Uromyces appendiculatus
శీలీంధ్రం
పై తొక్క చిరిగిపోయినట్టు వుండే గోధుమరంగు నుండి పసుపు బుడిపెలు ముదురు ఆకుల ప్రక్కభాగంలో ఏర్పడతాయి. ఈ బుడిపెలు చుట్టూ పసుపు రంగు వలయంతో వుంది ముదురు రంగులోకి మారవచ్చు. ఇవి కాండాలు, కాడలు మరియు కాయలపై కూడా వ్యాపిస్తాయి . ఆకులు ఎండిపోయి ముందుగానే రాలిపోతాయి. దీని ప్రభావం పంట దిగుబడిపైన పడుతుంది. తుప్పు తెగులు వలన చిన్న మొక్కల్ని చనిపోతాయి కానీ ఎదిగిన మొక్కలలో దీని ప్రభావం పెద్దగా ఉండదు.
బాసిల్లస్ సబ్టిలిస్, అర్ధోరోబాక్టర్ మరియు స్ట్రెప్టోమైసెస్ వంటి జీవకీటకనాశినులు ఈ తెగులును నియంత్రించి వ్యాపించకుండా చేస్తాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. త్రయాజోల్ మరియు స్ట్రోబిల్లురిన్ సీలింద్ర నాశినులు ఈ తెగులును నియంత్రించడంలో మంచి ఫలితాలను అందిస్తాయి.
యూరోమైసెస్ అప్పెండిక్యులేటస్ ఫంగస్ మట్టిలో ఉన్నమొక్కల అవశేషాల్లో జీవిస్తాయి. ఇది జీవించటానికి మొక్క కణజాలాన్ని తింటుంది. ఇది ఒక ఆబ్లిగేట్ పారసైట్. మొక్కల సహాయం లేకుండా ఇది బ్రతకలేదు. గాలిద్వారా నీటి ద్వారా మరియు కీటకాల వలన ఈ తెగులు ముందుగా వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో చురుకుగా ఉంటుంది. ఈ వాతావరణంలో ఇది చాల త్వరితంగా విస్తరిస్తుంది. ఎక్కువ కాలం వేడి, తేమ శాతం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో అధికంగా ఉంటుంది.