చెరుకు

చెరుకులో మసి బూజు తెగులు

Sporisorium scitamineum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • మొక్కలో నల్లని కొరడా లాంటి నిర్మాణం పెరుగుతుంది.
  • మొక్కల ఎదుగుదల నిలిచిపోతుంది.
  • ఆకులు సన్నగా గట్టిగా మారతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

చెరుకు మొక్క ఎదుగుతున్న ప్రదేశం నుండి నల్లని కొరడా లాంటి నిర్మాణం ఉద్భవిస్తుంది మరియు చాలా సందర్భాలలో ఇది మొక్క పైభాగానికన్నాపైకి సాగి ఉంటుంది. ఈ వృద్ధి చెందుతున్న నిర్మాణం మొక్కల కణజాలం మరియు శిలీంధ్ర కణజాల మిశ్రమం. ఫంగస్ యొక్క బీజాంశం ఈ కొరడా యొక్క కణజాలంలో నిల్వ చేయబడి ఉంటుంది. బీజాంశం విడుదలైన తరువాత దీని యొక్క కేంద్ర భాగం మాత్రమే మిగిలి ఉంటుంది. అదనంగా, మొక్క ఎదుగుదల తగ్గిపోయి ఆకులు సన్నగా గట్టిగా మారతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తెగులు సోకిన చెరుకు గడలను తొలగించి తెగులు సోకిన అన్ని మొక్కల అవశేషాలను నాశనం చేయండి. చీడపీడలు లేని విత్తన పదార్ధం కొరకు చెరుకు సెట్లను 52°C వేడి నీటిలో 30 నిమిషాలు ముంచి ఉంచాలి. లేదా సెట్లను 50°C వేడి నీటి చికిత్సలో 2 గంటలు ముంచి ఉంచవచ్చు.

రసాయన నియంత్రణ

నివారణ చర్యలతో పాటు జీవ చికిత్సలు అందుబాటులో ఉంటే ఎల్లప్పుడూ సమగ్ర సస్యరక్షణ విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. నాటడానికి ముందు బెంజిమిడాజోల్ వంటి శిలీంద్రనాశకాలతో సెట్లను శుద్ధి చేసినట్లయితే అది ఈ తెగులు సంభవించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

దీనికి కారణమేమిటి?

ఈ కొరడాలాంటి నిర్మాణం నుండి ఉత్పత్తి చెందే తెగులు యొక్క బీజాంశం గాలి ద్వారా మరియు అనేక కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. విత్తనాల కోసం తెగులు సోకిన చెరకు కాండాలను ఉపయోగించడం వీటి వ్యాప్తికి మరొక సాధనం. వెచ్చని మరియు తేమతో కూడిన పరిస్థితులు ఈ తెగులు సంక్రమణకు అనుకూలంగా ఉంటాయి. తెగులు సోకిన చెరుకు మొక్క చాలా నెలల వరకూ ఎటువంటి లక్షణాలు బహిర్గతం చేయకుండా ఎదగవచ్చు. 2 లేదా 4 నెలల తరువాత (కొన్నిసార్లు ఒక సంవత్సరం వరకు), ఎదుగుతున్న చెరుకు మొక్క భాగం ఈ “కొరడా” ను ఉత్పత్తి చేస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలు నాటండి.
  • తెగులు లేని విత్తన పదార్ధాన్ని ఉపయోగించండి.
  • పంట మార్పిడి పద్దతులను విస్తృతంగా అమలు చేయండి.
  • బ్రీడర్ విత్తన ఉత్పత్తికి హీట్ థెరపీని ఉపయోగించండి (తేమ వేడి గాలి చికిత్స - MHAT - 54°C వద్ద 150 నిమిషాలు లేదా వేడి నీటి చికిత్స 50°C వద్ద 2 గంటలు).

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి