ఇతరములు

వెర్టిసిలియమ్ విల్ట్

Verticillium spp.

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులు అంచుల నుండి పసుపు రంగులోకి మారతాయి.
  • ప్రధాన ఈనెలు ఆకు పచ్చ రంగులోనే ఉంటాయి.
  • కాండంపైన నల్లని చారలు ఏర్పడతాయి.
  • మొక్క వాలిపోతుంది.

లో కూడా చూడవచ్చు

26 పంటలు
అప్రికోట్
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

వివిధ పంటల మధ్యన లక్షణాలలో చాలా భిన్నత్వం ఉంటుంది. సాధారణంగా ముదురు ఆకుల అంచులపైన ఈనెల మధ్యన పాలిపోవడం(ఇంటర్వీనల్ క్లోరోసిస్) మరియు కణ నాశనం(నెక్రోసిస్) కనిపిస్తుంది. క్లోరోసిస్ మిగిలిన కణాలకు వ్యాపించడం వలన ఆకు ఒక పక్కనే వాడిపోతుంది. ఈ ప్రత్యేకమైన లక్షణాన్నిసెక్టోరల్ కోరోసిస్ లేదా ఒక వైపు వాడిపోవడం అంటారు. ఎండ తీవ్రత ఎక్కువగా వున్నప్పుడు ఇది మరింత తీవ్రతరం అవుతుంది. కాండంపై కిందనుండి పై వరకు నల్లని చారలు వ్యాపిస్తాయి. అందువలన కాండం వాడిపోతుంది. చెట్లలో మందగించిన ఎదుగుదల, ముందుగా ఆకులు రాలిపోవడం, మొత్తం కొమ్మలు ముందుగా చనిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కణజాలంపై గుండ్రటి రింగులవలె మచ్చలు ఏర్పడడం లేదా చారికలు ఏర్పడడం అదనపు లక్షణాలుగా పేర్కొనవచ్చు. కొన్నిసార్లు లెన్స్ తో నిశితంగా పరిశీలిస్తే, చిన్న చిన్న నల్లని చుక్కలు మరణిస్తున్న కణజాలంలో లేదా జీవించి వున్న కణజాలంపై కూడా కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

స్ట్రెప్టోమైసిస్ లిడికస్ ను కలిగి ఉండే జీవ శిలీంద్రనాశకాలు ఫంగస్ యొక్క జీవక్రమాన్ని విచ్ఛిన్నం చేస్తాయి మరియు ఇవి వ్యాధి యొక్క వృద్ధిని నియంత్రించడానికి సహాయం చేయగలవు.

రసాయన నియంత్రణ

అందుబాటులో వున్నట్లైతే జీవసంబంధమైన చికిత్సతో కూడిన నివారణా చర్యలు గల సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. చెట్లకు తెగులు సోకినట్లైతే దానిని వదిలించుకోవడం చాల కష్టమైన పని. సాయిల్ ఫ్యుమిగంట్స్ యొక్క వాడకం సమర్ధవంతమైనదే కానీ చాల ఖర్చుతో కూడిన నియంత్రణ వ్యూహం. అది ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుంది అనేది ఉపయోగించే రసాయనం, రేటు, మరియు ఉపయోగించే సమయంలో వున్న పర్యావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. తెగులు సోకిన మొక్క కు ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ను కూడా ఊహించగలం.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు V దాలియా వంటి భూమిలో వుండే ఫంగి వలన కనిపిస్తాయి. ఆశించడానికి మరి ఏ ఇతర పంట లేకపోయినా ఈ ఫంగి మట్టిలో వున్న పంట శిథిలాలపైన కూడా జీవించగలదు. వేర్లు లేదా గాయమైన బెరడు ద్వారా ఇది మొక్క నాళాల కణజాలంలోకి ప్రవేశిస్తుంది. ఒకసారి మొక్క లేదా చెట్టులోకి ప్రవేశించిన తర్వాత ఇది త్వరితగతిన పెరుగుతూ చెట్టుకు నీరు మరియు ఇతర పోషకాలు అందకుండా అడ్డుపడుతుంది. అందువలన ఆకులు మరియు కాండం కృశించిపోయి వాడిపోతాయి. వెచ్చని ఎండ వాతావరణం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. తెగులు తరువాత దశల్లో ఈ ఫంగస్ చనిపోతున్నకణజాలంలో స్థిరపడి నల్లని నిర్మాణాలుగా ఏర్పడుతుంది. దీనిని భూతద్ధంతో గమనించవచ్చు. ఈ ఫంగస్ ఒకే ప్రదేశంలో చాలా సంవత్సరాలు జీవించగలదు.


నివారణా చర్యలు

  • మంచి వ్యాధినిరోధక మరియు తెగుళ్లను తట్టుకునే మొక్కల రకాలను ఎంచుకోండి.
  • తెగుళ్లను వ్యాపింపచేసే అనుమానిత అంతర పంటలను వేయవద్దు.
  • నత్రజని అధికంగా వుండే ఎరువులు మరియు అధిక నీటి వాడకాన్ని నివారించండి.
  • మొక్కలు తెగుళ్లు సోకకుండా బలంగా ఉండడానికి మొక్క బలవర్ధకాలను ఉపయోగించండి.
  • తెగుళ్లు సోకిన మొక్కల భాగాలను తొలగించి వాటిని తగలపెట్టండి.
  • తెగులు సోకిన మొక్కల నిర్వహణ తర్వాత అందుకు ఉపయోగించిన అన్ని పరికరాలు మరియు సామగ్రిని శుభ్రం చేయండి.
  • ఆకు రెమ్మలు తడిగా ఉన్నప్పుడు పొలాల్లో పని చేయవద్దు.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు వేర్లకు నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకోండి.
  • మట్టికి కొంత సేపు సూర్యరశ్మి (సోలరైజేషన్) తగిలేటట్టు చూడండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి మట్టిలో బాగా లోతుగా పూడ్చిపెట్టండి లేదా తగలపెట్టండి.
  • అతిథేయులు కాని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి