Phytophthora infestans
శీలీంధ్రం
ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకుల కోణాలపై కనిపిస్తాయి. తేమ కలిగిన వాతావరణంలో ఇవి నీట తడిసిన మచ్చలుగా మారుతాయి. ఆకుల కింద ఒక తెల్లటి ఫంగస్ ని చూడవచ్చు. వ్యాధి పెరిగేకొద్దీ ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండిపోయి చనిపోతాయి. ఇలాంటి మచ్చలు కాండం మరియు కాడలపై కూడ చూడవచ్చు. బంగాళాదుంపల పై బూడిద నీలపు మచ్చలు కలిగి వాటి తొక్క గోధుమ రంగులోకి మారుతుంది. వీటి వల్ల పొలంలో ఒక రకమైన వాసన కూడా గమనించవచ్చు
కాపర్ కలిగిన శీలింద్ర నాశినులను పొడి వాతావరణానికి ముందు వాడాలి. సేంద్రీయ పూత ఏజంటును ఆకులపైన పిచికారీ చేసి ఈ తెగులు సంక్రమించకుండా చేయవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తేమ ఎక్కువగా వున్న ప్రాంతాలలో లేట్ బ్లెయిట్ తెగులును నియంత్రించటానికి క్రిమి నాశినులు వాడటం చాలా అవసరం. తెగులు నిరోధానికి మండిప్రోపమిడ్, క్లోరోఠాలోనిల్, ఫ్లూఅజినామ్ లేదా మాంకోజెబ్ కలిగినటువంటి శీలింద్ర నాశినులు వాడవచ్చు. మాంకోజెబ్ తో విత్తన శుద్ధి చేస్తే ఇది తెగులు సోకకుండా కాపాడుతుంది.
ఇది ఒక ఆబ్లిగేట్ పారసైట్. ఇది పంట అవశేషాలు మరియు దుంపలపై మరియు ఇతర వాటిపై పరాన్నజీవిలాగ జీవిస్తుంది. మొక్కలకు అయిన గాయాల ద్వారా ఇవి లోపలకు ప్రవేశించి దుంప పైతొక్కను నాశనం చేస్తాయి. వసంతఋతువులో అధిక ఉష్ణోగ్రతల్లో దీని ఫంగల్ స్పోర్ మొలకెత్తి గాలి ద్వారా కాని నీటిద్వారా కానీ విస్తరిస్తాయి. చల్లటి రాత్రులు (18°సి కన్నా తక్కువ), వెచ్చటి ఉదయం వేళల్లో మరియు వర్షం మరియు పొగమంచు ఎక్కువ వున్నప్పడు ఈ తెగులు తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో లేట్ బ్రైట్ అంటువ్యాధి ప్రభిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.