ఇతరములు

వెండి ఆకు తెగులు

Chondrostereum purpureum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకుల మీద మందమైన, వెండి పొర ఏర్పడుతుంది.
  • కాండం, కొమ్మలు ముదురు గోధుమ రంగులోకి మారి పైనుండి చనిపోతాయి.
  • తెల్లటి ఉన్ని వంటి పై భాగం మరియు ఊదా-గోధుమ రంగు దిగువ భాగంతో బ్రాకెట్ ఆకారపు శిలీంధ్రాలు కనపడతాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
పీచ్
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

ఫంగస్ చేత ప్రభావితమైన ఆకులపై మందమైన, వెండి పైపొర ఏర్పడుతుంది. సాధారణంగా ప్రారంభంలో ఇది ఒకే శాఖకు పరిమితం చేయబడి ఉంటుంది. అయితే కాలక్రమేణా చెట్టు యొక్క ఇతర భాగాలకు వ్యాప్తి చెందవచ్చు. వ్యాధి తరువాతి దశల్లో ఆకులు విడిపోయి అంచులు మరియు మధ్య ఈనె చుట్టూ గోధుమ రంగులోకి మారవచ్చు. ప్రభావిత కాండం యొక్క అంతర్గత కణజాలం బెరడు క్రింద ముదురు గోధుమ రంగులోకి మారడమే కాక చివరికి పైనుండి కిందకు చనిపోతుంది. వేసవి చివరి నుండి, చనిపోయిన కొమ్మల బెరడుపై సమాంతరపు లేదా బ్రాకెట్ ఆకారపు శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయి. తెల్లటి ఉన్ని వంటి పై భాగం మరియు ఊదా-గోధుమ రంగు దిగువ భాగంతో బ్రాకెట్ ఆకారపు శిలీంధ్రాలు కనపడతాయి. రెండు వైపులా బీజాంశం ఉత్పత్తి చేసే భాగాలు ఉండడమే కాక తడిసినప్పుడు మృదువుగా మరియు జారినట్టు ఉంటాయి. పొడిగా వున్నప్పుడు పెళుసుగా మరియు ముడుతలు పడి ఉంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అనేక సందర్భాల్లో, వెండి ఆకు దాడి నుండి చెట్లు సహజంగా కోలుకుంటాయి, కాబట్టి చర్య తీసుకునే ముందు కొంత సమయం వేచి ఉండడం సిఫార్స్ చేయబడింది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వెండి ఆకు పునరావృతమయ్యే ప్రాంతాల్లోని చెట్లలో, పెయింట్స్‌తో కత్తిరింపు కోతలను చికిత్స చేయడం ప్రామాణిక పద్ధతిగా సిఫార్స్ చేయబడింది. అయితే, ఈ గాయాలు వాటికవే సహజంగా నయం కావడం మంచిదని కొందరు నిపుణులు పేర్కొన్నారు.

దీనికి కారణమేమిటి?

కొండ్రోస్టెరియం పర్ప్యూరియం అనే ఫంగస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి, ఇవి కాండం మరియు చనిపోయిన కొమ్మలపై బీజాంశాలను ఉత్పత్తి చేసే భాగాలను నిర్మిస్తాయి. ఈ నిర్మాణాలు బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. తరువాత అవి విడుదల కాబడి గాలి ద్వారా ఆరోగ్యకరమైన చెట్లు మరియు పొదలకు రవాణా చేయబడతాయి. ప్రధానంగా ఇవి కత్తిరింపు వలన కలిగిన గాయాల ద్వారా కణజాలంలోకి ప్రవేశిస్తాయి. ఇవి చెక్కలోకి పెరిగేకొద్దీ దానిని నెమ్మదిగా చంపి అంతర్గత కణజాలాల యొక్క లక్షణమైన నల్లటి మరకను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ద్రవం ప్రవాహం ద్వారా ఆకుల వరకు వెళ్లే ఒక విషపూరిత పదార్ధాన్ని కూడా స్రవిస్తాయి. ఈ విషపూరిత పదార్ధం కణజాలాలను దెబ్బతీస్తుంది మరియు విడిపోయేటట్టు చేసి వాటికి వెండి రంగు రూపాన్ని ఇస్తుంది. కాబట్టి, వాస్తవానికి ఫంగస్ ఆకులలో లేనప్పటికీ, ఇది ఆకులు మరియు కొమ్మలను చంపగలదు. తరువాత ఫంగస్ యొక్క బీజాంశాలను ఉత్పత్తి చేసే భాగాలు చనిపోయిన చెక్కపై కనిపిస్తాయి మరియు వీటి జీవిత చక్రం తిరిగి ప్రారంభమవుతుంది. తుంపర్లు, వర్షం, పొగమంచు లేదా తేమతో కూడిన రోజులు బీజాంశం విడుదల, సంక్రమణకు సరైన పరిస్థితులను కల్పిస్తాయి.


నివారణా చర్యలు

  • శుభ్రమైన, క్రిమిసంహారకంతో శుభ్రపరచిన పరికరాలతో మాత్రమే పని చేయండి.
  • చెట్లను అనవసరమైన గాయాల నుండి రక్షించండి.
  • పండ్ల తోటను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • వసంత ఋతువు చివర్లో లేదా వేసవిలో రొటీన్ గా కత్తిరింపు చేపట్టడం ప్రధాన సంక్రమణ దశను నివారిస్తుంది.
  • తడి వాతావరణ పరిస్థితులు సంక్రమణకు అనుకూలంగా ఉంటాయి అందువలన ఆ సమయంలో కత్తిరింపు చేయవద్దు.
  • బీజాంశాల అంకురోత్పత్తిని నివారించడానికి గాయాలను డ్రెస్సింగ్‌తో కప్పండి.
  • ఫంగస్ యొక్క బీజాంశాలను ఉత్పత్తి చేసే భాగాలు నిరంతరం ఏర్పడుతునే ఉంటాయి.
  • అందువలన వాటిని కాల్చడం లేదా పాతిపెట్టడం ద్వారా నిర్మూలించండి.
  • తోటలో మరియు చుట్టుపక్కల ఉన్న విల్లోస్ మరియు పాప్లర్స్ వంటి ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి