వేరుశనగ

వేరుశనగ తుప్పు తెగులు

Puccinia arachidis

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ముందుగా ఆకుల కింది భాగంలో తుప్పు రంగు బొడిపెలు కనిపిస్తాయి.
  • అధికంగా తెగులు సంక్రమించిన ఆకులు రెండు వైపులా తుప్పు రంగు బొడిపెలు కప్పబడుతాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకు పోతాయి.
  • ఆకులురాలిపోవడంతో అధిక మొత్తంలో దిగుబడి నష్టాలు చూడవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వేరుశనగ

లక్షణాలు

వేరుశనగ తుప్పు తెగులు బాగా చిన్న సైజులో గుండ్రపు నారింజ గోధుమ రంగు బొడిపెలు వలె ఆకుల కింది భాగంలో కనిపిస్తాయి. ఇవి ఎల్లపుడు పసుపురంగు క్లోరోసిస్ తో కవర్ చేయబడి ఉంటాయి. ఈ తెగులు ఆకుల ఎదుగుదలను అంతర్గతంగా మొక్కల ఎదుగుదలని దెబ్బతీస్తుంది. వ్యాధి పెరిగే కొద్ది అధికంగా వ్యాప్తి కి గురైన ఆకులు రెండుపక్కల తుప్పు బొడిపెలతో కప్పబడతాయి, తరువాత పసుపు రంగులోకి మారి ముడుచుకు పోతాయి. కాండం మరియు ఆకు కొమ్మల పైన, పొడవుగా ఎరుపు గోధుమ రంగు బొడిపెలు కూడా కనిపిస్తాయి. ఈ తెగులు కాయలను మరియు దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. నూనె నాణ్యత కూడా తగ్గుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

జీవ నియంత్రణ కారకాలు ఈ తెగులును నియంత్రించటంలో తోడ్పడుతాయి. సాల్వియా అఫిసినాలిస్ మరియు పోటేంటిళ్ల ఎరెక్టా వంటి మొక్కల సారం ఫంగల్ ఎదుగుదలకు విరుద్ధంగా ఆకులకు రక్షణ కవచం లాగ నిలుస్తాయి. ఫ్యాక్స్ సీడ్స్ ఆయిల్ మరియు వేరుశనగ నూనె ఈ తెగులు సోకకుండా నిరోధిస్తాయి.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు యొక్క తరువాతి దశల్లో రసాయనాల వలన ఉపయోగం ఉండకపోవచ్చు. అవసరం అనుకుంటే, మాంకోజెబ్, ప్రొపికోనజోల్ లేదా కాపర్ కలిగిన ఫంగిసైడ్స్ పిచికారీ చేయడం మంచిది. మొట్ట మొదటి సారిగా తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే వీటిని చల్లాలి మరియు 15 రోజుల తర్వాత మరలా ఉపయోగించాలి..

దీనికి కారణమేమిటి?

తుప్పు తెగులు భూమి లోని పంట వ్యర్ధాలలో లేదా ఇతర కాయధాన్యాల మొక్కలపైన జీవిస్తుంది. తెగులు మొదట ఆకుల మీద రాలిన బీజాంశాల వల్ల కలుగుతుంది. గాలి వల్ల బీజాంశాలు ( స్పోర్స్) విస్తరించి ఆ విధంగా రెండవ పద్ధతిలో తెగులు సోకుతుంది. తెగులు రెండవ దశలో మచ్చలు అతి వేగంగా విస్తరిస్తాయి. ముఖ్యంగా పరిసరాల్లో, ఉదాహరణకు వేడి ఉష్ణోగ్రతలు (21 నుండి 26 డిగ్రీలC) మరియు తడి, మేఘావృతం అయిన వాతావరణం (పొగమంచు, రాత్రివేళలో పడే నీటి బిందువులు) ఫంగస్ పెరుగుదలకు సహకరిస్తాయి. మొక్కల ఎదుగుదల కూడా తగ్గుతుంది. అధిక మొత్తంలో ఫాస్ఫరస్ ఎరువులు వాడకం తుప్పు తెగులు వ్యాపించకుండా ఆపుతుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యవంతమైన మొక్కల విత్తనాలు మాత్రమే వాడాలి.
  • తెగులు నిరోధక వంగడాలు మాత్రమే వాడాలి.
  • మొక్కల మధ్య స్థలాలను పెంచి తేమ లేకుండా చూడాలి.
  • కలుపుని నియంత్రించాలి.
  • మొక్కల మధ్య ఎడం పెంచి తేమ లేకుండా చూడాలి.
  • కలుపు మొక్కలను నియంత్రించాలి.
  • ప్రత్యామ్నాయ మొక్కలు పంట చుట్టు పక్కల లేకుండా చూసుకోవాలి.
  • అధిక మొత్తంలో ఫాస్ఫరస్ ఎరువు వాడకం తుప్పు తెగులు వ్యాపించకుండా ఆపుతుంది.
  • తెగులు సోకిన మొక్కలను మరియు చెత్తను కాల్చడం లేదా బాగా దుక్కిదున్ని నాశనం చేయాలి.
  • ప్రతి మూడు నుండి నాలుగు సంవత్సరాలకు పంట మార్పిడి చేయండి.
  • వరుస వేరుశనగ పంటల మధ్య దీర్ఘకాలికంగా భూమిని బీడుగా ఉంచటం మంచిది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి