వరి

వరిలో గోధుమ రంగు మచ్చ తెగులు

Cochliobolus miyabeanus

శీలీంధ్రం

క్లుప్తంగా

  • లేత ఆకులపై తెల్లని బూడిద రంగు మధ్య భాగంతో గుండ్రటి గోధుమ రంగు నిర్జీవమైన మచ్చలు ఏర్పడతాయి.
  • పరిపక్వత చెందిన మొక్కలపై ఎర్రటి అంచులు కనిపిస్తాయి.
  • కాండం పసుపు రంగు లోకి మారి వాడిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఈ తెగులు అనేక రకాల లక్షణాలను బహిర్గతపరుస్తుంది. పిలకలు వేసే సమయంలో ఆకులపై గుండ్రటి లేదా కోలాకారంలో పసుపు రంగు వలయంతో, మధ్యలో బూడిద లేదా తెలుపు రంగుతో, గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా కనిపించే సంక్రమణకు సంకేతం. ఇవి విస్తరించే కొలదీ ఈ మచ్చల మధ్యన ఒక బూడిద రంగు ప్రాంతం వృద్ధి చెందుతుంది మరియు ఎర్రటి గోధుమ రంగు అంచు కనపడుతుంది. కాడలు రంగు మారడం ఈ తెగులు యొక్క మరొక లక్షణం. అనుమానాస్పద రకాలలో ఈ మచ్చలు 5 నుండి 14 మిల్లీమీటర్ల వరకు పెరగవచ్చు మరియు ఆకులు వాలిపోవాదానికి కారణమవుతాయి. తెగులు నిరోధక రకాలలో పసుపు-గోధుమ రంగులో మరియు సూదిమొన సైజులో మచ్చలు ఏర్పడతాయి. వరి కంకులకు తెగులు సోకడం వలన ధాన్యం సరిగా పాలుపోసుకోకపోవడం లేదా పాలుపోసుకోవడంలో అంతరాయం మరియు ధాన్యం నాణ్యత తగ్గడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

విత్తనాలు కలుషితం కాకుండా ఉండటానికి వాటిని వేడి నీళ్లతో (53 - 54°C) 10 నుండి 12 నిమిషాలు శుభ్రం చేయడం సిఫారస్ చేయబడింది. ఫలితాలు మెరుగుగా ఉండటానికి వేడి నీళ్లతో శుభ్రం చేసే ముందు విత్తనాల్ని 8 గంటల పాటు చల్లటి నీళ్లలో ఉంచండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినులతో విత్తనశుద్ధి చేయడం ఈ తెగులును నివారించడానికి అత్యుత్తమ మార్గం.( ఉదాహరణకు, ఇప్రోడియోన్, ప్రోపికొనజోల్, అజోక్సీస్ట్రోబిన్, ట్రైఫ్లోక్సస్త్రోబిన్)

దీనికి కారణమేమిటి?

కోచ్లయబోలుస్ మియాబీనుస్ కోచీలిబోల్స్ ఫంగస్ వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్, విత్తనాలలో 4 సంవత్సరాలవరకు జీవించి ఉండగలదు. గాలిలో ఎగిరే స్పోర్స్ ద్వారా ఈ వైరస్ ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తిచెందుతుంది. పొలంలో వదిలేసిన పంట అవశేషాల వలన మరియు కలుపు మొక్కల వలన ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. గోధుమ మచ్చ తెలుగు పంట అన్ని దశలలోను పంటను ఆశిస్తుంది. కానీ పిలకలు వేసే దశనుండి గింజ దశ వరకు చాల ప్రమాదకరం. ప్రధానంగా, సూక్ష్మపోషకాల పరంగా భూసారాన్ని సరిగా నిర్వహించని పొలాల్లో, ఈ వ్యాధి తరచుగా సంభవిస్తుంది.. సిలికాన్ ఎరువులను ఉపయోగించి గోధుమ మచ్చ తెగులు యొక్క గణనీయమైన నియంత్రణ సాధించబడింది. పశువుల పెంట మరియు రసాయన ఎరువుల వాడకం ఈ తెగులు తీవ్రతను ఎంతో కొంత తగ్గిస్తాయి. గాలిలో తేమ అధికంగా ఉండటం (86-100%) ఆకులపై ఎక్కువ కాలం తేమ ఉండడం మరియు అధిక ఉష్ణోగ్రతలు (16 - 36° C) ఈ ఫంగికి అనుకూలం.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన సరఫరాదారులనుండి తెగులు నిరోధక విత్తనాలను కొనండి . సమతుల్య పోషకాలు పంటకు సరఫరా చేస్తూ మట్టి పోషకాలను గమనిస్తూ వుండండి.
  • పిలకలు వస్తునప్పటి నుండి చీడ యొక్క లక్షణాలను గమనిస్తూ వుండండి.
  • సిలికాన్ తక్కువగా వున్న పొలంలో విత్తనాలు వేసేముందే కాల్షియం సిలికేట్ స్లాగ్ ను వేయండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తనాలను వాడండి.
  • సిలికాన్ తక్కువగా వుండే నేలల్లో నాటేముందు కాల్షియం సిలికేట్ స్లాగ్ ను పొలంలో వేయండి.
  • వీలైతే ధృవీకరించబడిన మూలాల నుండి మీ విత్తనాలను కొనుగోలు చేయండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను నాటండి.
  • సమతుల్య పోషకాలు వాడుతూ క్రమం తప్పకుండా మట్టిలో పోషకాలను గమనిస్తూ వుండండి.
  • పిలకల దశ నుండీ వ్యాధి సంకేతాల కోసం పర్యవేక్షిస్తూ వుండండి.
  • పొలంలో మరియు చుట్టుప్రక్కల కలుపును తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి పంట కోత తర్వాత వాటిని నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి