Mycosphaerella sp.
శీలీంధ్రం
సిగటోక ఫంగస్ మొదటి లక్షణాలు ప్రతి మూడు లేదా నాలుగవ ఆకుపై కనిపిస్తాయి. చిన్న, లేత పసుపు రంగు మచ్చలు (1-2 మిల్లీమీటర్ల పొడవు) ఆకుల పై అంచుల వద్ద రెండవ ఈనెకు సమాంతరంగా (పసుపుపచ్చ సిగటోక) ఇంకా ఎరుపు నుండి -గోధుమ రంగు చారలు కింది వైపు (నల్లటి సిగటోక) కనిపిస్తాయి. ఇవి వృద్ధి చెంది సన్నని గోధుమ లేక ముదర ఆకు పచ్చ మచ్చలుగా కనిపిస్తాయి. ఇవి మరింత పెద్దవిగా మారి ఎరుపు రంగు చారలు నిటారుగా కనిపిస్తాయి (4-12 మిల్లీమీటర్ల పొడవు). పసుపు రంగుతో కూడిన ఎరుపు మచ్చలు ఆకుల అంచులపై కనిపిస్తాయి. ఈ మచ్చల మధ్యభాగం బూడిద-గోధుమరంగు నుండి గోధుమ రంగులోకి మారి నిర్జీవమైన మచ్చలుగా అవుతాయి. ఆకులలో పగుళ్ళ వలన ఆకు అంతా చిరిగిపోయినట్టు కనిపిస్తుంది.
జీవ శీలింద్ర నాశినులు అయిన ట్రైకోడెర్మా ఆట్రోవిరిడే వంటి వాటి వాడకాన్ని పొలాల్లో పరీక్షించి చూస్తున్నారు. కత్తిరించిన మొక్కల భాగాలపై బోర్డియక్స్ ను పిచికారీ చేయటం వలన ఈ ప్రాంతాలలో తెగులు మరలా రాకుండా ఉంటుంది.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు ఎక్కువ స్థాయిలో ఉండకపోతే మాంకోజెబ్, కాలిక్సిన్ లేదా క్లోరోతలోనిల్ కలిగిన శీలింద్ర నాశినులను పిచికారీ రూపంలో వాడవచ్చు. ప్రొపికోనజోల్, ఫెన్బుకోనజోల్ లేదా అజోక్సీస్ట్రోబిన్ వంటి శీలింద్ర నాశినులను వాడవచ్చు. ఈ మందులకు నిరోధకత పెరగకుండా, వీటిని మార్చి మార్చి వాడాలి.
పసుపు మరియు నలుపు సిగటోక తెగులు లక్షణాలకు, మైకోస్ఫారెళ్ళ మ్యుసికోలా అనే ఫంగస్ కారణమవుతుంది. ఈ తెగులు ప్రపంచ వ్యాప్తంగా వుంది. అరటిలో ఈ తెగులు చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అధిక ఎత్తులలో చల్లని వాతావరణంలో లేదా వెచ్చని వాతావరణం వుండే ఉప ఉష్ణమండల ప్రాంతాలలో వర్షాకాలంలో ఈ ఫంగస్ చనిపోయిన లేదా బ్రతికివున్న మొక్కల కణజాలాలపై జీవిస్తూ బీజాలను విడుదల చేస్తుంది. ఈ తెలుగు వ్యాప్తి చెందే మరొక మార్గం తెగులు సోకిన మొక్క వ్యర్థాలు, మొక్కల చెత్త లేదా తెగులు సోకిన పండ్లను రవాణా చేయడం వలన వ్యాప్తి చెందుతుంది. ఇది అధిక ఎత్తులో, చల్లటి ఉష్ణోగ్రతలలో లేదా వెచ్చని వాతావరణాలు మరియు అధిక సాపేక్ష ఆర్ద్రత కలిగిన పెరుగుతున్న ఉప ఉష్ణమండల ప్రాంతాలలో వర్షాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఈ ఫంగస్ 27°C వద్ద బాగా వృద్ధి చెందుతుంది. ఇది లేత ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వలన మొక్కల ఉత్పాదకత తగ్గుతుంది. దీనితో అరటి గెల పరిమాణం తగ్గి పండు త్వరగా పక్వానికి వస్తుంది.