గోధుమ

పసుపు చార తుప్పు తెగులు

Puccinia striiformis

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న పరిమాణంలో తుప్పు వంటి పొక్కులు చారలుగా అమర్చినట్టు ఉంటాయి.
  • కాండం మరియు తలలు ప్రభావితం అవుతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
బార్లీ
గోధుమ

గోధుమ

లక్షణాలు

మొక్కల రకాలను బట్టి ఈ తెగులు తీవ్రత ఉంటుంది. హాని జరగడానికి అవకాశం వున్నరకములలో ఈ తెగులు ఆకుల ఈనెలకు సమాంతరంగా సన్నని చారలు చిన్న, పసుపుపచ్చ నుండి నారింజ రంగు లో(తుప్పు) పొక్కులను తయారు చేస్తాయి. ఇవి అంతిమంగా కలిసిపోయి మొత్తం ఆకును ముంచేస్తాయి. ఈ లక్షణము ముందుగా లేత మొక్కలలో కనపడుతుంది. ఈ పొక్కులు (0.5 నుండి ఒక మిల్లీమీటర్ వ్యాసంలో వుండి) కొన్నిసార్లు కాండం మరియు మొక్కల పైభాగంలో కానీ కనపడవచ్చు. ఈ తెగులు తరువాత దశలో తుప్పుపట్టిన పొక్కులతో పొడవైన, నిర్జీవంగా, లేత గోధుమ రంగు చారలు లేదా మచ్చలు ఆకులపైన కనబడతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మొక్కల పెరుగుదల తీవ్రంగా దెబ్బతిని దానితో పాటు కణజాలం కూడా దెబ్బతింటుంది. ఆకులు అధికంగా రాలిపోవడం వలన దిగుబడి ప్రభావితం అవుతుంది. దీనివలన మొక్కకు తక్కువ కంకులు మరియు కంకులకు తక్కువ గింజలు వస్తాయి. మొత్తం మీద ఈ తెగులు తీవ్రమైన పంట నష్టాలకు దారితీస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

చాలా రకాల జీవ శిలీంద్ర నాశినులు మార్కెట్లో అందుబాటులో వున్నాయి. బాసిల్లస్ ప్యుమిలస్ ఆధారిత ఉత్పత్తులను 7 నుండి 14 రోజుల వ్యవధిలో వాడడం వలన ఈ తెగులును నివారించే అవకాశం వుంది. మరియు ఈ శిలీంద్ర నాశినిని పరిశ్రమలో మంచి పేరు వున్న కంపెనీలు తయారుచేస్తున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. స్ట్రోబిలూరిన్ కు చెందిన శీలింద్ర నాశినులు ముందుగానే ఆకులపై పిచికారీ చేయడం వలన ఈ తెగులును నివారించవచ్చు. అప్పటికే ఈ తెగులు సోకితే త్రియాజోల్ కుటుంబ ఉత్పత్తులను లేదా ఈ రెండు రకాల ఉత్పత్తుల మిశ్రమాన్ని వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు పుస్సినియా స్ట్రీఫోర్మీస్ అనే ఫంగస్ వలన సంభవిస్తాయి. ఇది ఒక పరాన్న జీవి మరియు ఇది జీవించడానికి, జీవించివున్న మొక్కల పదార్థములపైన ఆధార పడుతుంది. ఈ బీజాంశాలు గాలుల వలన కొన్ని వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించి సీజన్లో మరల తెగుళ్లను వ్యాపింపచేస్తాయి. ఈ ఫంగస్ పత్రరంధ్రముల ద్వారా మొక్కల లోనికి ప్రవేశించి క్రమంగా నివాసము ఏర్పరచుకొంటాయి. ఈ తెగులు ప్రధానంగా మొక్కలు ఎదిగే దశలో సంభవిస్తుంది. ఎక్కువ ఆర్ద్రత ( మంచు బిందువులు) వర్షం మరియు 7 నుండి 15°C మధ్య ఉండే చల్లటి వాతావరణం. ఈ బూజు తెగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు. ఉష్ణోగ్రతలు 21-23°C నిరంతరంగా వున్నప్పుడు ఈ తెగులు వ్యాపించడం ఆగిపోతుంది. ఈ ఉష్ణోగ్రతల వద్ద ఈ పసుపు చార తుప్పు తెగులు యొక్క జీవన చక్రానికి అంతరాయం కలుగుతుంది. ప్రత్యామ్న్యాయ అతిధి పంటలు గోధుమ, బార్లీ మరియు రెయ్


నివారణా చర్యలు

  • అందుబాటులో వుంటే తెగులు నిరోధక రకాలను సాగుచేయండి.
  • మొక్కలకు సరిపడినంత నత్రజనిని వాడండి.
  • నత్రజనిని అధికంగా వాడవద్దు.
  • పొలాన్ని తరుచుగా గమనిస్తూ స్వచ్చందంగా మొలకైతే మొక్కలను తొలగించండి.
  • పంట కోత తరువాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాలను బాగా లోతుగా ఊడ్చి పెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి