Oidium caricae-papayae
శీలీంధ్రం
నీట నానినట్టు వుండే మచ్చలు పౌడరు లాంటి బూడిద తెలుపు మచ్చలు ఆకుల కింది భాగంలో కనిపిస్తాయి. పసుపు రంగు వృత్తంతో పాలిపోయినట్టు వుండే ఆకుపచ్చ నుండి గోధుమ మచ్చలు అప్పుడప్పుడు ఆకుల పైభాగం లో కనిపిస్తాయి. తెల్లటి ఫంగస్ అతుకులు ఇంకా పండని పండ్లపై కనిపిస్తాయి. ఎక్కువగా సంక్రమణకి గురైన ఆకులు లోపలికి ముడుచుకుపోతాయి. పండ్లపై కూడా బూడిద తెగులు అనేక పరిమాణాల్లో కనిపిస్తుంది. దీని ప్రభావం పెద్ద మొక్కలపై అంతగా ఉండదు కానీ లేత మొక్కలలో వాటి ఎదుగుదలకు సంబంధిత కణజాలు చనిపోయే లాగా చేస్తాయి మరియు దిగుబడి నష్టాలు కలుగచేస్తాయి.
తడి సల్ఫర్, సల్ఫర్ డస్ట్, లేదా లైం సల్ఫర్ మరియు పొటాషియం బైకార్బోనేట్ వంటివి వ్యాధిని నియంత్రించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి అని నిరూపించబడినది. కానీ అధిక వేడి వాతావరణం లో వీటిని వాడటం వలన ఇది మొక్కలపై విషపూరిత ప్రభావం చూపిస్తుంది. కొన్ని పరిస్థితులలో బేకింగ్ సోడా, వేప నూనె, మరియు సబ్బు ద్రవాలు కూడా వాడవచ్చు. కానీ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నపుడు ఇవేమి పని చేయవు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అజోక్సీస్ట్రోబిన్, బెనోమిల్, కార్బెన్డజిమ్, లేదా మాంకోజెబ్ వంటి శీలింద్ర నాశినులనువాడి బూడిద తెగులును నియంత్రించవచ్చు.
ఈ వ్యాధి ఓడియం క్యారికేఎ-పాపాయే అనే ఫంగస్ వల్ల కలుగుతుంది మరియు ఇది కేవలం బొప్పాయి మొక్కల పైనే జీవించగలదు. గాలి వలన ఇది ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు మరియు పక్కన వున్న పొలాల్లోకి కూడా వ్యాపిస్తుంది. అన్ని ఎదుగుదల దశల్లోను ఈ తెగులుకు ఆకులు గురవుతాయి. కానీ ముదురు ఆకులు ఎక్కువ హానికి గురవుతాయి. ఈ ఫంగస్ గుంపులుగా ఎపిడెర్మల్ సెల్స్ పెట్టడం వల్ల ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. తక్కువ కాంతి, అధిక ఆధ్రత, ఒక మోస్తరు ఉష్ణోగ్రతలు (18 నుండి 32) మరియు సంవత్సరంలో 1550 నుండి 2500 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ తెగులు లక్షణాలను అధికం చేస్తాయి.