Colletotrichum graminicola
శీలీంధ్రం
మొక్కల రకాలు, వాతావరణం మరియు ఈ క్రిముల బలాన్ని బట్టి ఈ తెగులు లక్షణాలను అంచనా వేయవచ్చు. ఆకు తెగులు, డైబాక్ మరియు కొమ్మలు కుళ్లిపోవటం వంటివి, వీటి లక్షణాలు. చిన్న గుండ్రని నీటిలో తడిచినట్టువున్న మచ్చలు కింది ఆకుల కోణాల్లో కనిపిస్తాయి. ఇవి తరువాత పారదర్శకమైన మధ్యలో రాగి రంగు మరియు చుట్టూ ఊదా రంగు అంచులు కలిగిన మచ్చలుగా మారుతాయి. తరువాత దశల్లో ముదర బోడుపుల వంటి స్ఫోటకాలు కనిపిస్తాయి. మొక్కల పై గాయాలు డైబాక్ మరియు కొమ్మల కుళ్లిపోవటానికి కారణమవుతాయి.
ఈ తెగులుకు ఎటువంటి జీవ నియంత్రణ పద్దతి లేదు. మీకు ఏమైనా నివారణోపాయం తెలిసినట్లైతే దయచేసి మాకు కూడా ఆతెలియచేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూవుంటాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్పటి వరకు వీటికి విరుధంగా ఎటువంటి శీలింద్ర నాశినులను కనిపెట్టలేదు.
ఆకు ఈనెల పైన వున్న గాయాలు పైన వుండే ఆకులకు లేదా కాడలు ఇతర తెగుళ్లు సోకడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తుంది. కాడలు దెబ్బతినడం వలన అంతర్గత కణజాలాన్ని ఈ తెగులు ఆనిసంచే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ మట్టి లోని పంట అవశేషాలపై జీవిస్తుంది, ఇక్కడ నుండి ఇది క్రింద ఉన్న ఆకుల పైకి గాలి లేదా వర్షం వలన వ్యాపిస్తుంది. ఆకులపై మచ్చలు మెల్లగా కొమ్మలకు కూడా వ్యాపిస్తాయి. కొమ్మలకు తగిలే దెబ్బలు వీటి ప్రభావాన్ని పెంచుతాయి. ఫంగస్ జీవిత చక్రానికి వేడి ఉష్ణోగ్రతలు (20 నుండి 30 డిగ్రీల సెల్సియస్) , అధిక తేమ మరియు తరుచుగా పడే వర్షాలు అనుకూలిస్తాయి.ఈ తెగులు మొలకల దశ నుండే ఆశించే అవకాశం వుంది కానీ పొలంలో తగిన మోతాదులో ఎరువులు వాడడం వలన ఈ తెగులు వలన దిగుబడిలో ఎక్కువగా నష్టాలు కలగవు.