Colletotrichum gloeosporioides
శీలీంధ్రం
ఈ తెగులు దానంతట అదే ఆకులపై ఏర్పడుతుంది. కానీ ఇది సహజంగా పండ్లకు సంక్రమించే తెగులు. ఆకులపై బూడిద రంగు నుండి గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. తరువాత ఈ మచ్చలు ఒక ప్రాంతానికి చేరి పెద్దగా మారతాయి. ఇది ఎదిగిన కొద్దీ మచ్చలు పెరుగుతాయి మరియు గుండ్రంగా, ముదురు గోధుమ మచ్చలుగా కనిపిస్తాయి. ముందుగా పండ్ల తొక్క పైన చిన్న మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చలు పెద్దగా అయ్యి ఐదు సెంటీమీటర్ల వరకు ఎదుగుతాయి. ఇవి గుండ్రంగా గోధుమరంగు మచ్చలుగా మారి నీటిలో నానినట్టుగా ఉండి కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. ఈ గాయాల మధ్యలో గులాబీ రంగు నుండి నారింజ రంగు మచ్చలు ఏర్పడతాయి. చిన్న పరిమాణంలో ఎర్రని గోధుమరంగు లో కొంచెం నొక్కుకుపోయినట్టు వుండే (రెండు సెంటీమీటర్ల వరకు) "చాక్లెట్ స్పాట్స్" అనబడే మచ్చలు ఏర్పడతాయి. పండ్లు ముందుగానే రాలిపోతాయి. పంట కొత్త తర్వాత వీటిని శీతల గోదాములలో నిలువ ఉంచినప్పుడు ఈ తెగులు లక్షణాలు బహిర్గతం అవుతాయి.
బాసిల్లస్ సబ్టిలిస్ లేదా బాసిల్లస్ మైలోలిక్యూఫేసియన్స్ వంటి జీవ శీలింద్రాలను కూడా ఉపయోగించవచ్చు. వేడి నీళ్ల చికిత్స ( 20 నిముషాల వరకు 48°C వద్ద) కూడా పండ్లపై ఉన్న ఫంగస్ ను చంపటానికి, రవాణాలో మరియు పొలంలో మరల ఈ తెగులు సోకకుండా చేయడానికి ఉపయోగపడుతుంది.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నివారించడానికి అజోక్సిస్త్రోబిన్, క్లోరోఠాలోనిల్ లేదా కాపర్ సల్ఫేట్ లు గల శిలీంద్ర నాశినులను కనీసం 10 నుండి 12 రోజుల అంతరంతో వరుసగా కనీసం 3 సార్లు పిచకారీ చెయ్యవచ్చు. ఈ ఉత్పత్తులతో విత్తన శుద్ధి కూడా చేయవచ్చు. చివరగా పంట కోతల తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఈ మందులతో పాటు ఆహార ప్రమాణాలకు అనుగుణంగా వుండే మైనాన్ని వాడవచ్చు.
పక్షి కన్ను తెగులు ప్రపంచ వ్యాప్తంగా ఒక ముఖ్యమైన తెగులు. ఇది కల్లెతోత్రిచమ్ గ్లోఎస్ప్రియోడ్స్ అనే మట్టిలో జీవించే ఫంగస్ వలన కలుగుతుంది , ఇది విత్తనాలు మరియు పంట అవశేషాల పైన జీవిస్తుంది. ఇది గాయాలు లేని ఇంకా పక్వ దశకు రాని కాయలపైన పరిసరాలు అనుకూలంగా ఉన్నపుడు ఇది గాలి మరియు వర్షం వల్ల వ్యాపిస్తుంది. మామిడి, అరటి మరియు అవకాడో వంటి పంటలు దీనికి ప్రత్యామ్న్యాయ అతిధులు. సాధారణ ఉష్ణోగ్రతలు,(18 మరియు 28°C) అధిక తేమ( 97%)మరియు తక్కువ pH (5.8 నుండి 6.5) ఈ తెగులు వ్యాపించడానికి అనుకూల పరిస్థితులు. పొడి వాతావరణం మరియు అధిక సూర్యరశ్మి లేదా అధిక ఉష్ణోగ్రతలు దీనికి ఎదుగుదలకు అనుకూలంగా వుండవు. ఈ ఫంగస్ తన జీవిత చక్రం పూర్తి చేసుకోవటానికి పండ్లు ఒక దశ వరకు పండటం అవసరం.