దోసకాయ

దోసకాయ పొక్కు తెగులు

Cladosporium cucumerinum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చిన్న, నీటిలో నానినట్టు వున్న లేదా ఆకుల పైన పాలిపోయిన ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి, తరువాత పొడిగా మారి ఆకు పైన రంధ్రాలు ఏర్పడుతాయి.
  • పండ్ల మీద చిన్నబూడిద మచ్చలు ఏర్పడి, జిగురు కారుతున్న మచ్చలు, తరువాత గుంటలు పడ్డ పుండ్లు లాగ మారతాయి.
  • రెండవ సారి తెగులు సంక్రమించడం వలన పండ్లు కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

దోసకాయ

లక్షణాలు

ఆకు లక్షణాలు చాలా చిన్నగా, ఆకుల మీద నీటిలో నానినట్లుండే లేదా పాలిపోయిన అనేక ఆకుపచ్చ మచ్చలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు క్రమంగా పొడిగా అయి బూడిద రంగులోకి మారి కోణాకారంలోకి మారి చనిపోతాయి. తరచుగా, ఈ మచ్చల చుట్టూ పచ్చని వలయాలు ఉంటాయి. ఈ మచ్చల మధ్యన చిరిగిపోయి ఆకులలో రంధ్రాలు ఏర్పడతాయి. ఈ తెగులు సోకిన పండ్లలో అత్యంత తీవ్రమైన లక్షణాలు వృద్ధిచెందుతాయి. ఇవి కీటకాలు కన్నాలు పెట్టినట్టు ఉంటాయి. చిన్న (సుమారు 3 మి.మీ), బూడిదరంగు, కొద్దిగా నొక్కినట్లుండే, జిగురు కారుతున్న మచ్చలు మొదట కనిపిస్తాయి. తరువాత, ఈ మచ్చలు విస్తరించి చివరికి కిందకు నొక్కుకుపోయి పుండ్లులాగా మారతాయి. మృదువుగా కుళ్ళే బ్యాక్టీరియా వంటి అవకాశవాద తెగుళ్ల వలన పండ్లు తరచుగా దాడికి గురవుతాయి. ఇది ఒక మెత్తటి కుళ్ళు వాసన వచ్చే క్షయాన్ని ఉత్పత్తి చేస్తుంది. అధిక తెగులు నిరోధక పండ్లు, ముఖ్యంగా కొన్నిరకాల గుమ్మడికాయలు, క్రమరహిత, గుండ్రంగా ఏర్పడిన పిడిలాంటి ఆకృతులు అభివృద్ధి చెందవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

దోసకాయ పొక్కుకు జీవ చికిత్స సాధ్యం కాదు. వ్యాధికారక సూక్ష్మజీవుల వ్యాప్తిని తగ్గించడానికి ధృవీకరించిన సేంద్రీయ కాపర్-అమోనియం కాంప్లెక్స్ ఆధారిత శీలింద్ర నాశినులను ఉపయోగించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లోరోథొలొనీల్ కలిగి ఉన్న శిలీంద్ర నాశినిలు లేదా కాపర్-అమ్మోనియం కాంప్లెక్స్ ఆధారిత ఉత్పతులను ఉపయోగించండి. ఈ తెగులు కారకాన్ని తొలగించడానికి 0.5% సోడియం హైపోక్లోరైట్ లో విత్తనాలను 10 నిమిషాల పాటు ఉంచండి. డైథియోకార్బమేట్స్, మనెబ్, మాంకోజేబ్, మేటిరం, క్లోరోతలోనీల్ మరియు అనిలాజైన్ కలిగి ఉన్న శిలీంధ్ర నాశినులు కూడా సి. కుకుమెరినమ్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు ఫంగస్ క్లాడోస్పోరియం కుకుమెరినియం వలన సంభవిస్తాయి, ఇది మొక్కల అవశేషాలపై, మట్టిలో పగుళ్ళు లేదా తెగుళ్ళ సోకిన విత్తనాలపై జీవిస్తుంది. వసంత కాలం ముందు ఈ సంక్రమణం ఈ రెండు వనరుల నుండి వస్తుంది. ఫంగస్ బీజాలను వృద్ధి చేసే భాగాలను అభివృద్ధి చేసి తరువాత ఏ స్పార్స్చే ను విడుదల చేస్తుంది. ఈ స్పోర్స్ కీటకాలు, వస్త్రాలు లేదా పనిముట్ల ద్వారా వ్యాప్తి చెందుతాయి, లేదా తడి గాలి ద్వారా దూర ప్రదేశాలకు రవాణా అవుతాయి. అధిక గాలి తేమ మరియు సాధారణ ఉష్ణోగ్రతలు ఈ తెగులు సోకే ఉధృతిని పెంచుతాయి. 17 మరియు 12-25°C మధ్య ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణం, తరచూ పొగమంచు, దెబ్బలు లేదా తేలికపాటి వర్షం వంటివి ఈ ఫంగస్ వృద్ధి చెందడానికి అనుకూలముగా వుంటాయి. మొక్కల కణజాలంలో ఫంగస్ చేరిన 3 నుండి 5 రోజుల తర్వాత ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల నుండి సేకరించిన విత్తనాలను కానీ లేదా సర్టిఫైడ్ దుకాణాల నుండి కానీ విత్తనాలను కొనండి.
  • అందుబాటులో వుంటే రోగ నిరోధక రకాలను నాటండి.
  • నీటి పారుదల బాగా వుండే పొలాలను మొక్కలు నాటుటకు ఎంచుకోండి.
  • వసంత ఋతువు, వేసవికాలం మరియు శరదృతువు ప్రారంభమయ్యే సమయంలో దోస జాతి మొక్కలను వేయండి.
  • ఎందుకంటే వెచ్చని వాతావరణంలో ఈ తెగులు మొక్కలకు సంక్రమించదు.
  • మొక్కజొన్న వంటి పంటలతో పంట మార్పిడి, (2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు) సిఫార్సు చేయబడింది.
  • కలుపు మొక్కలు మరియు స్వచ్ఛందంగా పెరిగే కుకుర్బిట్ మొక్కలను నియంత్రించండి.
  • వర్షం లేదా మంచుతో తడిగా ఉన్నప్పుడు లేదా మంచు బిందువులు వున్నప్పుడు పొలంలో పని చేయవద్దు.
  • తేమను తగ్గించడానికి మొక్కల మధ్య తగినంత స్థలం వుండేటట్టు నాటండి.
  • ఎక్కువ నీరు పెట్టకండి మరియు స్ప్రింక్లర్ వ్యవస్థను వాడవద్దు.
  • ఈ తెగులు లక్షణాల కొరకు క్రమం తప్పకుండా పంటలను గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను మరియు మొక్క వ్యర్థాలను తొలగించి నాశనం చేయండి.
  • (కాల్చండి లేదా పూడ్చండి).
  • కుకుర్బిట్ ను పెంచే మరియు కోతకు వాడే కుండీలు మరియు పువ్వుల బాక్సులతో పాటు ఇతర పనిముట్లను శుద్ధి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి