కందులు

ఫుసారియం విల్ట్

Fusarium oxysporum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • మొక్కలు వాడిపోతాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారతాయి.
  • కాండం లోపల గోధుమ రంగు లేదా ఎరుపు మరకలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

24 పంటలు
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
కనోల
మరిన్ని

కందులు

లక్షణాలు

మొక్కల రకాలను బట్టి ఈ ఫంగై లక్షణాలు కనబరుస్తుంది. మొక్కల ప్రారంభ దశలోనే కొన్ని మొక్కలలో ఆకులు పసుపు రంగులోకి మారడం, వాలిపోవడం కనిపిస్తుంది. పెద్ద మొక్కల కొన్ని భాగాలు కొద్దిగా వాలిపోవడం కనిపిస్తుంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు వున్నప్పుడు ఈ లక్షణాలు అధికంగా కనపడతాయి. తరవాత ఆకులు ఒక్క పక్క మాత్రమే ఇలా పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది. కాండం పొడవైన భాగాలలో అంతర్గత కణజాలం గోధుమ-ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది ముందు మొదళ్ళలో కనిపిస్తుంది, ఆ తరువాత కాండం వరకు వ్యాపిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఫుసారియం విల్ట్స్ ను నియంత్రించడానికి కొన్ని పంటలలో బ్యాక్టీరియ మరియు ఎఫ్. ఒక్సిస్పోరం జీవ నియంత్రణ ఏజెంట్లు వాడటం జరిగింది . ట్రైకోడెర్మా విరిడి తో విత్తన శుద్ధి (10 గ్రాములు/కేజీ) కూడా ఉపయోగించవచ్చు. నైట్రేట్ ను నత్రజని వనరుగా వాడటానికి బదులు మట్టిలో పి హెచ్ ని 6.5-7.0 మధ్య నియంత్రిస్తే ఈ తెగులు తీవ్రతను తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇతర పద్ధతులు పనిచేయనట్లయితే మట్టి ఆధారిత శీలింద్ర నాశినులను వాడండి. పొలంలో మొక్కలు వేసేముందు నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్@ 3 గ్రా/లీ నీటితో తడపండి.

దీనికి కారణమేమిటి?

ఫుసెరియం విల్ట్వ నీరు మరియు పోషకాలు చేరవేసె కణజాలంలో వ్యాపించి, మొక్కలకు పోషకాలను చేరకుండా అడ్డుకుంటాయి. మొక్కల వేరు చివర్లు లేదా వేర్లను తగిలిన దెబ్బల ద్వారా ఈ తెగులు మొక్కలలో ప్రవేశిస్తుంది. ఇవి ఒక సారి ఒక ప్రాంతంలొ స్థిరపడితే అక్కడే ఎన్నో సంవత్సరాల తరబడి జీవిస్తాయి.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధక రకాలను నాటండి.
  • మట్టిలో పి హెచ్ ను 6.5-7.0 మధ్యలో ఉండేలాగా చూసుకోండి మరియు నైట్రేట్ ను నత్రజని వనరులా వాడవచ్చు.
  • తెగులు నిరోధక మొక్కల రకాలు వాడాలి.
  • పొలాన్ని తరుచు గమనిస్తూ తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • పొలంలో ఉపయోగించే పరికరాలను శుభ్రంగా ఉంచండి మరియు పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • సిఫారసు చేసిన మేరకు పొటాష్ ఎరువును మొక్కలకు వేయండి.
  • పంట కోత తరువాత పంట అవశేషాల్ని దున్ని తీసి కాల్చివేయాలి.
  • తెగులుకు గురైన భాగాల్ని మిట్ట మధ్యాహ్న ఎండలో, ఎండ తగిలే విధంగా నల్లటి ప్లాస్టిక్ కవరుతో ఒక నెలపాటు కప్పి ఉంచితే ఫంగస్ చనిపోతుంది.
  • 5-7 సంవత్సరాల వరకు పంట మార్పిడులు నేలలోని ఫంగస్ స్థాయిలను తగ్గించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి