి. కొన్ని సార్లు వీటి చుట్టూ సన్నని, పాలిపోయిన పచ్చ రంగులో వృత్తాకారపు మచ్చలు ఏర్పడతాయి. వీటి పరిమాణం పెరుగుతునప్పుడు ఇవి చుట్టూ ఎర్రని అంచుతో లేత గోధుమ రంగు మధ్య భాగంతో మచ్చలుగా మారతాయి. ఆకుల అంచులవద్ద ఇవి అర్ధ చంద్రాకారంలో ఉంటాయి. ఆకు ప్రధాన ఈనెల వద్ద మాత్రం ఇవి వృత్తాకారంలో ఉంటాయి. ఒక స్వాభావికమైన ప్రత్యామ్న్యాయం లేదా లేత మరియు ముదురు వలయాలతో ప్రత్యేకమైన జొనేట్ నమూనా సృష్టంగా కనపడుతుంది. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మొత్తానికి ఈ మచ్చలు కలిసిపోయి ఆకు మొత్తం ఆక్రమిస్తాయి. ఆకు కాడలపైన ఒకొక్కటి ఒకొక్క పరిమాణంలో ఒకొక్క ఆకారంలో ముదురు ఎర్రని రంగు నుండి నలుపు-వంగ పండు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన ఆకుల కాడలు పసుపు రంగులోకి మారి వాలిపోయి చనిపోతాయి. అనేక రకాల ఫంగస్సులను ( స్కల్రోటియా) ఈ నిర్జీవమైన మచ్చలలో చూడవచ్చు. తెగులు సోకిన పుష్ప గుచ్చాలు ఎండిపోయినట్టు అయిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. ఈ తెగులును నియంత్రించడానికి లేదా తీవ్రతను తగ్గించడానికి మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అధిక ఖర్చు వలన చాలా పరిస్థితులలో ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి శీలింద్ర నాశినులు సిఫార్స్ చేయబడలేదు. పంట కోతల తర్వాత పంట అవశేషాలను సరైన పద్దతిలో నాశనం చేయడం మరియు పంట మార్పిడి పద్ధతులు ఆచరించడం వంటి పంట యాజమాన్య పద్ధతులు పాటించడం ఈ తెగులు యొక్క ఆచరణాత్మకమైన పద్దతి.

దీనికి కారణమేమిటి?

గ్లోయియోసేర్కుస్పోరా సోర్గి అనే ఫంగస్ కారణంగా ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. ఈ ఫంగస్ విత్తనాలు లేదా మట్టిలో కొన్ని సంవత్సరాలవరకూ జీవించి ఉంటాయి. స్కలేరోటియా అని పిలువబడే ఈ ఫంగల్ గుప్త నిర్మాణాలు(మచ్చలపైన కనపడే చిన్న చిన్న ముదురు రంగు చుక్కలు) ఈ తెగులుకు ప్రధాన కారణంగా ఉంటాయి మరియ వీటికి అనుకూల పరిస్థితులలో ( వెచ్చని మరియు తడి వాతావరణం) ఇవి తెగులును విస్తరింపచేస్తాయి. ఇది మట్టిలోనుండి ముదురు ఆకులు మరియు మొక్కల క్రిందిభాగంలో వున్న ఆకులకు నీటి తుంపర్లు లేదా గాలి ద్వారా వ్యాపిస్తాయి. అనుకూల పరిస్థితులలో ఈ తెగులు మొక్క అంత వ్యాపించి మొత్తం ఆకులు అన్నింటికీ విస్తరిస్తుంది. ఈ సూక్ష జీవులు జొన్న పంటలో జొనేట్ ఆకు మచ్చ తెగులును కలుగచేస్తాయి. అంతే కాకుండా ఇవి ఇతర గడ్డి జాతులు అయిన మొక్క జొన్న మరియు చిరు ధాన్యాలకు కూడా సంక్రమిస్తాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధకత కలిగిన ఆరోగ్యకరమైన విత్తన రకాలను ఉపయోగించండి.
  • ఈ తెగులు లక్షణాలకోసం పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టకండి.
  • ఆకులపై తడి తక్కువగా వుండేటట్టు జాగ్రత్తలు తీసుకోండి.
  • నత్రజని ఎరువులు ఈ తెగులు రాకుండా చేస్తాయి అని రుజువైంది కాబట్టి నత్రజని ఎరువులను వాడండి.
  • నాలుగు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి సిఫార్స్ చేయబడినది.
  • మట్టిలో 6 నుండి 7 మధ్యన pH స్థాయిలు వుండేటట్టు చూడండి.
  • పంట అవశేషాలను తొలగించి పొలానికి దూరంగా వాటిని నాశనం చేయండి లేదా తగలపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి