చిక్కుడు

చిక్కుడు జాతి మొక్కల్లో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

Cercospora canescens

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై, చుట్టూ ఎర్రటి గోధుమ రంగు అంచులతో, చిన్న పాలిపోయిన-గోధుమ రంగు రింగ్ మచ్చలు.
  • కొమ్మలు మరియు ఆకుపచ్చ కాయలపై మచ్చలు.
  • ఆకులు భారీగా రాలిపోతాయి.
  • దిగుబడి తగ్గుతుంది.


చిక్కుడు

లక్షణాలు

వ్యాధి లక్షణాలు వ్యాధి తీవ్రవతను బట్టి మరియు మొక్కల రకాల్ని బట్టి మారుతుంది. నీటిలో నానినట్టు కనిపించే చిన్న మచ్చలు గోధుమ రంగు మరియు పసుపు రంగు కలిగి ఆకుల పై నాటిన 3-5 వారాల్లో కనిపిస్తాయి. తెగులు తర్వాత దశలో ఈ మచ్చలు బాగా ఎక్కువ అయ్యి నిర్జీవంగా( ముదురు గోధుమ రంగు) ఎర్రని గోధుమరంగు అంచులతో అణుగారిపోయినట్టు కనిపిస్తాయి. ఇవి వేరే మొక్కల పై కూడా వ్యాపించే అవకాశం ఉంది. అనుకూలమైన వాతావరణంలో ఆకు మచ్చలు పూత మరియు కాయలు తయారయ్యే సమయాల్లో అధికంగా నష్టాన్ని కలిగిస్తాయి. శిలీంద్రం కాయల పైన మరియు లోపల కూడా వ్యాపించి 100% దిగుబడి నష్టాన్ని కలగజేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

విత్తనాల వేడినీళ్ళ ట్రీట్ చేయడం వీలుపడుతుంది. వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడంలో వేప నూనె సారం వాడటం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. (ఎక్కువ కాయలు మరియు గింజలు, ఆరోగ్యమైన కాయలు, ఎక్కువ బరువు)

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవ సంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినుల వాడకం అవసరం అయితే మాంకోజెబ్, క్లోరో తలోనిల్ @1 గ్రా/లీ లేదా థియోఫెనెట్ మిథైల్ 1 మి.లీ/లీ కలిగిన ఉత్పత్తులను వాడండి. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు వాడండి.

దీనికి కారణమేమిటి?

ఆకుమచ్చ, సెర్కోస్పోరా కానసేన్స్ అనే శీలింద్రం వలన కలుగుతుంది. ఇది మినుములు మరియు పెసలు, రెండింటికీ సోకుతుంది. ఈ శీలింద్రం దాదాపు 2 సంవత్సరాలు మట్టిలో పంట అవశేషాలపై జీవించి ఉంటుంది. వేరు వ్యవస్థను అనుసరిస్తూ ఇది మట్టిలో చాలా దూరం ప్రయాణిస్తుంది. ఇది ప్రత్యామ్నాయ ఆతిథ్య మొక్కలు లేదా పొలంలో స్వచ్చందంగా వచ్చిన మొక్కలపై కూడా వృద్ధి చెందుతుంది. ఇది నీరు మరియు గాలి ద్వారా మొక్కల కింది భాగాలకు సోకుతుంది. అనుకూలమైన వాతావరణం రాగానే ఇది మొక్కల పై చేరి వాటిని నాశనం చేస్తాయి. అధిక ఉదయం మరియు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు, తడి నేల, అధిక గాలి తేమ మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు వీటికి సహకరించే వాతావరణ పరిస్థితులు.


నివారణా చర్యలు

  • నెల బాగా ఆరిందని నిర్ధారించుకోండి.
  • ఆరోగ్యంగా వున్న మొక్కల నుండి సేకరించిన విత్తనాలను, లేదా ధృవీకరించబడిన మూలాల నుండి పొందిన విత్తనాలను వాడండి.
  • తెగులు నిరోధక విత్తనాలను వాడండి.
  • పూల నిర్మాణాలు దెబ్బతినకుండా ఉండటానికి మొక్కలను ఆలస్యంగా నాటండి.
  • వరసల మధ్యన తెగులు సంక్రమించకుండా ఉండడానికి, బాగా పొడవుగా పెరిగే తృణధాన్యాలు మరియు చిరుధాన్యాల మొక్కలను అంతరపంటగా వేయండి.
  • గాలి మరియు వెలుతురు బాగా ప్రసరించడానికి, మొక్కల మధ్య తగినంత స్థలాన్ని వదలండి.
  • మొక్కల క్రిందభాగంలో వున్న ఆకులకు తెగులు సోకకుండా నేలమీద మొక్కల చుట్టూ గడ్డి ఇతర పదార్ధాలతో రక్షణ కవచం ఏర్పాటు చేయండి.
  • మొక్కల అవశేషాలన్నింటినీ తొలగించి వాటిని కాల్చడం ద్వారా పొలం మంచి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.
  • కలుషితమైన పరికరాలను శుభ్రపరచండి.
  • మొక్కలు తడిగా ఉన్నప్పుడు పొలంలో పనిచేయడం మానుకోండి.
  • ఈ వ్యాధికి అతిధులు కాని పంటలతో పంట భ్రమణం సిఫార్స్ చేయబడింది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి