Glomerella tucumanensis
శీలీంధ్రం
తెగులు సోకిన కొమ్మలు పాలిపోయిన రంగులో ఉంటాయి మరియు రకాన్ని బట్టి వీటిపై ఎక్కువ లేదా తక్కువ పెద్ద ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కాడను నిట్టనిలువుగా కోసినట్లయితే, తెల్లగా వుండే కాడ లోపలిభాగంలో పొడవుగా వున్న ఎర్రని కుళ్లిపోయిన కణజాలం కనిపిస్తుంది. ఈ తెగులుకు నిరోధకత కలిగిన మొక్కలలో సహజంగా ఇవి కణుపుల మధ్య భాగానికే పరిమితమై ఉంటాయి. లోపలి మెత్తని భాగంలో పగుళ్లు ఏర్పడవచ్చు మరియు అక్కడ గట్టిపడిన ఫైబర్స్ యొక్క కట్టలు కనపడతాయి. ఆకులు వాలిపోయి ముడుచుకుపోతాయి. మొక్కల నుండి ఒకవిధమైన దుర్వాసన రావడం మరియు ప్రతికూల వాతావరణంలో మొక్కలు చాలా సులభంగా విరిగి పోవడం జరుగుతుంది. ఆకుల ప్రధాన ఈనే పై చిన్న ఎర్రని కోలాకారపు లేదా పొడవాటి గాయాలు వృద్ధి చెందుతాయి. కొని సార్లు ఈనే మొత్తం పొడవంతా ఇవి వ్యాపిస్తాయి. కాడల పైతొడుగు మీద ఎర్రటి ప్యాచీలు మరియు అప్పుడప్పుడు మాత్రమే ఈనెల మధ్యన చిన్న పరిమాణంలో ముదురు మచ్చలు ఏర్పడవచ్చు.
50°C ఉష్ణోగ్రతల వద్ద నీటిలో విత్తనాలను 2 గంటలు నానబెట్టినట్లైతే ఈ ఫంగస్ చనిపోతుంది. చావోటోమియం, స్యుడోమోనాస్ బ్యాక్తీరియా మరియు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రణ ఏజంట్లను కూడా ఉపయోగించవచ్చు. ఈ పదార్ధాలు కలిగిన ఉత్పత్తులను ఆకులపై పిచికారీ చేయడం వలన ఈ తెగులు విస్తరించకుండా నివారించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. 50-54°C ఉష్ణోగ్రతల వద్ద శీలింద్ర నాశినులు( ఉదాహరణకు తీరం) కలిపిన నీటిలో విత్తనాలను 2 గంటలు నానబెట్టినట్లైతే ఈ ఫంగస్ చనిపోతుంది. పొలంలో నేరుగా ఉపయోగించే రసాయన చికిత్స వల్ల ఫలితం ఉండదు.
గ్లోమెరేళ్ళ టుకుమనేన్సిస్ అనే ఫంగస్ వలన ఈ తెగులు సోకుతుంది. ఇది కొన్ని నెలల వరకు మాత్రమే మట్టిలో జీవించి ఉంటుంది. ఇది మట్టి ద్వారా వ్యాపించే తెగులు కాకపోయినా వీటి బీజాలు పంట అవశేషాల నుండి మట్టిపైకి చేరి అప్పుడే నాటిన విత్తనాలకు మరియు మొలకలకు సంక్రమిస్తాయి. తరువాత ఈ తెగులు భీజాలు( స్పోర్స్)గాలి, వాన, అధిక మొత్తంలో పొగమంచు మరియు నీటి ద్వారా మొక్కలో ఆకు ఈనెల వద్దకు లేదా కాడలపైకి చేరుతుంది. చల్లని వాతావరణం, నేలలో అధిక తేమ మరియు ఒకే రకమైన పంటలను పొలంలో పదే పదే వేయడం వలన ఈ తెగులు అధికంగా సంక్రమిస్తుంది. కరువు పరిస్థితులు ఈ తెగులు తీవ్రతరమయ్యేటట్టు చేస్తాయి. తెగులు సోకిన మొక్కల వల్ల మరియు కోత అవశేషాల వల్ల కూడా మొక్క నుండి మొక్కకు వ్యాపిస్తాయి. ఒక వేళ ఈ ఫంగస్ మట్టిలో కలిస్తే నాటిన విత్తనాలకు కూడా వ్యాపిస్తుంది. చెరుకు పంటతో పాటు ఈ తెగులు మొక్క జొన్న మరియు జొన్న పంటలను కూడా ఆశిస్తుంది.