Wilsonomyces carpophilus
శీలీంధ్రం
వసంతకాలంలో ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. కొత్త ఆకులపై మరియు అప్పుడప్పుడు చిగుర్లు మరియు మొగ్గలపై ఊదా లేదా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తరచుగా ఈ మచ్చల చుట్టూ లేత ఆకుపచ్చ లేదా పసుపు అంచులు ఉంటాయి. ఇవి విస్తరిస్తున్నప్పుడు వాటి మధ్యభాగం మొదట గోధుమరంగు లేదా తుప్పు-రంగులోకి మారుతుంది. చివరికి రాలి పడిపోతుంది, అందువలనే ఈ వ్యాధికి 'షాట్ హోల్' అనే పేరు వచ్చింది. ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. కొమ్మలు చనిపోయిన మొగ్గలు గాయాలు లేదా జిగురు లాంటి పదార్ధాన్ని స్రవించే పుండ్లను కలిగివుండవచ్చు. సాధారణంగా పండ్ల పైభాగంలో ఊదారంగు అంచులతో కఠినమైన మరియు బెండు చెక్క లాంటి గాయాలు ఏర్పడతాయి. దీంతో పండు అందవిహీనంగా మారి అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. భూతద్దం ద్వారా గాయాల మధ్యలో చిన్న చిన్న నల్లని మచ్చలను గమనించవచ్చు.
చలికాలం ప్రారంభంలో రాగి ఆధారంగా శిలీంద్ర నాశినులను ఉపయోగించడం వ్యాధికి వ్యతిరేకంగా మొదటి రక్షణగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన బోర్డియక్స్ మిశ్రమం లేదా రాగి యొక్క వాణిజ్య సూత్రీకరణలను కొనుగోలు చేయవచ్చు. శరదృతువు చివరిలో కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆకులపై జింక్ సల్ఫేట్‌ను పిచికారీ చేయడం ద్వారా ఆకు రాలడాన్ని వేగవంతం చేసి ఫంగస్ ఉనికిని తగ్గించవచ్చు.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పండ్లను రక్షించడానికి, మొగ్గ దశ ప్రారంభమైనప్పటినుండి రేకుల రాలిపోయే వరకు పుష్పించే కాలానికి ముందు మరియు తరువాత శిలీంద్ర నాశినులను పిచికారీ చేయవచ్చు. పుష్పించే సమయంలో అందుబాటులో వుండే వాతావరణ సమాచారం డేటా పండ్లను రక్షించడానికి పిచికారీ అవసరమా కాదా అని సూచిస్తుంది. ఈ దశలో రాగి వాడకాన్ని సిఫార్సు చేయనందున, థైరామ్, జిరామ్, అజోక్సిస్ట్రోబిన్, క్లోరోథలోనిల్, ఇప్రోడియోన్ ఆధారిత శిలీంద్ర నాశినులు సిఫార్సు చేయబడ్డాయి.
విల్సోనోమైసెస్ కార్పోఫిలస్ అనే ఫంగస్ వల్ల లక్షణాలు ఏర్పడతాయి. ఇది అనేక రకాల రాతి పండ్లకు (పీచ్, బాదం, చెర్రీ మరియు ఆప్రికాట్) సోకుతుంది. ఈ తెగులుకి ప్రత్యామ్నాయ మొక్కలు ఇంగ్లీష్ లారెల్ మరియు ఆల్బకరా. శీతాకాలంలో మొగ్గలు మరియు కొమ్మల గాయాల్లో లేదా మమ్మీ లాగ మారిన పండ్లలో శిలీంధ్రం జీవించిఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఇవి వృద్ధిని పునఃప్రారంభించి బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు తుంపర్ల ద్వారా ఈ బీజాంశాలు ఆరోగ్యకరమైన కణజాలాల పైకి చెదరగొట్టబడతాయి. ఆకులు అధిక సమయం తడిగా ఉండే కాలాలు (14-24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ) మరియు 22 °C ఉష్ణోగ్రతలు ఫంగస్ యొక్క జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటాయి మరియు ఆరోగ్యంగా ఉన్న చెట్లకు సంక్రమించే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. వెచ్చని, పొగమంచు లేదా శీతాకాలంలో వర్షం మరియు వసంత ఋతువులో కురిసే భారీ వర్షాలు బీజాంశం ఏర్పడటానికి మరియు విడుదలకు అనుకూలంగా ఉంటాయి. నిజానికి ఈ వ్యాధి వసంతకాలంలో అసాధారణ తడి వాతావరణంలో మాత్రమే రాతి పండ్ల చెట్లపై వృద్ధి చెందుతుంది.