Botrytis cinerea
శీలీంధ్రం
పండ్లు లేదా కాయలు మరియు ఆకులపై అధికమొత్తంలో బూడిద బూజు కనపడుతుంది. దీనివలన ఒక గజిబిజి ఆకారం ఏర్పడుతుంది. మొక్కల కొన్ని భాగాలు కానీ లేదా మొక్క మొత్తం కానీ వాలిపోయి గోధుమ రంగులోకి మారి చనిపోవచ్చు. వెంట్రుకల లాంటి మరియు బూడిదరంగు నుండి గోధుమ రంగు అతుకులు ఈ కణజాలాలపై విస్తారంగా కనిపిస్తాయి. పండ్లను నిలువ చేసిన సమయంలో కూడా ఈ తెగులు సంక్రమిస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ పంట దిగుబడికి తీవ్రంగా నష్టం కలుగుతుంది. మొక్క క్రింద భాగంలో వున్న ఆకులు మరియు కాండం కుళ్లిపోయి మొత్తంగా మొక్కలు చనిపోతాయి. కొన్నిపంటలలో అప్పుడప్పుడు కొమ్మలు చనిపోవడం మరియయు కాంకర్స్ ఏర్పడడం జరుగుతుంది.
ట్రైకోడెర్మా హర్జీయానాం వంటి జీవ శీలింద్ర నాశినులను ఉపయోగించవచ్చు. స్ట్రెప్టోమైసిస్ గ్రిసియో విరిడేస్ కూడా లెట్టూస్ వంటి పంటలలో వాడవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పంట కోతల సమయం దగ్గర పడినప్పుడు ఈ తెగులు వ్యాపించడం వలన ఈ తెగులును నియంత్రించడం చాలా కష్టమైన పని. ఈ సమయంలో పురుగుల మందులను వాడడం వలన పంట ఉత్పత్తులపై ఈ పురుగుల మందుల విశేషాలు ఉండి పోయి విషపూరితం అవుతుంది. ఈ తెగులు ముందు దశలలో సంక్రమించినట్లైతే క్లోరోతలోనిల్ వాడవచ్చు. ఫ్లూవాజినం మరియు థియోఫానేట్-మిథైల్ కూడా పనిచేస్తాయి. అధికంగా వాడే పురుగుల మందులకు ఈ తెగులు నిరోధకతను పెంచుకుంటుంది.
ఈ తెగులు భూమిలో ఉండే బొట్రీటీస్ సినేరియా అనే ఫంగస్ వలన కలుగుతాయి. ఇది తరుచు వర్షాలు మరియు చల్లని వాతవరణం, అధికంగా తడిగా ఉన్న పరిసరాల్లో వ్యాపిస్తుంది. ఫంగస్ ఎదుగుదలకు మరియు వ్యాప్తి చెందటానికి తగిన ఉష్ణోగ్రతలు 15 - 20 డిగ్రీల సెల్సియస్. లక్షణాలు మొదట దెబ్బతిన్న ఆకులు మరియు తీగల మీద కనిపిస్తాయి. పొలానికి అధికంగా నీటి సరఫరా చేయటం లేదా మొక్కలను దగ్గరగా నాటడం వలన కూడా ఫంగస్ ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని అందించినట్టు అవుతుంది.