Tranzschelia pruni spinosae
శీలీంధ్రం
ఈ వ్యాధి ఆల్బకరా చెట్లను మరియు అప్పుడప్పుడు ఇతర రాతి పండ్ల జాతి చెట్లను ప్రభావితం చేస్తుంది. వసంత ఋతువు చివరిలో ఆకులపై లక్షణాలను గమనించవచ్చు మరియు చెట్ల జాతి రకాలపై ఆధారపడి ఈ లక్షణాలు కొద్దిగా మారవచ్చు. ప్రారంభంలో, చిన్న, కోణీయాకారపు, ప్రకాశవంతమైన పసుపు రంగు మచ్చలు ఎగువ ఆకుల ఉపరితలంపై మొజాయిక్ తరహా నమూనాను ఏర్పరుస్తాయి. వ్యాధి వృద్ధి చెందుతున్నప్పుడు, దిగువ ఆకు ఉపరితలంపై ఈ మచ్చల క్రింద తుప్పుపట్టిన మరియు లేత గోధుమరంగు స్ఫోటములు కనిపిస్తాయి. సీజన్లో తరువాత, అవి ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతాయి. వ్యాధి తీవ్రంగా సోకిన ఆకులు ఎండిపోయి గోధుమ రంగులోకి మారి వేగంగా రాలిపోతాయి. ఆకులు ముందుగానే రాలిపోవడం వలన తదుపరి సీజన్లలో పువ్వుల అభివృద్ధి మరియు పండ్ల నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, ఇది సంవత్సరాల తరబడి ఒకే చెట్టుపై కొనసాగితే, అది చెట్టు సత్తువను బలహీనపరచవచ్చు. పండ్లపై మచ్చలు పడి అమ్మకానికి పనికిరావు.
సాధారణంగా, ప్రతి సీజన్లో ఈ ఫంగస్ సంక్రమించదు, చెట్టును బలహీనపరచదు మరియు పండ్లను నేరుగా ప్రభావితం చేయదు కాబట్టి దీనికి చికిత్స చేయనవసరంలేదు.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సంక్రమణ యొక్క మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే శిలీంద్ర నాశినులను పిచికారీ చేయడం ప్రారంభించాలి. మైక్లోబుటానిల్, పైరాక్లోస్ట్రోబిన్, బోస్కాలిడ్, మాంకోజెబ్, ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ లేదా డైఫెనోకోనజోల్ ఆధారంగా ఉత్పత్తులను ఉపయోగించడం వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒకవేళ ఆలస్యంగా సంక్రమించినట్లైతే, వీలైతే, పంట కోత తర్వాత నేరుగా చికిత్స చేయాలి.
ట్రాంజ్‌స్చెలియా ప్రూని-స్పినోసే అనే శిలీంధ్రం వలన ఈ లక్షణాలు కలుగుతాయి, ఇది ఒక తప్పనిసరి పరాన్నజీవి, అంటే దాని జీవిత చక్రాన్ని పూర్తి చేయడానికి దీనికి జీవ కణజాలం అవసరం. శీతాకాలంలో కొమ్మల బెరడుపై పగుళ్లలో లేదా మొగ్గ తొడుగులలో బీజాంశంగా శిలీంధ్రం మనుగడ సాగిస్తుంది. ప్రత్యామ్నాయంగా, ఇది వేసవి చివరిలో ఇతర జాతుల మొక్కలనుండి పీచ్ మొక్కలపైకి చేరుతుంది మరియు ప్లమ్ చెట్లు నిద్రాణంగా ఉన్నప్పుడు ఎనిమోన్ జాతికి చెందిన జాతులపై జీవించి ఉంటుంది. ఆకుల దిగువ భాగంలోని మచ్చలు రెండు రకాల బీజాంశాలను ఉత్పత్తి చేసే బీజాంశ ఉత్పత్తి నిర్మాణాలను కలిగి ఉంటాయి: ఒకటి వసంత ఋతువు చివరిలో మరియు వేసవిలో రాతి పండ్లకు సంక్రమిస్తుంది లేదా సీజన్ చివరిలో ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలకు మాత్రమే సంక్రమిస్తుంది. రెండు సందర్భాల్లోనూ, ఆకులపై (మంచు లేదా వర్షం) తేమ వున్నప్పుడు వెంటనే బీజాంశాలు మొలకెత్తుతాయి. తక్కువ ఎత్తులో, తేమతో కూడిన ప్రదేశాలు మరియు హాని కలిగించే రకాలు ఫంగస్ సంభవించడాన్ని సులభతరం చేస్తాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఈ వ్యాధి గమనించబడింది. ఇది వేగంగా వ్యాపిస్తుంది మరియు వాతావరణ పరిస్థితులు దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటే అత్యంత తీవ్రంగా వ్యాపించే అంటువ్యాధిగా మారుతుంది.