ఇతరములు

బొగ్గు కాడ కుళ్ళు తెగులు

Macrophomina phaseolina

శీలీంధ్రం

క్లుప్తంగా

  • కాడలు మరియు అంతర్గత కణజాల పై నల్లటి మచ్చలు, వీటికి మాడిన రూపాన్ని ఇస్తాయి.
  • నల్లటి ఫంగల్ స్పెక్స్ తో గట్టి పీచు కణజాలు కణుపుల లోపల కనిపిస్తాయి.
  • మొక్కలు త్వరగా ఎదిగి బలహీనమైన వెదురును కలిగి ఉంటాయి.
  • దీనివలన వాలిపోవడం లేదా పడిపోవడం జరుగుతుంది.
  • పైన ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.


ఇతరములు

లక్షణాలు

మట్టిలో జీవించే ఈ ఫంగస్ వేర్లపై దాడి చేస్తాయి మరియు క్రమంగా కాండాల పైకి వ్యాపిస్తాయి. కాండాలు మరియు అంతర్గత కణజాల పై నల్లటి మచ్చలు, వీటికి మాడిన రూపాన్ని ఇస్తాయి. నల్లటి ఫంగల్ స్పెక్స్ తో గట్టి పీచు కణజాలు కణుపులపై కనిపిస్తాయి. అంతర్గత రవాణా చేసే కణజాలం దెబ్బతినడం వలన మొక్కలు నీటి లోపలికి గురి అయినట్టు కనిపిస్తాయి. మొక్కలు తొందరగా ఎదిగి బలహీనమైన కాడలు కలిగి ఉంటాయి. పైన ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.గోధుమ రంగు నీటిలో తడిచినట్టు వున్న మచ్చలు వేర్లపై కనిపిస్తాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే సుమారు సగానికి సగం మొక్కలు విరిగిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పెరటి పెంట,వేప నూనె పదార్థాలు మరియు ఆవ పిండి కేక్ వంటి పదార్ధాలను వాడి ఈ మాక్రోఫోమిన కు సేంద్రియ చికిత్స చేయవచ్చు. చిరుధాన్యాలు మరియు కలుపు ఆధారిత కంపోస్ట్ వాడి భూమి సవరణ చేయటం భూమిలో వీటి జనాభాను 20-40% తగ్గిస్తుంది. ట్రైకోడెర్మా విరిడి ( 250 కిలోల వెర్మి కంపోస్టుకు లేదా FYM కు ఐదు కిలోల ట్రైకోడెర్మా విరిడి) కలిపి విత్తనాలు వేసే సమయంలో వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఆకులపై పురుగుల మందులను పిచికారీ చేయడం వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ తెగులు లక్షణాలు మొదట్లో కనిపించినప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. శీలింద్ర నాశినులుతో శుద్ధి చేసిన విత్తనాలను ( ఉదాహరణకు మాంకోజెబ్ లాంటివి) వాడడం వలన ఈ తెగులును మొక్కలు తట్టుకుంటాయి. ఒక హెక్టారుకు 18 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ ను వాడడం వలన కూడా మొక్కలు దృడంగా అయ్యి ఈ ఫంగస్ ను తట్టుకునే సామర్ధ్యాన్ని కలగచేస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు మాక్రోఫోమైన ఫేసెమోలినా అనే ఫంగస్ వల్ల కలుగుతుంది, ఇది పొడి వాతావరణాలలో చురుగ్గా ఉంటుంది. ఇవి భూమి లోని పంట అవశేషాల్లో దాదాపుగా మూడు సంవత్సరాల పాటు జీవించి ఉంటాయి. వేర్ల పై ఇవి చేసే దాడి వల్ల మొక్కలకు నీరు మరియు పోషకాలు అందవు. దానివలన మొక్కల పైభాగాలు చనిపోతాయి. లక్షణాలు కరువు, పెరిగిన భూమి ఉష్ణోగ్రతలు మరియు అధిక ఎరువుల వాడకం వల్ల అధికంగా కనిపిస్తాయి.కరువు సమయంలో, మట్టిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు (28°C కన్నా అధికం)మొక్కల వృద్ధి దశ చివర్లో నత్రజని అధికంగా వేయడం వలన ఈ తెగులు లక్షణాలు మరింత తీవ్రమౌతాయి.


నివారణా చర్యలు

  • కరువును నీటి ఎద్దడిని తట్టుకునే విత్తన రకాలు ఎంచుకోవాలి.
  • పడిపోకుండా వుండే రకాలను ఎంచుకోవాలి.
  • పూత వచ్చే సమయంలో పొడి వాతావరణం లేకుండా ఉండేలా నాట్ల సమయాన్ని ఎంచుకోవాలి.
  • మొక్కల మధ్యలో దూరాన్ని ఎక్కువగా ఉండేలాగా చూడాలి.
  • పూత అనంతర దశ లో నీరు పెట్టి నేలలో తేమ అధికంగా ఉండేలాగా చూడాలి.
  • ఫలసమతుల్య ఎరువులను వాడాలి మరియు అధిక నత్రజని వాడకం తగ్గించాలి.
  • పంటను త్వరగా కోసి దిగుబడి నష్టాలు కలగకుండా చూడాలి.
  • ఈ తెగులు సోకని మొక్కల రకాలతో పంట మార్పిడి చేయాలి.
  • పంట కొత్త తర్వాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాల్ని పాతి పెట్టాలి.
  • మట్టిని సూర్యరశ్మి బాగా తగిలేటట్టు దున్నాలి.
  • ఇది ఫంగస్ జనాభా తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి