వరి

వరి పొడ తెగులు

Rhizoctonia solani

శీలీంధ్రం

క్లుప్తంగా

  • కోలగా, ఆకుపచ్చ నుండి బూడిద రంగులో నీట నానినట్టు వున్న చారలు నీటికి దగ్గరలో కాండాలపైన కనిపిస్తాయి.
  • అపసవ్యంగా వున్న బూడిద నుండి తెలుపు రంగు మచ్చలు గోధుమ రంగు అంచులతో ఆకులు మరియు కాడలపైన కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

కోలగా, ఆకుపచ్చ నుండి బూడిద రంగులో నీట నానబెట్టినట్టువున్న చారలు నీటికి దగ్గరలో కాండాలపైన కనిపిస్తాయి. అపసవ్యంగా వున్న లేని బూడిద నుండి తెలుపు రంగు మచ్చలు గోధుమ రంగు అంచులతో ఆకులు మరియు కాడలపైన కనిపిస్తాయి. నీటి రేఖల దగ్గరగా కాండాల పైన మచ్చలు సంక్రమణలో తొలి చిహ్నాలు. ఈ మచ్చలు కోలగా, ఆకుపచ్చ-బూడిద రంగు తో, 1-3 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ మచ్చలు సక్రమంగా పెరుగుతూ బూడిద నుండి తెలుపు రంగులోకి మారుతాయి. వీటికి గోధుమ రంగు అంచులు కూడా ఉంటాయి. వ్యాధి పెరుగుతున్న కొద్దీ మొక్క యొక్క పై భాగాలకు సంక్రమిస్తాయి. ఈ భాగాల్లో వేగంగా పెరుగుతున్న మచ్చలు కనిపిస్తాయి మరియు ఆకు పూర్తిగా ప్రకాశవంతంగా మారుతుంది. ఇది ఆకు మరియు మొక్క మొత్తంగా చనిపోవడానికి దారి తీస్తుంది. అంతే కాకుండా మొక్క పైన శిలీంధ్ర బీజాలు వ్యాపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

దురదృష్టవశాత్తు ఇప్పటి వరకూ సమర్థవంతమైన జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులును నివారించడానికి హెక్సాకొనజోల్ 5EC (2 మీలి/లీ) లేదా వాలిడామైసిన్ 3 లీటర్లు (2 మీలి/లీ) లేదా ప్రొపికోనజోల్ 25 EC (1 మీలి/లీ) లేదా ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + టేబుకోజనోల్ (.4 గ్రా/లీ) ను వాడండి. 15 రోజులకు ఒకసారి మార్చి పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

29 నుండి 32 డిగ్రీల ఉష్ణోగ్రత, నత్రజని ఎరువులు ఎక్కువ వాడకం, ఎక్కువ మొత్తంలో తేమ ఉండడం (85 నుండి 100 % వరకు) వరిలో పొడ తెగులు సోకడానికి ముఖ్యమైన కారణాలు. వర్షాకాలంలో ఈ తెగులు సోకడానికి మరియు వ్యాప్తి చెందడానికి అవకాశాలు బాగా ఎక్కువ. ఈ ఫంగస్ చాలా సంవత్సరాల వరకు మట్టిలో నిద్రావస్థలోనే స్సీలేరోషియం గా జీవించి ఉండగలదు. పంటలో నీరు పెట్టగానే ఇది ఇది పైకి వస్తుంది. ఒకసారి వరి పైరును తాకగానే ఈ ఫంగస్ ఆకు కాడలలో ప్రవేశించి తెగులును వ్యాపింపచేస్తుంది.


నివారణా చర్యలు

  • ద్రువీకరింపబడిన మూలాలనుండి ఆరోగ్యంగా వుండే విత్తనాలను కొనుగోలు చేయండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధక రకాలను వాడండి.
  • మీ వరి నాట్లను ఆలస్యంగా నాటడానికి ప్లాన్ చేసుకోండి.
  • నాటేటప్పుడు తక్కువ మొలకలను నాటండి లేదా మొలకల మధ్యన ఎక్కువ ఎడం ఉంచండి.
  • పంటకు అనుగుణమైన సమతుల్య ఎరువుల ప్రణాళికను ఉపయోగించండి మరియు నత్రజనిని విడతల వారీగా వేయండి.
  • సరైన సాంద్రతతో మొక్కలు నాటండి(నేరుగా వేయడం లేదా నారు ద్వారా నాటడం).
  • కలుపు, ముఖ్యంగా పొలం గట్టుపైన వుండే కలుపు మొక్కలను తొలగించండి.
  • సీజన్లో అంటూ వ్యాధులు ప్రబలకుండా, పొలంలో నుండి నీరు బైటకి పోవడానికి సరైన డ్రైనేజ్ వ్యవ్యస్థను ఏర్పాటు చేసుకోండి.
  • పంట కోత తర్వాత గడ్డి మరియు ఇతర మొక్కల అవశేషాలను నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి