Tilletia indica
శీలీంధ్రం
ప్రారంభ దశలలో, కంకులలో కొన్ని గింజల అడుగు భాగాలు నల్లగా అవుతాయి. మెల్ల మెల్లగా ధాన్యాల నుండి లోపలి పదార్థం ఖాళీ చేయబడుతుంది మరియు పాక్షికంగా లేదా పూర్తిగా ఒక నల్లని పౌడర్ లాంటి పదార్ధంతో నింపబడతాయి. ఈ ప్రక్రియలో ధాన్యం వుబ్బదు మరియు దానిపై వున్న డొప్ప పగలకుండా అలాగే వుంటుంది. ఈ తెగులు తీవ్రత పెరిగేకొద్దీ, ఇతర కంకులలో వున్న మరిన్ని ధాన్యాలు ప్రభావితమై గట్టిగా నలిపినప్పుడు ఈ గింజల నుండి కుళ్ళిపోయిన చేపల వాసన వస్తుంది. అయితే, తెగులు సోకిన గింజల సంఖ్య కంకికి 5 లేదా 6 కు మించదు. తెగులు సోకిన మొక్కలు ఎదగకుండా ఉండవచ్చు. ధాన్యం దిగుబడి పైన వ్యాధి యొక్క ప్రభావము తక్కువగా వుంటుంది. కానీ నాణ్యత సమస్యలు కారణంగా లేదా బీజాంశము ఉనికి వలన విత్తనాలు నిరాకరించబడవచ్చు.
క్షమించండి, మాకు టిల్లెటియా ఇండికాకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స తెలియదు. ఈ వ్యాధితో పోరాడే విషయంలో మీకు ఏదైనా తెలిసి వుంటే దయచేసి మీరు మాకు తెలుపగలరు. మీ నుండి సమాచారం కొరకు ఎదురు చూస్తున్నాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.ఈ తెగులులో విత్తన చికిత్స ఏదీ 100% ప్రభావవంతంగా ఉండదు, కానీ తెగులు యొక్క పెరుగుదల మరియు ధాన్య నష్టం తగ్గించేoదుకు అనేక చికిత్సలు ఉన్నాయి. కార్బోక్సిన్-థిరం, డైఫెనోకొనాజోల్, మేఫేనోక్జాం లేదా టేబ్యుకొనాజోల్ ఆధారిత శిలీంద్ర నాశకాలు విత్తనాల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకున్న పొలాలలో గాలి వలన కలిగే ఇన్ఫెక్షన్ ను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
కర్నల్ బంట్, మట్టిలో 4-5 సంవత్సరాల వరకు జీవించి ఉండగలదు. విత్తనం లేదా నేల నుండి పుట్టే ఫంగస్ అయిన టేల్లిటియా ఇండికా వలన ఈ తెగులు సోకుతుంది. కలుషిత భూములు లేదా మొక్కల అవక్షేపాలలో ఉండే బీజాంశాలు ఆరోగ్యకరమైన మొక్కలు మరియు ఇంఫ్లోరేస్సెన్సేస్ కు వ్యాపిస్తాయి. ఈ తెగులు సంక్రమణము పుష్పించే కాలం అంతటా జరగవచ్చును కానీ కంకులు వెలుగులోకి వచ్చే సమయంలో మొక్కలు ఎక్కువగా ప్రభావితము అయే అవకాశం వున్నది. ఈ బూజు తెగులు, అభివృద్ధి చెందుతున్న విత్తనాలను వాటి ఆవాసంగా ఏర్పాటు చేసుకొని, క్రమంగా వాటి లోపలి వున్న పదార్థమును ఖాళీ చేస్తాయి. లక్షణాల యొక్క అభివృద్ధిలో వాతావరణం ఒక ముఖ్యమైన అంశం. ఆర్ద్రత వాతావరణ పరిస్థితులు (> 70%) మరియు ధాన్యం ఏర్పడేటప్పుడు 18 C మరియు 24 ° C మధ్య ఉష్ణోగ్రతలు ఈ తెగులు పెరుగుదలకు అనుకూలమైనది. వీటి బీజాంశములు వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, బట్టలు మరియు వాహనాల ద్వారా వ్యాప్తి చెందే అవకాశము వుంది.