చిక్కుడు

నల్ల మచ్చ తెగులు

Colletotrichum lindemuthianum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • తెగులు సోకిన విత్తనాల నుండి పెరిగిన మొక్కల ఆకులు మరియు కాండములపై గుండ్రని ముదురు గోధుమ నుండి నల్లని మచ్చలు ఉంటాయి.
  • ఇతర విధంగా ఈ తెగులు సోకినపుడు ఆకు ఈనెలు మరియు కాడలు ఇటుక-ఎరుపు నుండి నల్లని మచ్చలు కలిగి ఉంటాయి.
  • గుండ్రని లేత గోధుమ రంగు మచ్చలు కాయలు మరియు కాడలపై కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చిక్కుడు

లక్షణాలు

తెగులు సోకిన విత్తనాల నుండి పెరిగిన మొక్కల ఆకులు మరియు కాండములపై గుండ్రని ముదురు గోధుమ నుండి నల్లని మచ్చలు ఉంటాయి. మొలకల పెరుగుదలలో రాజీ పడాల్సి వస్తుంది మరియు అవి ముందుగానే మరణించచవచ్చు లేదా కుంటుపడిన పెరుగుదల ప్రదర్శించవచ్చు. వేరే విధంగా ఈ తెగులు సోకినపుడు ఆకు ఈనెలు మరియు కాడలు ఇటుక-ఎరుపు నుండి నల్లని మచ్చలు కలిగి ఉంటాయి. అవి మొదట ఆకుల అడుగు భాగంలో కనిపిస్తాయి, ఆపై పై భాగంలో కూడా కనిపిస్తాయి. నల్లని అంచు గల గుండ్రని లేత గోధుమ రంగు మచ్చలు కాయలు మరియు కాండంపై కనిపిస్తాయి. ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే కాయలు వంకర తిరిగి రూపం కోల్పోతాయి. తెగులు సోకిన విత్తనాలు తరుచుగా పాలిపోయిన గోధుమ రంగులో ఉంటాయి. సాధారణ చిక్కుడు జాతి మొక్కలకు ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

మొక్కలు ఎదుగుతున్నప్పుడు, వెచ్చని వాతావరణంలో ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి నిమ్మ నూనె సారాన్ని వాడండం ద్వారా ఈ ఫంగస్ ను నియంత్రించవచ్చు. జీవ నియంత్రణ ఏజెంట్స్ కూడా ఈ ఫంగస్ నివారణకు సహాయపడతాయి. జీవ నియంత్రణ ఏజెంట్స్ అయిన ట్రైకోడెర్మా హర్జియానుమ్ మరియు బ్యాక్టీరియా స్యుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ వాడడంవలన కొల్లెటోత్రిచం లిండేముతియనుమ్ ఈ ఫంగస్ ఎదుగుదలను నియంత్రిస్తాయి. ఈ ఫంగస్ ను చంపడానికి విత్తనాలను వేడి నీటిలో (50°C) 10 నిముషాల పాటు ఉంచాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శీలింద్ర నాశినులను ఆకులపై పిచికారీ చేయడం వలన ఈ తెగులు తీవ్రతను తగ్గించవచ్చు. కానీ ఇది రైతులకు అంత లాభదాయకం కాదు. ఆకులు పొడిగా వున్నప్పుడు మాంకోజెబ్, క్లోరోతలోనిల్, ఫ్లూన్తరియఫోల్, పెన్కోనజోల్ లేదా కాపర్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ,

దీనికి కారణమేమిటి?

నల్లటి ఆకు మచ్చల తెగులు కొల్లితోత్రిచమ్ లిండేముతియనుమ్ అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది ఎక్కువగా విత్తనాలద్వారా సంక్రమిస్తుంది. అయితే పంట అవశేషాల మీద మరియు ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కల మీద కూడా జీవిస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు ఇది గాలి మరియు వర్షాల వలన వ్యాపిస్తుంది. చల్లటి నుండి మధ్యస్థ ఉష్ణోగ్రతలు (13-21°C), అధిక తేమ, తడిగా వున్న ఆకులు, తరుచూ వర్షపాతం ఈ తెగులు వృద్ధిచెందడంలో సహాయపడతాయి. ఆకులు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు తగిలే దెబ్బల నుండి మరియు నీటి ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ కాయలపై దాడి చేసి విత్తనాల పైపొరను ధ్వంసం చేస్తుంది.


నివారణా చర్యలు

  • సర్టిఫైడ్ డీలర్ నుండి కొనుగోలు చేసిన చీడపీడలు లేని విత్తనాలను వినియోగించండి.
  • చీడ పీడలు తట్టుకునే దృఢమైన విత్తనాలను వినియోగించండి.
  • మొక్కల మధ్య గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చూడండి.
  • మొక్కలను లేదా పొలాలను వ్యాధి లక్షణాల కొరకు తనిఖీ చేయండి.
  • మీ పంటలకు దగ్గరలో కలుపులు అధికంగాపెరగకుండా చూడండి ఎందుకంటే కలుపులు ప్రత్యామ్నాయ అతిథేయులుగా పనిచేయవచ్చు.
  • పొలంలో పరిశుభ్రత బాగా ఉండేలా చూసుకోండి.
  • ఆకులు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయవద్దు.
  • పంట కోత పూర్తి అయిన తర్వాత మిగిలిన మొక్కల వ్యర్ధాన్ని మట్టి లోపల వరకు వెళ్ళేటట్టు దున్నండి.
  • ప్రతి రెండు నుండి మూడు సంవత్సరాల కొకసారి అతిథేయులు కాని పంటలతో పంట మార్పిడి చేయండి.
  • ఆరోగ్యకరమైన విత్తనాలకు వ్యాధి సోకకుండా నివారించడానికి విత్తనాలు నిల్వ ఉండే స్థలాన్ని శుభ్రంగా ఉంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి