గోధుమ

గోధుమ ఆకు తుప్పు తెగులు

Puccinia triticina

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులు, ఆకు తొడుగులు మరియు ఊక పైన అనేక చిన్న ఎరుపు నారింజ నుండి గోధుమరంగు బుడిపెలు కనిపిస్తాయి.
  • మొక్కలలో చిన్న మొటిమలు మరియు ఒక పసుపు వలయము ప్రాధమిక బుడిపెల చుట్టూ కనిపిస్తాయి.
  • అధిక నిరోధక గోధుమ రకాలలో, నారింజ రంగు బుడిపెలు చిన్నవిగా వుండి మరియు క్లోరోటిక్ లేదా నిర్జీవ ప్రాంతాలతో నిండి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

గోధుమ

లక్షణాలు

ఆకు తుప్పు అనేది గోధుమ యొక్క అతి సాధారణ తుప్పు వ్యాధి. వ్యాధి సోకిన మొక్క యొక్క గ్రహణశీలత పైన దాని లక్షణాలు ఆధారపడి ఉన్నాయి. ఆకులు, ఆకు తొడుగులు మరియు ఊకలు యొక్క రెండు ఉపరితలాల పైన అనేక చిన్న ఎర్ర నారింజ నుండి గోధుమ స్ఫోటములు చల్లబడి వుంటాయి. అవి 1.5 మి.మీ వరకు వ్యాసము కలిగి, కొద్దిగా పైకి మరియు దీర్ఘచతురస్రాకార వృత్తంగా ఉంటాయి. ప్రాధమిక స్ఫోటముల చుట్టూ వ్యాప్తి చెందే అవకాశము వున్న మొక్కలలో, చిన్న మొటిమలు మరియు ఒక లేత ఆకుపచ్చ లేదా పసుపు వలయం కనిపిస్తుంది. కాలక్రమేణా, రంగు ముదురు గోధుమ లేదా నలుపు గా మారుతుంది. మరింత నిరోధక గోధుమ రకాలలో, నారింజ స్ఫోటములు సాధారణంగా చిన్నగా ఉంటాయి మరియు అవి క్లోరోటిక్ లేదా నిక్రోటిక్ ప్రాంతాలతో చుట్టబడి ఉంటాయి. సంక్రమణము అనేది మొక్క కణజాలమునకు నష్టం, నీటి క్షయం, మరియు తగ్గిన ఉత్పాదకతను కలిగిస్తుంది. దీని వలన పూలల్లో దిగుబడి తగ్గడము, ధాన్యం ముడుతలు పడటము, పంట దిగుబడి తగ్గడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, మాకు పుస్సినియా ట్రిటిసిన కు వ్యతిరేకంగా ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స తెలియదు. ఈ తెగులుతో పోరాడటానికి మాకు సహాయపడగల ఏదైనా విషయం మీకు తెలిస్తే దయచేసి మీరు మాకు తెలుపపగలరు. మీ నుండి సమాచారం కోసం ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రోపికొనాజోల్ లేదా ట్రియాజోల్ తో కూడిన శిలీంద్ర నాశినులు గల పురుగుల మందులను ఆకులపై పిచికారీ చేయడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు. ఈ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవడానికి డబ్బాపైన వున్న సూచనలను చదవండి. వీటిని ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి అనేది తెలుసుకుని వాటిని పాటించండి.

దీనికి కారణమేమిటి?

ఈ తుప్పు తెగులు మొక్కల పై ఆధారపడి జీవించే పరాన్న జీవి అయిన పుస్సినియా ట్రిటిసిన వలన కలుగు తుంది.దీని జీవిత చక్రం పూర్తి చేయడానికి జీవించివున్న గోధుమ మొక్కలు లేదా ప్రత్యామ్నాయ అతిధులు అవసరమవుతాయి. బీజాంశములు వాటి మూలం నుండి కొన్ని వందల కిలోమీటర్ల వరకు గాలి ద్వారా వెళ్లడం జరుగుతుంది. వీటి బీజాంశం ఇవి అధిక తేమ లేదా ఎక్కువ కాలము ఆకు తడిసి ఉండటము మరియు 10°c మరియు 30°C (16-22°C అనుకూలంగా ఉంటాయి) మధ్య ఉష్ణోగ్రతల వద్ద అంకురిస్తాయి. ఈ పరిస్థితుల్లో, ఆకుతో మొదటి సారి 30 నిమిషాలు తాకితే బీజాంశముల అంకురోత్పత్తి జరుగుతుంది. నత్రజని అధిక వాడకం కూడా ఇది వృద్ధి చెందడానికి అనుకూలమైనది. ఈ తెగులు ఆకులు లేదా ఆకు పైపొరలపై వున్న తొడుగుల యొక్క సహజ రంధ్రముల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. పొలంలో వున్న పరిస్థితులను బట్టి ఈ శిలీంధ్రాలు 7నుండి 8 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేయవచ్చు. ఈ ఫంగస్, వివిధ ధాన్యాల జాతి కుటుంబంలో ప్రత్యామ్నాయ అతిధులను కలిగి వుంటాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే స్థిరమైన మరియు తెగులు నిరోధక రకాలను పెంచండి.
  • శీతాకాల గోధుమను తరువాత మరియు వేసవి గోధుమను సీజన్ కంటే ముందుగా నాటండి.
  • స్వచ్చందంగా వచ్చే మొక్కలను తొలగించండి.
  • మొలకలు వేసినప్పుడు పొలంలో మొక్కలు తక్కువ మోతాదులో వుండేటట్టు చూడండి.
  • పొలంలో పంట మార్పిడి చేయండి.
  • తగినంత మోతాదులో నత్రజని ఎరువును వేయండి.
  • పంట కోతల తర్వాత పంట వ్యర్ధాలను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి