Venturia inaequalis
శీలీంధ్రం
ఆపిల్ స్కాబ్ యొక్క మొట్టమొదటి కనిపించే లక్షణాలు, వసంత ఋతువులో ఆకులపై సూక్ష్మ పరిమాణంలో, వృత్తాకార, ఆలివ్-ఆకుపచ్చ మచ్చలు తరచుగా ప్రధాన ఈనె వెంబడి కనిపిస్తాయి. ఇవి విస్తరించినప్పుడు గోధుమ-నలుపు రంగులోకి మారుతాయి మరియు చివరికి ఒకదానితో మరొకటి కలిసిపోయి నిర్జీవమైన కణజాలం యొక్క పెద్ద పాచెస్ ఏర్పడతాయి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే దెబ్బతిన్న ఆకులు తరచూ రూపం కోల్పోయి ముందుగానే రాలిపోతాయి. ఈ తెగులు, రెమ్మలపై పొక్కులు మరియు పగుళ్లకు కారణమవుతాయి. అది అవకాశవాద వ్యాధికారక సూక్ష్మ జీవుల ప్రవేశానికి అవకాశం కల్పిస్తుంది. పండ్లపై, గోధుమ నుండి ముదురు గోధుమ రంగు వృత్తాకార ప్రాంతాలు కనిపిస్తాయి. ఇవి మరింత వృద్ధి చెందుతున్నప్పుడు తరచూ ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉబ్బెత్తుగా, గట్టిగా మరియు కార్కిగా మారతాయి. ఇది పండు ఎదుగుదలను పరిమితం చేస్తుంది మరియు రూపం కోల్పోయి పగుళ్లు ఏర్పడి లోపలి కండను బహిర్గతం చేస్తుంది. తేలికపాటి దాడులు పండ్ల నాణ్యతను అంతగా ప్రభావితం చేయవు. ఏదేమైనా, ఈ పొక్కులు నిల్వ సామర్థ్యాన్ని మరియు నాణ్యతను తగ్గించి పండ్లను అవకాశవాద వ్యాధికారక సూక్ష్మ జీవులకు బహిర్గతం చేస్తాయి మరియు కుళ్లిపోయేటట్టు చేస్తాయి.
మునుపటి సీజన్లో వ్యాధి స్థాయిలు ఎక్కువగా ఉంటే, శీతాకాలంలో చెట్టుపై శిలీంధ్రాల పెరుగుదలకు ఆటంకం కలిగించే విధంగా ద్రవరూప రాగి శిలీంధ్ర నాశినులను పిచికారీ చేయవచ్చు. గంధకం పిచికారీలు ఆపిల్ స్కాబ్‌కు వ్యతిరేకంగా పాక్షికంగా మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అయినప్పటికీ, ఎదుగుతున్న కాలంలో వ్యాధి యొక్క సేంద్రీయ నియంత్రణ కోసం గంధకం మరియు పైరెత్రిన్‌లను కలిగి ఉన్న ద్రావణాలు అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వ్యాధిని నివారించడానికి డోడిన్, కెప్టన్ లేదా డైనతియన్ వంటి రక్షిత శిలీంధ్ర నాశినులను మొగ్గ చుట్టూ పిచికారీ చేయవచ్చు. తెగులు కనబడిన తర్వాత, ఫంగస్ అభివృద్ధిని నియంత్రించడానికి డైఫెనోకొనజోల్, మైక్లోబుటానిల్ లేదా గంధకం ఆధారిత శిలీంధ్ర నాశినులు ఉపయోగించవచ్చు. ప్రతిఘటన వృద్ధిని నివారించడానికి వివిధ రసాయన గ్రూపుల నుండి స్కాబ్ శిలీంధ్ర నాశినులను ఉపయోగించండి.
ఆపిల్ స్కాబ్ అనేది వెంచురియా ఇనాక్వాలిస్ అనే ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. శీతాకాలంలో ఇది ప్రధానంగా భూమిపై వున్న తెగులు సోకిన ఆకులపై మాత్రమే కాకుండా మొగ్గ పొలుసులు లేదా చెక్కపై గాయాలు కూడా జీవిస్తుంది. వసంత ఋతువు ప్రారంభంలో, ఫంగస్ పెరుగుదలను తిరిగి ప్రారంభించి, బీజాంశాలను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తుంది. తరువాత ఇవి గాలి ద్వారా విడుదల చేయబడతాయి మరియు చెదరగొట్టబడతాయి. ఈ బీజాంశం ఎదుగుతున్న ఆకులు మరియు పండ్లపై చేరి కొత్త సంక్రమణను ప్రారంభిస్తుంది. ఇంకా తెరుచుకోని పండ్ల మొగ్గల యొక్క బయటి భాగాలు ఈ తెగులుకు ఎక్కువగా గురవుతాయి. అయినప్పటికీ, పండు పరిపక్వం చెందుతున్నప్పుడు ఈ తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ తెగులు సంక్రమించడానికి తేమతో కూడిన వాతావరణం, ఆకులు లేదా పండ్లు తడిగా ఉండడం అవసరం. ప్రత్యామ్నాయ అథోది మొక్కల్లో కోటోనేస్టర్, పైరకాంత మరియు సోర్బస్ జాతికి చెందిన పొదలు ఉన్నాయి. అన్ని ఆపిల్ రకాలు ఈ పొక్కు తెగులుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధికి గాలా మొక్కలు ఎక్కువగా గురవుతాయి.