టమాటో

టమోటా ఆకు మాడు తెగులు

Phytophthora infestans

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల అంచుల నుండి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకుల క్రింది భాగంలో తెల్లని పూత ఏర్పడుతుంది.
  • పండ్లపైన బూడిద లేదా గోధుమ రంగు ముడతలు కలిగిన మరకలు ఏర్పడతాయి.
  • పండ్ల పైన తొక్క గట్టిపడి పండ్లు కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

గోధుమ- ఆకుపచ్చ మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. తరువాత ఆకులు మొత్తం గోధుమ రంగులోకి మారుతాయి. తడి వాతావరణంలో ఆకుల కింద మచ్చలపై బూడిద నుండి తెలుపు రంగు బూజు లాంటి ఎదుగుదల కనిపిస్తుంది. దీనివలన ఆరోగ్యంగా వున్న కణజాలం మరియు నశించిన కణజాలానికి కు తేడా తెలుసుకోవచ్చు. చిగుర్లు గోధుమ వర్ణంలోకి మారి మెలికెలు తిరిగి ఎండిపోతాయి. కొన్ని సందర్భాలలో గోధుమ మచ్చలు మరియు తెలుపు రంగు తొడుగు కాండాలపై, కొమ్మలపై మరియు ఆకు కాడలపై కనిపిస్తాయి. బూడిద-ఆకుపచ్చ నుండి గోధుమ రంగు ముడతల మరకలు పండ్లపై కనిపిస్తాయి. ఈ ప్రదేశాలలో పండ్ల పైన తొక్క గట్టిపడుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ప్రస్తుతం ఈ తెగులు నివారణకు జీవ సంబంధ నియంత్రణ మార్గాలు ఏమి లేవు. తెగులు వ్యాపించకుండా ఉండడానికి తెగులు సోకిన భాగాన్ని తొలగించి నాశనం చేయండి. తెగులు సోకిన మొక్కను కంపోస్టుగా ఉపయోగించకండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ లేట్ బ్లెయిట్ తెగులును అదుపుచేయడానికి ప్రోపమైడ్, క్లోరోతలోనిల్, ఫ్లువాజినం, మాంకోజెబ్ ఆధారిత శీలింద్ర నాశినులను పిచికారీ చేయవచ్చు. సాధారణంగా వర్షం పడే సూచన వున్న సమయంలోను లేదా ఓవర్ హెడ్ నీటి పారుదల వున్న పొలంలో మాత్రమే ఈ శీలింద్ర నాశినులను వాడవలసిన అవసరం ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

వేసవికాలం మధ్యలో ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫంగస్, మొక్కల గాయాల ద్వారా ఈ ఫంగస్ మొక్కలోకి ప్రవేశించి పైన వున్న తోలును చించేస్తోంది. ఉష్ణోగ్రతలు మరియు తేమ వాతావరణం ఈ తెగులు ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా తేమ (90 శాతం) వున్నప్పుడు మరియు 18 నుండి 26°C ఉష్ణోగ్రత వద్ద ఈ లేట్ బ్లెయిట్ తెగులు బాగా విస్తరిస్తుంది. వెచ్చటి వాతావరణం మరియు వేసవికాలం పొడి వాతావరణంలో ఈ తెగులు విస్తరణ ఆగిపోతుంది.


నివారణా చర్యలు

  • విశ్వసించదగిన డీలర్ల నుండి ఆరోగ్యకరమైన విత్తనాలను కొనండి.
  • తెగులు నిరోధక వంగడాలు ఉపయోగించండి.
  • టమోటా మరియు బంగాళాదుంప పంటలు పక్క పక్కన పండించకూడదు మంచి డ్రైనేజ్ సౌకర్యం కల్పించి మొక్కలను ఎల్లప్పుడూ పొడిగా ఉంచండి.
  • టార్పాలిన్ మరియు చెక్కలతో పారదర్శకపు వర్షపు షెల్టర్ నిర్మించండి.
  • మొక్కలు బలంగా ఎదగడానికి మొక్కల బలవర్ధకాలను వాడండి.
  • రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇతర పంటలతో పంట మార్పిడి చేయండి.
  • ముఖ్యంగా మొలకల దశలో సిలికేట్ కలిగిన ఎరువులు ఫంగస్ కు వ్యతిరేకంగా బాగా పని చేస్తాయి.
  • సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరు పెట్టకండి.
  • భూమి పైభాగంలో పడేటట్టు నీరు పెట్టండి.
  • పొలంలో వినియోగించిన పరికరాలను శుద్ధి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి