పియర్

యూరోపియన్ పియర్ రస్ట్

Gymnosporangium sabinae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ప్రకాశవంతమైన-నారింజ-ఎరుపు, వృత్తాకార మచ్చలు ఆకుల ఉపరితలంపై కనిపిస్తాయి.
  • ఆకుల దిగువ భాగంలో గోధుమరంగు మరియు పులిపిర్లు లాంటివి ఏర్పడతాయి.
  • అప్పుడప్పుడు, కొమ్మలు మరియు లేత కాండం బెరడులో నొక్కుకుపోయినట్టు ఉండే క్యాంకర్‌లు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పియర్

పియర్

లక్షణాలు

మొదట చిన్న, గోధుమ రంగు, వృత్తాకార మచ్చలు ఆకుల పైభాగంలో వృద్ధి చెందుతాయి. అవి పెరిగేకొద్దీ, అవి ముదురు గోధుమ రంగు మధ్యలో ప్రకాశవంతమైన నారింజ-ఎరుపు రంగులోకి మారుతాయి. వేసవి చివరలో, ఆకుల దిగువ భాగంలో గోధుమరంగు మరియు పులిపిర్లు లాంటి పెరుగుదలను గమనించవచ్చు. అప్పుడప్పుడు, కొమ్మలు మరియు లేత కాండం బెరడులో నొక్కుకుపోయినట్టు ఉండే క్యాంకర్లు కూడా ఏర్పడతాయి. పండ్లు నేరుగా ప్రభావితం కానప్పటికీ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి మరియు పంటకు నష్టం వాటిల్లుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ వ్యాధికి జీవసంబంధమైన చికిత్స తెలియదు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సాధారణంగా ఇన్ఫెక్షన్ తక్కువ స్థాయిలో ఉంటే అది సమస్య కాదు అందువలన పట్టించుకోనవసరం లేదు. వ్యాధిని నియంత్రించడానికి డైఫెనోకోనజోల్‌ ఆధారిత శిలీంద్ర నాశినులను ఉపయోగించవచ్చు. ఇంటి తోటల పెంపకందారుల కోసం, తుప్పు వ్యాధుల నియంత్రణ కోసం శిలీంద్రనాశకాలు టెబుకోనజోల్, ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ మరియు ట్రైటికోనజోల్‌తో కూడిన టెబుకోనజోల్ ఆమోదించబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

పియర్ చెట్లు మరియు జునిపెర్‌లపై దాడి చేసే జిమ్నోస్పోరంగియం సబినే అనే శిలీంధ్రం వల్ల లక్షణాలు కలుగుతాయి. ఈ వ్యాధి కారక సూక్ష్మజీవులకు పియర్స్ ఒక మధ్యంతర అతిధేయ మొక్క మాత్రమే మరియు దాని జీవిత చక్రాన్ని పూర్తి చేయడానికి రెండు చెట్లూ అవసరం.ఇది చనిపోయిన మొక్కల పదార్థాలపై మనుగడ సాగించలేదు, కాబట్టి ఇది అతిధేయ మొక్కలపై ప్రత్యామ్నాయంగా మారుతూ ఉండాలి. జునిపెర్‌లో ఫంగస్ నిద్రాణస్థితిలో ఉంటుంది, ఇది దాని ప్రాథమిక హోస్ట్. వసంతకాలంలో, బీజాంశం జునిపెర్ నుండి వ్యాపిస్తుంది మరియు సమీపంలోని పియర్ చెట్లకు సోకుతుంది. పియర్ ఆకుల దిగువ భాగంలో కనిపించే మచ్చలు నిజానికి బీజాంశాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణాలు. ఈ బీజాంశాలు పియర్ ఆకులకు మళ్లీ సంక్రమించవు, కాబట్టి వేసవి చివరి నాటికి, కొత్త జునిపెర్‌లకు సోకడానికి అవి చాలా దూరం (500 మీటర్ల వరకు) చెదరగొట్టబడతాయి. అక్కడ, ఇవి కొమ్మలపై శాశ్వతమైన కొమ్ము లాంటి వాపులను కలిగిస్తుంది. అధిక తేమ ఉండే సీజన్ తరువాత, వసంతకాలంలో ఈ పెరుగుదలలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.


నివారణా చర్యలు

  • జునిపెర్లపై శిలీంధ్ర నిర్మాణాలను జాగ్రత్తగా కత్తిరించండి.
  • ప్రత్యామ్నాయంగా, సమీపంలో ఉన్న జునిపెర్ చెట్లను తొలగించండి.
  • మీ పియర్ చెట్లు బలంగా ఎదగడానికి మొక్కల బలవర్ధకాలను జోడించండి.
  • పియర్‌పై ఏదైనా వ్యాధి సోకిన కొమ్మ కనిపిస్తే ఆకు మాత్రమే కాకుండా మొత్తం కొమ్మను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి