Mycosphaerella
శీలీంధ్రం
ఆకుల రెండువైపులా గుండ్రపు మచ్చలు కనిపిస్తాయి. ఎర్లీ లీఫ్ స్పాట్ తెగులు వలన లేత గోధుమ లేదా నల్లని ముదురు మచ్చలు ఏర్పడతాయి. వీటి చుట్టూ చాలాసార్లు పసుపు రంగు కాంతి వలయాలు కనిపిస్తాయి. లేట్ లీఫ్ స్పాట్ తెగులులో ముదురు గోధుమ లేదా నల్లని మచ్చలు ఉంటాయి. తెగులు వ్యాపిస్తున్నకొద్దీ మచ్చలు మరింత ముదురుగా మారటం మరియు మరింత పెద్దగా అయ్యి (10 మిల్లీమీటర్ల వరకు) ఆకు పైభాగంలో కాండంపై మరియు వేరుశనగ కాయలపైన కూడా ఏర్పడడం మొదలవుతుంది. ఎర్లీ లీఫ్ స్పాట్స్ తెగులులో ఆకు పైన వెండి రంగులో జుట్టు లాంటి ఫంగల్ ఎదుగుదల కలిగి ఉంటాయి. వాతావరణం అనుకూలిస్తే ఆకులు రాలిపోవడం, కొమ్మలు బలహీనపడటం జరుగుతుంది. ఆకులు రాలిపోవడం వలన మొక్కలు బలహీనంగా మారి దిగుబడి తగ్గుతుంది. తెగులు సోకిన కాయలు బలాన్ని కోల్పోయి కోత సమయంలో నూర్పిడి సమయంలో విరిగిపోతాయి.
బాసిల్లస్ సర్క్యూలన్స్ మరియు సెర్రాతియా మార్చేస్కీన్స్ వంటి యాంటీఫంగల్ బాక్టీరియాను ఆకులపై పిచికారీ చేయడం వలన లేట్ లీఫ్ స్పాట్ తెగులును తగ్గించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లోరోథలోనిల్, టేబుకోనజోల్, ప్రొపికోనజోల్, అఙాక్సీ స్ట్రోబిన్, పీరాక్లోస్ట్రోబిన్, ఫ్లూక్సస్టొబిన్ లేదా బాస్కేలిడ్ వంటి శీలింద్ర నాశినులను ఆకుల పై పిచికారీ చేయడం వలన ఈ రెండింటిని అదుపులో ఉంచవచ్చు. ఉదాహరణకు లక్షణాలు మొదటసారి కనిపించడం మొదలుపెట్టినప్పుడు 3g/l మాంకోజెబ్ లేదా 3g/l క్లోరోథాల్నిల్ ను పిచికారీ చేయాలి, అవసరమైతే 15 రోజుల తరువాత మళ్ళీ ఒకసారి పిచికారీ చేయాలి.
లేట్ మరియు ఎర్లీ లీఫ్ స్పాట్ రెండు వేరు వేరు తెగుళ్లు కానీ ఒకే రకమైన లక్షణాలు మొక్క ఎదుగుతున్న వివిధ దశలలో కనిపిస్తాయి. అందువలనే వాటికి అటువంటి పేర్లు వచ్చాయి. వీటికి కారణం అయిన ఫంగై మైకోస్ఫారెల్ల అరాకిడిస్ ( ప్రారంభ ఆకు మచ్చ ) మరియు మైకోస్ఫరెల్ల బెర్కెలెయి ( లేట్ లీఫ్ స్పాట్). వేరుశనగ మొక్కలను మాత్రమే ఇవి ఆశిస్తాయి. ముందు వేసిన వేరుశనగ పంటల అవశేషాలు ఈ తెగులు సోకడానికి ముఖ్య కారణం. అధికంగా గాలి లో తేమ, భారి వర్షాలు మరియు అధిక ఉష్ణోగ్రతలు (20 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ) ఎక్కువ సమయం ఈ వ్యాధి పెరగటానికి కారణాలు. లేట్ మరియు ఎర్లీ లీఫ్ స్పాట్ వేరుశనగ పంటలో ప్రపంచ వ్యాప్తంగా అతి ముఖ్యమైన తెగులు. ఇది ఒకటిగా కానీ రెండు కలసి కానీ అధిక మొత్తంలో దిగుబడి నష్టాలను కలిగిస్తుంది.