బంగాళదుంప

వెండి పొలుసు తెగులు

Helminthosporium solani

శీలీంధ్రం

క్లుప్తంగా

  • వెండి రంగు మచ్చలు గోధుమ రంగు అంచులతో దుంపలపై కనిపిస్తాయి.
  • శుభ్రంచేయని బంగాళాదుంపల పై ఈ లక్షణాలు అంత సులభంగా కనబడవు.
  • అనేక రకాల పైతొక్కలు ఉండడం వలన బంగాళాదుంపల మచ్చలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి.ఇతర తెగుళ్లతో కలసి వేరే రకాల తెగుళ్లు కూడా ఏర్పడవచ్చు.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు కోత సమయంలోనే ఉంటాయి కానీ నిల్వ ఉన్న సమయంలో ఇవి బయటపడతాయి. నిల్వ సమయం లో బంగాళాదుంపలు వెండి మచ్చలు గోధుమ రంగు అంచుల తో కలిగి ఉంటాయి. తరువాత మచ్చలు ఒక గుంపుగా మారి గోధుమ రంగు లోకి మరి దుంపలను కడగకపోతే కనపడే వీలు ఉండదు. అనేక రకాల పైతొక్కలు ఉండడం వలన బంగాళాదుంపల మచ్చలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి.ఇతర తెగుళ్లతో కలసి వేరే రకాల తెగుళ్లు కూడా ఏర్పడవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సహజ జీవనాశినులు ( హైడ్రోజెన్ పెరాక్సైడ్) లేదా జీవ ఉత్పత్తులు (బాసిల్లస్ సబ్టిలిన్, క్లోవ్ నూనె )వాడకం పెద్దగా ప్రభావం చూపించదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలు వేసేముంది మరియు పంట కొత్త సమయంలో దుంపలపై సీలింద్ర నాశినులు వాడడం వలన ఈ తెగులు సోకకుండా నిరోధించవచ్చు. దుంపలపైన థియబెండజోల్ ను డస్ట్ లాగ వాడితే పంట నిలువవుంచిన సమయంలోకాని తరువాత పాంట్ వేసే సమయంలోకాని ఈ సిల్వర్ స్కాఫ్ తెగులు పంటకు సోకకుండా చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

వెండి పొలుసు తెగులు విత్తనాల పై ఉండే హెల్మీన్తోస్పోరియం అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది దుంపల పై అధిక కాలం పాటు జీవిస్తుంది మరియు తోలుపై వ్యాపిస్తుంది.ఈ తెగులు భూమి నుండి మరియు తెగులు సోకిన విత్తన దుంపల వల్ల సోకుతుంది. ఉష్ణోగ్రతలు 3°C వరకు మరియు తేమ 90% కి తక్కువ నిల్వ సమయంలో దుంపలపైన ఈ తెగులు పెరగకుండా చేస్తాయి. బంగాళాదుంపలు తినగలిగే స్థితిలోవున్నా వీటి మార్కెట్ విలువ మాత్రం తగ్గిపోతుంది. దుంపలను నిల్వవుంచినప్పుడు వాటిపైన జరిగిన కండెన్సషన్ ( వేడి గాలి చల్లని దుంపలను తాకుతుంది) వలన కూడా ఈ తెగులు తీవ్రత పెరుగుతుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల విత్తనాలు మాత్రమే వాడాలి.
  • సహనాత్మక బంగాళాదుంప రకాలను వాడటం మంచిది.
  • పంట మార్పిడి చేయాలి.
  • దుంపలను త్వరగా తీయాలి.
  • పరికరాలను శుద్ధి చేయాలి.
  • బంగాళాదుంపల్ని చల్లటి మరియు పొడి వాతావరణాలలో మంచి గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి.
  • కోత అనంతరం మంచి పారిశుధ్య మరియు ఏరివేత ప్రక్రియలు పాటించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి