లెట్టూస్

దిగువ కుళ్ళు తెగులు

Thanatephorus cucumeris

శీలీంధ్రం

క్లుప్తంగా

  • బైట వున్న ఆకులు వాడిపోతాయి.
  • ఎర్రటి-గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఒక ద్రవాన్ని స్రవిస్తూ ఈ మచ్చలపై తెల్లని శిలీంధ్ర కణజాలం పెరుగుతుంది.
  • లెట్టూస్ తల మరియు దాని కింద వున్న మట్టిలో దాల్చిన చెక్క గోధుమరంగులో ముద్ద వంటి నిర్మాణాలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

18 పంటలు
బార్లీ
క్యాబేజీ
కనోల
క్యారెట్
మరిన్ని

లెట్టూస్

లక్షణాలు

ప్రారంభంలో బయటి ఆకులు వాలిపోయి నొక్కుకుపోయినట్టు కనపడతాయి. ఆకు కాడలపైన, మట్టిని తాకిన ఆకు ఈనెలపైన వివిధ పరిమాణాలలో ఎర్రటి గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు బాగా చిన్నవిగా ఉంటాయి లేదా మొత్తం ఆకు కాడ/ఈనె ప్రాంతాన్ని కవర్ చేస్తాయి. లేత గోధుమరంగు ద్రవాన్ని వెదజల్లుతున్న ఈ మచ్చల్లో తెలుపు నుండి గోధుమ రంగు ఫంగల్ కణజాలం పెరుగుతుంది. ఆకు మచ్చలు కొన్నిసార్లు ఎండిపోయి చాక్లెట్ గోధుమరంగులోకి మారతాయి. వెచ్చని, తడి పరిస్థితులలో, ఫంగస్ ఆకు ఈనెల మధ్యభాగంలోకి పెరిగి వాటిని నాశనం చేస్తుంది. సన్నటి, సక్రమంగా లేని ఆకారంలో ఉన్న దాల్చిన చెక్క గోధుమరంగు ముద్దల్లాంటి నిర్మాణాలు పై భాగాన మరియు దాని కింద ఉన్న మట్టి పైన చూడవచ్చు. మొక్కలను కత్తిరించినప్పుడు పైన అడుగున గాయాలు కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కుళ్ళిన ఆకులు మరియు మొక్కల అవశేషాలను ఖననం చేయడం లేదా కాల్చడం ద్వారా నాశనం చేయాలి. విత్తనాలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వీటిని 50°C ఉష్ణోగ్రత వద్ద నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మొక్కలు మరియు మడులకు ఐప్రోడియోన్ లేదా బోస్కాలిడ్ యొక్క నివారణ అప్లికేషన్ అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అజోక్సిస్ట్రోబిన్ కలిగిన ఉత్పత్తులను కూడా వాడవచ్చు కాని లెట్టూస్ దిగువ కుళ్ళు తెగులుకు తరచుగా రసాయన చికిత్స ప్రభావవంతంగా ఉండదు.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధికారకం లెట్టూస్ ను విస్తృత ఉష్ణోగ్రతలలో సంక్రమింప చేస్తుంది కాని వెచ్చని (25°C - 27°C) తేమ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. రైజోక్టోనియా సోలాని అనేది మట్టిలో జీవించే ఒక వ్యాధి కారక జీవి. ఇది బంగాళాదుంప, ఉల్లి, పచ్చ బీన్, మొక్కజొన్న, ముల్లంగి మరియు అనేక రకాల కలుపు మొక్కలతో సహా అనేక మొక్క జాతులకు సంక్రమిస్తుంది. లెట్టూస్ పంట పంటకూ మధ్యన మట్టి మరియు పంట అవశేషాల్లో లేదా ప్రత్యామ్నాయ అతిధి మొక్కల్లో ఈ వ్యాధికారక సూక్షజీవి మనుగడ సాగిస్తుంది. ఇది గాలి లేదా నీరు ద్వారా వ్యాప్తి చెందబడే బీజాంశాల ద్వారా పొలంలో ప్రవేశపెట్టబడవచ్చు. జీవించి వున్న అతిధి మొక్కలు లేనప్పుడు నేలలోని సేంద్రియ పదార్థాలను వీటి ఆవాసంగా చేసుకోగల సామర్థ్యం ఉన్నందున నేలల్లో ఈ ఫంగస్ దాదాపుగా నిరవధికంగా మనుగడ సాగిస్తుంది.


నివారణా చర్యలు

  • అతిగా నీరు పెట్టకండి.
  • ఉదయం సమయాల్లో నీరు పెట్టండి.
  • ఆకులపై నీరును పిచికారీ చేయవద్దు.
  • నత్రజనిని అధికంగా వాడకండి.
  • మొక్కల మధ్య తగినంత స్థలాన్ని వదలండి.
  • లోతుగా దున్నడం ద్వారా మొక్కల అవశేషాలను నాశనం చేయండి.
  • అతిధులు కాని మొక్కలతో మూడు సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ పంట మార్పిడి ప్రాక్టీస్ చేయండి.
  • లెట్టూస్ పంటల మధ్య ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించడానికి కలుపు మొక్కలను నియంత్రించండి.
  • ఎతైన మడుల్లో లెట్టూస్ ను పెంచండి.
  • ఇది గాలి కదలికను ప్రోత్సహిస్తుంది.
  • సరైన మురుగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి అలాగే మట్టికి ఆకులు అంటుకోకుండా చూడండి.
  • (కొన్ని లెట్టూస్ రకాలు నిటారుగా ఉండే ఆకులను కలిగి ఉంటాయి).
  • పంట కోత సమయంలో నీరు పెట్టకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి