చిరుధాన్యాలు

సజ్జల్లో బూజు తెగులు

Moesziomyces bullatus

శీలీంధ్రం

క్లుప్తంగా

  • గింజలు ఆకుపచ్చ సోరి (ఫంగల్ బీజాంశం గుళికలు) అవుతాయి.
  • తరువాత శిలీంధ్రాలు నల్లగా మారతాయి.

లో కూడా చూడవచ్చు


చిరుధాన్యాలు

లక్షణాలు

సజ్జలు ఆకుపచ్చ సోరిగా మారుతాయి. ఇవి ధాన్యాల కన్నా పెద్దవి మరియు ఓవల్ / శంఖాకార గుళికలుగా కనిపిస్తాయి. వ్యాధి పెరిగేకొద్దీ, ఈ సోరి నల్లగా మారుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, మోయెస్జియోమైసెస్ బుల్లటస్‌కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడేది ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాము

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఆర్థికపరమైన కోణం నుండి చూస్తే, రసాయన చికిత్స ఆచరణీయమైనది కాదు.

దీనికి కారణమేమిటి?

మోయెస్జియోమైసెస్ బుల్లటస్ అనే వ్యాధికారక సూక్ష్మ జీవి వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఈ వ్యాధి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధికారక సూక్ష్మ జీవులు విస్తృత ఉష్ణోగ్రతలలో (5°C - 40°C) పెరుగుతాయి. దీని గరిష్ట పెరుగుదల 30°C వద్ద ఉంటుంది. శిలీంధ్ర బీజాంశం నేలలో, విత్తనంలో జీవించగలదు. ఇవి గాలి ద్వారా వ్యాపిస్తాయి.


నివారణా చర్యలు

  • WC-C75, ICMS 7703, ICTP 8203, మరియు ICMV 155 వంటి నిరోధక రకాలను వాడండి.
  • ఆరోగ్యకరమైన విత్తనాలను వాడండి.
  • అధిక నత్రజని వాడకానికి దూరంగా ఉండాలి.
  • బూజు తెగులును తెలుపు పాలిథిన్ మరియు గడ్డి రక్షక కవచాలతో నేల సోలరైజేషన్ ద్వారా తగ్గించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి