ఇతరములు

మొక్కజొన్నలో నార్తర్న్ లీఫ్ బ్లెయిట్

Setosphaeria turcica

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న, నీటలో నానపెట్టినట్టు వుండే మచ్చలు క్రింది ఆకులపై మొదట కనిపిస్తాయి.
  • ఇవి మెల్లగా కాఫీ రంగులోకి మారి సిగార్ ఆకారంలో నిర్జీవమైన మచ్చలుగా లేత ఆకుపచ్చ రంగుతో ఉబ్బిన అంచులు కలిగి ఉంటాయి.
  • ఈ మచ్చలు తరువాత ఒక దగ్గరకు చేరి మొత్తం ఆకుకు మరియు కొమ్మలకు కూడా వ్యాపిస్తాయి, దీని వల్ల ఆకులు చనిపోయి రాలి పోయే అవకాశం ఉంటుంది.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

చిన్న, గుడ్డు ఆకారంలో నీటలో నానినట్టు ఉన్న మచ్చలు మొదట్లో కింది ఆకుల పై కనిపిస్తాయి. తెగులు ముదిరేకొద్ది మొక్క పైభాగంలో కనబడడం మొదలు పెడుతాయి. పాత మచ్చలు మెల్లగా నలుపుగా మారి, సిగార్ షేప్ లో నెక్రోటిక్ మచ్చలుగా లేత ఆకుపచ్చ రంగుతో అంచుల వద్ద ఉబ్బినట్లు ఉంటాయి. మచ్చలు తరువాత ఒక దెగ్గరికి చేరి మొత్తం ఆకుకి మరియు కొమ్మలు కూడా వ్యాపిస్తాయి. దీని వల్ల ఇవి చనిపోయి, రాలి పోయే అవకాశం ఉంటుంది. కంకుల పెరుగుదల సమయంలో ఇది మొక్కల పై భాగాలకి వ్యాపిస్తుంది. అధిక మొత్తంలో దిగుబడి నష్టాలూ కలుగుతాయి (దాదాపుగా 70%).

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా హర్జినం లేదా బాసిల్లస్ సుబ్టిలిస్ ఆధారిత జీవ శీలింద్రాలు పంట వివిధ దశలలో వాడి వీటిని నియంత్రించవచ్చు. సల్ఫర్ ద్రావణాలు కూడా చాలా ఫలవంతంగా వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంత వరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మొదటి దశలోనే శీలింద్రనాశకాలు వాడటం దీని నియంత్రణకు సహకరిస్తాయి లేదా వీటిని లక్షణాలు మొదట కనిపించినప్పుడు వాడవచ్చు. మొక్కల కానోపి దగ్గర ఈ తెగులు లక్షణాలు కనపడినప్పుడు మొక్క పై ఆకులు మరియు మొక్కజొన్న పొత్తులు ఈ తెగులు సోకకుండా కాపాడడానికి అజోక్సిస్ట్రోబిన్, పికోక్సిస్ట్రోబిన్, మాంకోజెబ్, పైరాక్లోస్ట్రోబిన్, ప్రొపికనజోల్, టెట్రాకోనజోల్ వంటి సీలింద్ర నాశినులు వాడవచ్చు. పికోక్సిస్ట్రోబిన్, + సైప్రోకోనజోల్, పైరాక్లోస్ట్రోబిన్ + మాంకోజెబ్, ప్రొపికనజోల్ + అజోక్సిస్ట్రోబిన్, ప్రొతియోకనజోల్ + త్రిప్లాక్సీస్ట్రోబిన్ విత్తన శుద్ధి కోసం వాడకూడదు.

దీనికి కారణమేమిటి?

ఈ ఫంగస్ మట్టిలో లేదా పంట అవశేషాల పై జీవిస్తుంది. వర్షం, అధిక ఆద్రత మరియు మధ్యస్థమైన ఉష్ణోగ్రతలు ఈ ఫంగస్ పెరుగుదలకు అనుకూలిస్తాయి. గాలి మరియు వర్షం వలన రవాణా చేయబడి ఇవి మొక్కజొన్న మొక్కల కింది భాగాలపై ముందుగా దాడిచేస్తాయి. వర్షా కాలంలో ఇది వేరే మొక్కలకు అధికంగా వ్యాపిస్తుంది. వీటికి 18 నుండి 27°C మధ్య ఉష్ణోగ్రతలు సహకరిస్తాయి. ఈ ఫంగస్ ఎదగడానికి 6 నుండి 18 గంటల వరకు ఆకులు తేమతో ఉండడం అవసరం. జొన్న మొక్కలు ఈ ఫంగస్ కు అతిధి మొక్కలుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక మరియు సహనాత్మక విత్తన రకాలు వాడాలి.
  • తగినంత పోషకాలు అందేలా చూడాలి మరియు అధిక నత్రజని వాడకం ఆపేయాలి.
  • పొలంలో మరియు చుట్టుప్రక్కల కలుపు లేకుండా చూడాలి.
  • సోయాబీన్స్,బీన్స్, లేదా పొద్దుతిరుగుడు పంటలతో పంట మార్పిడి పద్దతులు పాటించాలి.
  • పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాల్ని పాతి పెట్టాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి