మొక్కజొన్న

మొక్కజొన్న స్మట్

Ustilago maydis

శీలీంధ్రం

క్లుప్తంగా

  • మొలకల దశలో వున్న మొక్క మందగించిన పెరుగుదలను ప్రదర్శించి, పుష్పాలు లేదా కంకులను ఉత్పత్తి చేయదు.
  • ముదురు మొక్కలలో, ఈ తెగులు కంకుల మీద పూర్తి నల్లటి మసిని కలిగి వుండే గాల్స్ కు దారితీస్తుంది.
  • అవి చీలినప్పుడు, నల్లటి పొడి లాంటి పదార్థం బయటికి వస్తుంది.
  • ఆకుల మీద, కణుపుల పెరుగుదల సాధారణంగా చిన్నగా వుండి, చీలకుండా కొన్నాళ్ళకు ఎండిపోతుంది.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

బాగా ఎదిగే ప్రతి మొక్క భాగం పై ఫంగస్ వ్యాపించగలదు. వాటి యొక్క గాయాల బారిన పడే అవకాశం వలన మరియు బాగా ఎదిగే అవకాశం కారణంగా అవి ఎక్కువ లక్షణాలను ప్రదర్శించే అవకాశం వుంటుంది. విత్తనాలు వేసే దశలో మొక్కలు ఎదుగుదల తగ్గి మరియు పొత్తులు తక్కువగా కలిగి ఉంటాయి. తెగులు వలన ఎదిగిన మొక్కల పై కణతులు, ఫంగల్ టిష్యూస్, స్మట్ గాల్స్ ఏర్పడతాయి. మొదటి దశలో స్మట్ గాల్స్ పచ్చని తెలుపు రంగులో ఉంటాయి.అవి ఎదిగేకొద్దీ నల్ల రంగులోకి మారతాయి. ఇవి ఎక్కువగా పొత్తులపైన ఏర్పడతాయి. ఇవి చిట్లినప్పుడు నల్లని బూడిద వంటి పదార్థాన్ని వెదజల్లుతాయి. ఇవి ఆకుల పై చిన్నగా ఉండి చిట్లకుండా ఎండిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఫంగస్ ను ప్రత్యక్షముగా నియంత్రించడం కష్టం. ఈ తెగులుకు ఇంత వరకు ఎటువంటి నివారణ ప్రక్రియ లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలు మరియు ఆకుల పైన శీలింద్ర నాశినులను చల్లినా ఎటువంటి ప్రయోజన ఉండదు. అవి మొక్కజొన్న లో స్మట్ తెగులును తగ్గించలేదు.

దీనికి కారణమేమిటి?

ఉస్టిలగో మేడిస్ అనే ఫంగస్ వలన మొక్కజొన్నలో కామన్ స్మట్ అనే తెగులు వస్తుంది. ఇది మట్టిలో సంవత్సరాల తరబడి జీవించివుంటుంది. వీటి బీజాంశాలు గాలి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. ఇక ఏ ఇతర పద్ధతులలోనూ ఇవి వ్యాపించవు. బాగా ఎదిగే అవకాశం వున్న వాటిలో( మొక్కజొన్న పొత్తులు మరియు ఎదిగే ఆకు చివర్లు) ఈ తెగులు లక్షణాలు బాగా అధికంగా కనపడతాయి.వాతావరణంలో తీవ్రమైన మార్పుల వలన, పుప్పొడి ఉత్పత్తి తక్కువగా వున్నప్పుడు మరియు ఫలదీకరణ తక్కువగా జరుగుతున్నప్పుడు( అధిక వర్షపాతం తర్వాత కరువు పరిస్థితులలో) ఈ ఫంగస్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో వుంటే తెగులు నిరోధక విత్తనాలు వాడాలి.
  • మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండేలా చూడండి.
  • బాగా పరిశీలిస్తూ, ముదురు ఫంగల్ పుప్పొడి విడుదల కాకముందే ఈ గాల్స్ ను తొలగించండి.
  • పురుగులు మరియు మిగతా తెగుళ్ళ వల్ల నష్టం కలగకుండా చూడాలి.
  • సాగుచేసేటప్పుడు మొక్కలకు నష్టం కలగకుండా చూడండి.
  • పరికరాలను శుద్ధి చేయడం మర్చిపోవద్దు.
  • నత్రజనిఎరువుల వాడకం తగ్గించండి.
  • కోత అనంతరం పంట అవశేషాలను తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కను కంపోస్ట్ చేయడానికి ఉపయోగించవద్దు.
  • అతిథేయి కాని పంటలతో దీర్ఘకాలిక పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి